BIKKI NEWS (SEP. 16) : UPSC ENGINEERING SERVICES EXAM 2025 NOTIFICATION. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. . ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలలో 232 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
UPSC ENGINEERING SERVICES EXAM 2025 NOTIFICATION
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు : 2024 సెప్టెంబర్ 18న ప్రారంభమై.. అక్టోబర్ 8వ తేదీతో ముగుస్తుంది.
దరఖాస్తు ఫీజు : 200/- (SC, ST, మహిళలు, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.)
పరీక్ష తేదీ : 2025 ఫిబ్రవరి 9న రాత పరీక్ష నిర్వహిస్తారు.
విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ చదివిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
వయోపరిమితి : జనవరి 01 – 2025 నాటికి 21 – 30 ఏళ్ల మద్య ఉండాలి. రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు
పరీక్ష విధానం : స్టేజ్-1(ప్రిలిమినరీ/ స్టేజ్-1) ఎగ్జామ్, స్టేజ్-2(మెయిన్/ స్టేజ్-2) ఎగ్జామ్, స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://upsc.gov.in/