BTech Seats – స్లైడింగ్ తర్వాత మిగిలిన బీటెక్ సీట్లు 11836

BIKKI NEWS (AUG. 25) : 11836 BTech seats available for spot counseling. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో 2024 – 25 విద్యా సంవత్సరం కోసం ప్రవేశాల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 86,943 సీట్లు ఉండగా… 75,107 మంది అడ్మిషన్లు పొందారు. మొత్తంగా 11,836 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి.

11836 BTech seats available for spot counseling

ఈ మిగిలి ఉన్న 11,836 సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా ఉన్నత విద్యాశాఖ భక్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. స్లైడింగ్ ప్రక్రియను కూడా ఉన్నత విద్యాశాఖే చేపట్టిన సంగతి తెలిసిందే.

స్లైడింగ్ ప్రక్రియలో సీట్లు పొందిన విద్యార్థులు వెబ్సైట్లో ఇవ్వబడిన అలాట్మెంట్ ఆర్డర్ ను ప్రింట్ తీసి సంబంధించిన కాలేజీలో సమర్పించడానికి గడువు ఆగస్టు 25.

ఒకవేళ వీళ్ళు కళాశాలలో రిపోర్టు చేయకపోతే ఆ సీట్లు కూడా మిగులుతాయి. అన్నిటిని కలిపి త్వరలోనే స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://tgeapcet.nic.in/default.aspx

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు