Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 09 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 09 – 2024

BIKKI NEWS (SEP. 07) : TODAY NEWS IN TELUGU on 7th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 7th SEPTEMBER 2024

TELANGANA NEWS

ఎస్సీ గురుకుల సొసైటీలోని పార్ట్‌ టైం ఉద్యోగుల తొలగింపుపై ఎట్టకేలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తలొగ్గింది. రాత్రికిరాత్రే విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.

ఎస్సీ గురుకుల సొసైటీలోని పార్ట్‌ టైం ఉద్యోగుల తొలగింపుపై ఎట్టకేలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తలొగ్గింది. రాత్రికిరాత్రే విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. నెలన్నరగా మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం 11.47గంటలకు తుదిశ్వాస విడిచారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎఫ్‌) నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు రూ.3,448 కోట్లు తీసుకోవాలని కేంద్రం సలహా ఇచ్చింది.

వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్‌ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు.

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది

రాష్ట్రంలో పాఠశాల విద్య అత్యంత సంక్షోభంలో ఉన్నది.. బోధన అభ్యసన రంగాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో ఎడ్యుకేషనల్‌ ఎమర్జెన్సీ (విద్యా అత్యయిక పరిస్థితి)ని విధించాలని ‘తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) అభిప్రాయపడింది.

రాష్ట్రంలో ఇటీవల కురిసి న భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్ననట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం మూడు కమిషన్లకు చైర్మన్లను నియమించింది. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌గా ఎం కోదండరెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిని నియమించింది.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయంలో కూల్చివేతలు ఉంటాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల నుంచి డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించేందుకు అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించనున్నారు.

ANDHRA PRADESH NEWS

ఆగస్టు నెలలో శ్రీవారి ఆదాయం రూ. 125.67 కోట్లు

బుడమేరు మూడో గండిని పూడ్చేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బంది

టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై బలాత్కారం, బెదిరింపు కేసు నమోదు

శ్రీశైలం ఆలయానికి 108 బంగారు పూలు విరాళం

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరాల విషయంపై ఐజీ అశోక్‌కుమార్‌ కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని ఆయన తెలిపారు.

మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రాణహాని ఉందని స్టేట్‌ సెక్యూరిటీ రివ్యూ కమిటీ అంగీకరించింది. అందుకే జెడ్‌ ప్లస్‌ భద్రతను కొనసాగించాలని సిఫారసు చేసినట్టు తెలిపింది.

NATIONAL NEWS

ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల్లోనే కిలో రూ.10 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్‌ ముడిచమురు ధర 9 నెలల కనిష్ఠానికి చేరినప్పటికీ, దేశీయంగా ఇంధన ధరలను మాత్రం కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఇంకా తగ్గించట్లేదు.

ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. మనలో దేవుడు ఉన్నాడా? లేదా? అన్నది ప్రజలు నిర్ణయించాలని, మనకు మనం దేవుడిగా అనుకుంటే సరిపోదంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అగ్ని-4 బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్‌ శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. మధ్యస్థ రేంజ్‌ క్షిపణి అయిన అగ్ని-4ను ఒడిశాలోని చాందీపూర్‌నుంచి ప్రయోగించినట్టు అధికారులు తెలిపారు.

జమ్ము కశ్మీర్‌ శాసన సభ ఎన్నికల్లో రికార్డులు నమోదవడం ప్రారంభమైంది. మూడు దశాబ్దాల్లో తొలిసారి ఓ కశ్మీరీ పండిట్‌ మహిళ డైజీ రైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసంలో దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించిన రాష్ట్రంగా మహరాష్ట్ర అగ్రస్దానంలో నిలిచిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

గంగా న‌ది కాలుష్యం కేసులో.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల‌పై సుప్రీంకోర్టే స్టే విధించింది. ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్జీటీ గ‌తంలో త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. ఆ ఆదేశాల‌పై ఇవాళ సుప్రీం స్టే ఇచ్చింది.

INTERNATIONAL NEWS

వాహనాల శబ్దాలతో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం.

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్‌ జుమా కుమార్తె నొమ్సెబో జుమా (21), ఎస్వతిని రాజు ఎంస్వతి-2 (56) మధ్య ప్రేమ చిగురించింది. సంప్రదాయ నృత్య సంబరాల్లో పాల్గొన్న నొమ్సెబోను రాజవంశపు పెండ్లి కుమార్తెగా ప్రకటించారు.

గాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అరెస్టయ్యింది.

ఆగస్టులో ట్రంప్‌కు వచ్చిన విరాళాల కంటే హారిస్‌కు రెట్టింపు రావడం గమనార్హం

BUSINESS NEWS

దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీల ర్యాలీకి భారీ బ్రేక్‌పడింది.

సెన్సెక్స్ : 81,184 (-1,017)
నిఫ్టీ : 24,852 (-293)

అంతర్జాతీయ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలకు డాటా ఇన్నోవేషన్‌ సేవలు అందిస్తున్న అజిలిసియం..తాజాగా హైదరాబాద్‌లో కొత్తగా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

17 కోట్లకు చేరిన డీమ్యాట్ ఖాతాల సంఖ్య

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌-వీడియోకాన్‌ రుణ కేసులో వీరిద్దరు అరెస్ట్‌ అక్రమమంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

వెజ్‌, నాన్‌ వెజ్‌ థాలీ ధరల్లో ఘననీయమైన తగ్గుదల నమోదైంది. గత ఏడాది ఆగస్టు నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు నెలలో వెజ్‌ థాలీ ధరల్లో 8 శాతం, నాన్‌ వెజ్‌ థాలీ ధరల్లో 12 శాతం తగ్గుదల కనిపించింది. ఈ వివరాలను క్రిసిల్‌ (CRISIL) తాజా రిపోర్టు స్పష్టం చేసింది.

సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌, ఆమె భర్త పేరిట ముంబై కంపెనీలో వాటాలు

SPORTS NEWS

పారిస్ ఒలింపిక్స్ పురుషుల హైజంప్‌ (టీ64)లో యువ పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌.. రికార్డు స్థాయిలో 2.08 మీటర్ల (ఆసియా రికార్డు) ఎత్తుకు దూకి పసిడి దక్కించుకున్నాడు.

పారిస్‌ పారాలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో ఆర్చర్‌ హర్విందర్‌సింగ్‌, యువ అథ్లెట్‌ ప్రీతిపాల్‌ జాతీయ పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ లో సబలెంక & పెగుల

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ నెల 13, 14 తేదీలలో బ్రస్సెల్స్‌ (బెల్జియం) వేదికగా జరుగబోయే ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌ చీఫ్‌ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నియమితుడయ్యాడు.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ డీఎస్సీ ఫైనల్‌కీ విడుదల.. త్వరలో ఫలితాలు

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) మెరిట్‌ జాబితాను శుక్రవారం మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. మొత్తం 442 పోస్టులకు వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 4,850 మంది దరఖాస్తు చేసుకున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు