Home > JOBS > TGPSC > GROUP 2- గ్రూప్-2 పరీక్షల వాయిదాకు కృషి

GROUP 2- గ్రూప్-2 పరీక్షల వాయిదాకు కృషి

BIKKI NEWS (JULY 19) : trying for tgpsc group 2 postponement. డీఎస్సీ , గ్రూప్ 2 పరీక్షల మధ్య తక్కువ వ్యవధి మాత్రమే ఉందని, ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదాపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చేలా కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లం నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.

trying for tgpsc group 2 postponement

వారు గురువారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో సమావేశమై.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉందని నిరుద్యోగులు వాపోయారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలను మే, జూన్ లో నిర్వహించాల్సి ఉండగా అభ్యర్థుల డిమాండ్ మేరకు.. డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించామని బల్మూరి వెంకట్ తెలిపారు. అప్పటికే టీజీపీఎస్సీ పరీక్షలకు తేదీలు ఇవ్వడంతో ఇప్పుడు డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయని ఎంపీ చామల వివరించారు. ఈ విషయంలో నిరుద్యోగులది న్యాయమైన డిమాండే కాబట్టి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గ్రూప్ 2 వాయిదా వేసేలా కృషి చేస్తామని హామీఇచ్చారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు