TS EAPCET 2024 – విద్యార్థులకు ముఖ్య నిబంధనలు

BIKKI NEWS (APRIL 29) : తెలంగాణలో ఈఏపీసెట్‌(TS EAPCET 2024 GUIDELINES FOR STUDENTS) పరీక్షకు మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్ష హజరవుతున్న విద్యార్థులకు ముఖ్య నిబంధనలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు.

  • పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లకు అనుమతి లేదు.
  • ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లకు అనుమతి లేదు.
  • చేతులకు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడదు.
  • 90 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • ఈ ఏడాది ఫేషియల్‌ రికగ్నేషన్‌ ద్వారా అభ్యర్థుల గుర్తింపును అమలు చేస్తారు.

విద్యార్థులు ఒకే సమయంలో మరో పరీక్ష రాయాల్సిఉంటే గనక విద్యార్థులు ముందుగా విజ్ఞప్తి చేసుకుంటే వారికి అనుకూలమైన తేదీలో పరీక్ష నిర్వహించేలా చూస్తామన్నారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్‌కు 2,54,543 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మాకు 1,00,260 మంది చొప్పున మొత్తంగా 3,54,803 దరఖాస్తులు అందినట్లు చెప్పారు.  

నోటిఫికేషన్‌ ఇచ్చే సమయానికి విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు పూర్తి కాలేదని, అందువల్ల ఈ ఏడాది ఏపీ విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయని స్పష్టంచేశారు.