BIKKI NEWS (APRIL 21) : ప్రపంచంలోనే మరియు చరిత్రలోనే ఇప్పటివరకు దొరికిన అతిపెద్ద వాము శిలాజంగా గుజరాత్ ఖర్చు ప్రాంతంలో లభించినట్లు ఐఐటీ ఎరువురికి పరిశోధకులు చేసిన పరిశోధనలో వెల్లడయింది. ఈ పాముకి వాసుకి ఇండికస్ (vasuki indicus a big snske fossil found in india ) అనే నామకరణాన్ని పరిశోధకులు చేశారు. వాసుకి అంటే శివుడి మెడలో ఉండే పాము పేరు. ఇది దాదాపు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉండేదని పేర్కొన్నారు.
ఖర్చు లోని పనాండ్రో లిగ్నైట్ మైన్ లో దొరికిన 27 ఎముకలు ఈ పాముకు సంబంధించినవని పేర్కొన్నారు ఈ పాము దాదాపు 11 నుండి 15 మీటర్ల పొడవు ఉండొచ్చని పేర్కొన్నారు.
ఇప్పటివరకు గుర్తించబడిన ప్రపంచంలోనే అతి పెద్ద పాము అయినా టైటానోబోవా కంటే పెద్దదని పరిశోధకులు తెలిపారు.
ఈ పాము భారత్, ఆఫ్రికా, యూరోప్ లలో జీవించి అంతరించిపోయిన మడ్సోయిడే కుటుంబానికి చెందినది ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.
‘వాసుకి ఇండికస్’ పాము శిలాజాలు తొలిసారి 2005లో ప్రొఫెసర్ సునిల్ వాజ్‌పేయీ గుర్తించారు. మొదట్లో ఈ అవశేషాలు మొసలి శిలజాలు కావచ్చని భావించారు. తర్వాత ఈ శిలాజం సాధారణ మొసలిది కాదని, ఇదొక పాము శిలాజమని అవగాహనకు వచ్చారు.