BIKKI NEWS (JAN. 11) : తెలంగాణ రాష్ట్రం లోని 15 యూనివర్సిటీలలో 1,977 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక (1977 posts vacant in telangana universities) అందింది. గవర్నర్ వద్ద ఉన్న ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు’ ను ప్రస్తుత ప్రభుత్వం ఆమోదింపచేసుకుంటే ఈ పోస్టులను భర్తీ చేయవచ్చు. లేదా బిల్లును ఉపసంహరించుకొని యూనివర్సిటీల వారీగా పోస్టులను భర్తీ చేయవచ్చు.
2017లోనే 1,061 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది..మరో 1,977 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని వర్సిటీలకు మొత్తంగా 2,825 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 873 మంది ఆచార్యులు పనిచేస్తుండగా, 1,977.ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,013, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 757, ప్రొఫెసర్ పోస్టులు 207 ఖాళీగా ఉన్నాయి.
అయితే ఈ పోస్టులను కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని గత టిఆర్ఎస్ ప్రభుత్వం భావించింది అయితే ఆ బిల్లును గవర్నర్ ఆమోదం తెలుపకుండా నిలిపివేసింది. ప్రస్తుత ప్రభుత్వం బిల్లును ఆమోదింపచేసుకొని ఈ పోస్టులను భర్తీ చేస్తుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.