న్యూడిల్లీ (మే – 16) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ – II (UPSC NDA & NA – II NOTIFICATION 2024) ద్వారా మొత్తం 404 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
జూలై – 2025 నుంచి ప్రారంభమయ్యే 154వ కోర్సులో, 116వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఎసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
ఖాళీల వివరాలు : NDA – 370, NA – 34
అర్హతలు : ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయోపరిమితి : అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 02- జనవరి -2006 నుండి 01- జనవరి -2009 మధ్య జన్మించాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ. 100/- (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : జూన్ – 04 – 2024 వరకు
పరీక్ష తేదీ : సెప్టెంబర్- 01 – 2024
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.