Home > EDUCATION > ENTRANCE EXAMS – ప్రవేశ పరీక్షలకు కొత్త నిబంధన

ENTRANCE EXAMS – ప్రవేశ పరీక్షలకు కొత్త నిబంధన

BIKKI NEWS (FEB. 09) : 15 minutes before entrance exam center gates will closed. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు అమలు చేస్తున్న ఒక్క నిమిషం లేటు నిబంధనను బదులు ఈ నూతన రూల్ ను తీసుకువచ్చింది.

15 minutes before entrance exam center gates will closed

నూతన నిబంధన ప్రకారం ప్రవేశ పరీక్షా కేంద్రం యొక్క గేట్లను 15 నిమిషాల ముందే పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. దీంతో విద్యార్థులు 15 నిమిషాలు ముందే ప్రవేశ పరీక్ష కేంద్రానికి చేరుకొని తమ తమ కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఈ నిబంధన జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రూల్ ను రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కూడా అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈ విద్యా సంవత్సరం నుండి అమలులోకి రానుంది.

ఇప్పటికే ఉన్నత విద్యా మండలి వివిధ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ షెడ్యూల్ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు