JOBS – వైద్యారోగ్య శాఖలో 2500 ఉద్యోగాల భర్తీ – మంత్రి రాజనర్సింహ

BIKKI NEWS (FEB. 08) : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సులు, డాక్టర్లు, వివిధ రకాల సిబ్బంది కలిపి సుమారు 10 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో 2,500 ఖాళీలను భర్తీ చేస్తామని (2500 JOBS IN MEDICAL and HEALTH DEPARTMENT) రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులతో కలిసి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను రాజనర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2,500 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు.

దశల వారీగా మిగతా వాటిని కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం జాబ్ కేలండర్ ను అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ముందుకు తీసుకె ళ్తామని రాజ నర్సింహ తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 1,800 వ్యాధులకు రూ.487 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.