Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024

BIKKI NEWS (DEC 09) : TODAY NEWS IN TELUGU on 9th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 9th DECEMBER 2024

TELANGANA NEWS

సచివాలయంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో నేడు జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

గ్రామ స్థాయిలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ర్టానికి 7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 3 కంపెనీలతో ఒప్పందం కుదిరింది.

ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతామని, ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో నిలదీస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పష్టంచేశారు.

తిట్లు, ఒట్లు, నోట్లు.. కాంగ్రెస్‌ ఏడాది పాలనపై హరీశ్‌రావు సెటైర్లు

ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు, నటుడు మనోజ్‌ మధ్య ఆస్తుల విషయమై గొడవ ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తున్నది

ANDHRA PRADESH NEWS

ఈ నెల 17న ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

టీడీపీకి ఓ చట్టం.. వైసీపీకి ఒక చట్టమా? : కూటమిని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నియమించిన సిట్‌లోని సభ్యులను మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

NATIONAL NEWS

ఆధ్యాత్మిక పర్యాటకం, ఆర్థిక వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో శీతాకాల చార్‌ధామ్‌ యాత్రను ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదివారం ప్రారంభించారు.

‘మమతా బెనర్జీ సమర్థురాలు’.. ‘ఇండియా’ బ్లాక్‌ లీడర్‌గా శరద్ పవార్ మద్దతు

ఈవీఎంలకు వ్యతిరేకంగా ఎన్సీపీ నిరసన.

రైతుల ‘ఛలో ఢిల్లీ’ ఉద్రిక్తం.. లాఠీ చార్జ్‌, టియర్‌గ్యాస్‌ ప్రయోగం.

INTERNATIONAL NEWS

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్ అసద్‌ మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న విమానాన్ని తిరుగుబాటుదారులు కూల్చివేసినట్లు సమాచారం.

రష్యా-ఉక్రెయిన్‌ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్‌ పిలుపునిచ్చారు.

నాటో నుంచి అమెరికాను బయటకు తీసుకురావడానికి తాను సిద్ధమేనని ట్రంప్ హెచ్చరించారు

పశ్చిమాసియా దేశమైన సిరియాలో అసద్‌ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది

BUSINESS NEWS

ఈవారం స్టాక్ మార్కెట్ లో లాభాలు కొనసాగే అవకాశం ఉంది.

18,500 కోట్లు లక్ష్యంగా 11 కంపేనీలు ఐపివో కు రానున్నాయి.

దేశంలో లక్ష కోట్లకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చేరాయి.

SPORTS NEWS

అడిలైడ్‌ టెస్టులో భారత్‌కు భారీ ఓటమి. పది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం. 1-1తో సిరీస్‌ సమం

ఏసీసీ అండర్‌-19 ఆసియా కప్‌ క్రికెట్ విజేతగా బంగ్లాదేశ్ నిలిచింది. ఫైనల్‌లోనూ యువ భారత్‌కు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది

ప్రపంచ చెస్ చాంఫియన్‌ఫిప్ లో 11వ రౌండ్‌లో గుకేశ్‌ విజయం సాధించి 6 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ లిరెన్‌ 5 పాయింట్లతో ఉన్నాడు.

EDUCATION & JOBS UPDATES

CLAT 2025 ఫలితాలు విడుదల

నేడు గ్రూప్ 2 హల్ టికెట్లు విడుదల

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు