CURRENT AFFAIRS IN TELUGU 5th APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 5th APRIL 2023

1) ఐరాస గణాంక కమీషన్ సభ్యదేశంగా భారత్ ఎప్పటినుండి నాలుగేళ్ళ పాటు ఉండనుంది.?
జ : జనవరి – 01 – 2024 నుంచి

2) 2022 – 23 సంవత్సరానికి సంబంధించి జీఐ ట్యాగ్ లు అధికంగా పొందిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ

3) రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ఏ యుద్ధ విమానంలో ప్రయాణించనున్నారు.?
జ : సుఖోయ్

4) మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ఎంతమంది భారత క్రికెటర్లకు జీవిత కాల సభ్యత్వాన్ని ఇచ్చింది.?
జ : 5 గురు (ధోనీ, యువరాజ్, రైనా, జులన్ గోస్వామి, మిథాలి)

5) ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన వారణాసి కి సంబంధించిన పదార్థాలు ఏవి.?
జ : బెనారసి పాన్, బెనారసి లాంగ్డా మామిడి

6) ఏ భారతీయ అంతరిక్ష స్టార్ట్ అప్ సంస్థ విజయవంతంగా త్రీడి ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ ను పరీక్షించింది..?
జ : స్కైరూట్ ఏరోస్పేస్

7) సలార్ డి అటకామా అనే అతిపెద్ద ఉప్పు ప్రాంతాన్ని ఏ దేశంలో కనిపెట్టారు.?
జ : చీలీ

8) “సీ లాంఫ్రే” అనేది ఇటీవల వార్తాలలో నిలిచింది. ఏమిటిది.?
జ : చేప

9) అరుణాచల్ ప్రదేశ్ లోని ఎన్ని ప్రాంతాలకు నూతన పేర్లను చైనా పెట్టింది.?
జ : 11 ప్రాంతాలకు

10) ఐపీఎల్ లో ఇటీవల 5,000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ ఎవరు.?
జ : ఎంఎస్ ధోనీ

11) ఏ బ్యాంక్ ఇటీవల స్టార్ట్ అప్ సంస్థల కోసం ప్రత్యేక బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది.?
జ : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

12) ఏ ఆఫ్రికా దేశం ఇటీవల తన మొదటి “యు ఎర్త్ అబ్జర్వేషన్” శాటిలైట్ ను ప్రయోగించింది.?
జ : కెన్యా