BIKKI NEWS (MARCH 07) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 1, గ్రూప్ – 2, గ్రూప్ – 3 పరీక్షల షెడ్యూల్ ను (TSPSC RELEASED GROUP 1and 2 and 3 exams dates) విడుదల చేసింది.
గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ – 21 నుండి నిర్వహించనున్నారు. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ను జూన్ – 09 నిర్వహించనున్న విషయం తెలిసిందే. గ్రూప్ – 1 నోటిఫికేషన్ ద్వారా 563 పోస్టులు భర్తీ చేయనున్నారు. (APPLICATION LINK)
గ్రూప్ – 2 పరీక్షలను ఆగస్ట్ – 7, 8 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. (NOTIFICATION & SYLLABUS)
గ్రూప్ – 3 పరీక్షలను నవంబర్ – 17, 18 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,388 పోస్టులను భర్తీ చేయనున్నారు. (NOTIFICATION & SYLLABUS)