BIKKI NEWS (DEC 07) : TODAY NEWS IN TELUGU on 7th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 7th DECEMBER 2024
TELANGANA NEWS
గ్రూప్ 1 రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
నూతన రూపంతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
తెలంగాణలో కొత్తగా 7 నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే – సీఎం
రాష్ట్రంలో మరో సర్వే మొదలుకానున్నది. ప్రజలకు సొంత ఇండ్లు, అద్దె ఇండ్లు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
నాలుగేండ్లలో రాష్ట్రంలో 6,468 మంది కనిపించకుండా పోయారు. డీజీపీ కార్యాలయం
ఇకపై తెలంగాణ లో ఎంత పెద్ద సినిమాకైనా బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్, మిడ్‌నైట్ షోల కు అనుమతులు ఇవ్వబోము – కోమటిరెడ్డి
సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. 25 లక్షల సాయం. – అల్లు అర్జున్
రాష్ట్రంలోని హోంగార్డుల డీఏ(కరువు భత్యం) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏను రూ.921 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ANDHRA PRADESH NEWS
జగన్‌ను అవమానించేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి : అంబటి రాంబాబు
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నివారణకు సిట్ ఏర్పాటు
శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అనుచరుడి అరాచకాలు.. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థిని చితకబాదిన వీడియో వైరల్
ఏపీలో డీప్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయిని సీఎం చంద్రబాబు అన్నారు.
NATIONAL NEWS
తమ డిమాండ్ల సాధనకు రైతులు శుక్రవారం చేపట్టిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు వద్ద రైతులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు.
అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట దొరికినట్టు రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ శుక్రవారం సభలో ప్రకటించారు.
విచారణ వేగంగా ముగించడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ ఖైదీని నిరవధికంగా జైలులో నిర్బంధించరాదని స్పష్టంచేసింది.
చిన్న, సన్నకారు రైతులకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తీపి కబురు అందించింది. తనఖా రహిత రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, జాతీయత, నిజాయతీలకు సంబంధించిన దస్ర్తాల ధ్రువీకరణను వారి నియామక తేది నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అన్ని రాష్ర్టాల పోలీసులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
బధిరుల కోసం దేశంలో తొలిసారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎస్‌ఎల్) టీవీ చానల్, చానల్ 31ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రారంభించారు.
ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధనౌక.. రష్యాలో జల ప్రవేశం
భారతదేశ రవాణా వ్యవస్థలో గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో విమాన వేగంతో పోటీపడి ప్రయాణించే హైపర్‌లూప్ వ్యవస్థ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది.
INTERNATIONAL NEWS
అంతరిక్షంలో ఏకంగా అణ్వాయుధాన్నే మోహరిస్తున్న రష్యా. ‘కాస్మోస్ 2553’ ఉపగ్రహ సాయంతో సన్నాహాలు
బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుకు సమీపంలో టర్కీ తయారీ ఫ్లాగ్ టీబీ2 కిల్లర్ డ్రోన్లను మోహరించింది.
ట్రంప్ ప్రచారం కొరకు మస్క్ 2,110 కోట్లు ఖర్చు పెట్టినట్టు గురువారం విడుదలైన ఫెడరల్ ఫైలింగ్స్ వెల్లడించాయి
ఇరాన్ సామన్-1తో పాటు క్యూబ్‌సాట్, ఓ రీసర్చ్ పేలోడ్ ను విజయవంతంగా ప్రయోగించింది.
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.0గా నమోదయింది.
BUSINESS NEWS
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ : 81,709.12 (-56.74)
నిఫ్టీ : 24,677.80(-30.60)
వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ
2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితం – ఆర్బీఐ
క్యాష్ రిజర్వ్ రేషియో – సీఆర్‌ఆర్ అర శాతం తగ్గించిన 4 శాతానికి పరిమితం చేసిన ఆర్బీఐ
త్వరలో ఐపీఓకు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా.
మారతి జనవరి నుంచి కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనుంది.
SPORTS NEWS
ఆసీస్ పేస్ స్టార్ మిచెల్ స్టార్క్(6) ధాటికి టీమ్‌ఇండియా 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్..వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.
అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది
గువాహటి మాస్టర్స్ సూపర్-100 బ్యాడ్మింటన్ టెర్నీలో భారత యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్ డిఫెండింగ్ చాంపియన్ లలిన్రాత్ చైవాన్‌కు ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
EDUCATION & JOBS UPDATES
TGPSC గ్రూప్ – 2 హల్ టికెట్లు విడుదల
గ్రూప్ – 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు. – సుప్రీంకోర్టు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024 – 25 పరీక్షల కేలండర్ విడుదల
దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా టీజీపీఎస్సీ మాజీ చైర్మన్, ప్రముఖ విద్యావేత్త ఘంటా చక్రపాణి నియమితులయ్యారు.
18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల
- TCURRENT AFFAIRS 25th DECEMBER 2024
- సినీపరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు – సీఎం రేవంత్
- BOXING DAY TEST – ముగిసిన తొలిరోజు ఆట
- CURRENT AFFAIRS 24th DECEMBER 2024
- CURRENT AFFAIRS 23rd DECEMBER 2024