రాజ్‌కోట్ (డిసెంబర్ – 16) : VIJAY HAZARE TROHY 2023 WON BY HARYANA. విజయ్ హజరే ట్రోఫీ 2023ను హర్యానా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్ లో రాజస్థాన్ పై 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ గెలుచుకుంది. హర్యానాకు ఇదే మొట్టమొదటి విజయ్ హజారే ట్రోఫీ కావడం విశేషం. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీని కూడా పంజాబ్ మొదటిసారి ఈ ఏడాది గెలుచుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్యానా జట్టు 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులను సాధించింది. అంకిత్ కుమార్ 88, మొనాలియొ 70 పరుగులతో రాణించడంతో హర్యానా 287 పరుగులు సాధించగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో అంకిత్ చౌదరి – 4, అరాఫత్ ఖాన్ 2 వికెట్లతో రాణించారు.
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 257 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రాజస్థాన్ ఓపెనర్ అభిజిత్ తోమర్ (106) సెంచరీ, కునాల్ సింగ్ తోమర్ 79 పరుగులతో రాణించిన జట్టును విజేతగా నిలపలేకపోయారు. కెప్టెన్ దీపక్ హూడా డకౌట్ గా వెనుతిరిగాడు. హర్యానా బౌలర్లలో సుమిత్ కుమార్, హర్షల్ పటేల్ తలో 3 వికెట్లు, అన్సూల్ కంబోచ్, రాహుల్ తేవాటియా తలో రెండు వికెట్లు తీశారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా హర్యానా బౌలర్ సుమిత్ కుమార్ నిలిచాడు.