BIKKI NEWS (AUG 07) : TODAY NEWS IN TELUGU on 7th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 7th AUGUST 2024
TELANGANA NEWS
ప్రతి కమతం యొక్క భూదస్త్రాల పరిశీలన. నూతన చట్టం వచ్చాక అమలు.
హైదరాబాద్ త్రాగు నీటి కొరకు గోదావరి రెండో దశ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్.
తెలంగాణ లో 1000 కోట్లతో స్వచ్ఛ బయో ఇథనాల్ ప్లాంట్
ఆగస్టు 15న చివరి విడత రుణమాఫీ. మంత్రి తుమ్మల
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరాస్మరణీయం. పలువురు ప్రముఖుల నివాళి.
హైదరాబాదుకు ధీటుగా వరంగల్ అభివృద్ధి. మంత్రి పొంగులేటి
మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. 317 జీవో అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం.
ANDHRA PRADESH NEWS
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోర్టుకు వెళతాం : వైఎస్ జగన్
ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు.. సీఈవోతో చంద్రబాబు కీలక చర్చలు.
శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.
శ్రీవారి దర్శనం టిక్కెట్ల బుకింగ్ కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దు : టీటీడీ.
డబ్బులతో ఓట్లు కొనాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.. బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
నాలుగు వైద్య కళాశాలలలో ప్రవేశాలకు అనుమతులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నేడు ఉత్తరకొస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం
పోలవరం డయాఫ్రం వాల్ టెండర్లపై తుది నిర్ణయం కేంద్రానిదే. ఏపీ సీఎం
NATIONAL NEWS
మా స్థానంలో కూర్చోండి.. ఎంత ఒత్తిడి ఉందో తెలుస్తుంది.. న్యాయవాదిపై ‘సుప్రీం’ సీజేఐ ఆగ్రహం..
హసీనాను గద్దె దింపడం వెనుక పాక్ ప్రమేయం ఏమైనా ఉందా?.. కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవు.. బంగ్లా సంక్షోభంపై కేంద్రమంత్రి.
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ తగ్గించండి.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యుల ఆందోళన
బంగ్లాదేశ్ పరిస్థితి ప్రతి నియంతకు ఒక గుణపాఠం : ఫరూక్ అబ్దుల్లా
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ(96) మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హస్పిటల్ లో చేర్చారు.
జన గణనలో కులగణన.. పార్లమెంట్‌లో బీసీ బిల్లు కోసం జంతర్‌మంతర్ వద్ద ధర్నా..
ఐఐటీ మద్రాస్‌కు ఓ పూర్వ విద్యార్థి భూరి విరాళం అందజేశారు. 1970 ఎంటెక్ ఎయిరో స్పేస్ ఇంజినీరింగ్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్ల విరాళం ప్రకటించారు
INTERNATIONAL NEWS
షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమిస్తూ దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్ నిర్ణయం తీసుకున్నారు.
వలసదారులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అల్లర్లతో బ్రిటన్ అట్టుడుకుతున్నది. జూలై చివరి నుంచి అక్కడక్కడ కొనసాగుతున్న ఆందోళనలు శుక్రవారం నుంచి తీవ్రరూపం దాల్చాయి.
డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను(60) ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ మంగళవారం ఎంపిక చేసుకున్నారు.
ఫిజి అత్యున్నత పౌర పురస్కారం ‘ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ పురస్కారాన్ని ఆ దేశ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ప్రదానం చేసింది.
లెబనాన్ సాయుధ గ్రూప్ హెజ్బొల్లా మంగళవారం డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై విరుచుకుపడింది
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. 21 రోజుల్లో 440 మంది మృతి.
షేక్ హసీనాను గద్దె దింపిన విద్యార్థి నాయకుడు నహిద్ ఇస్లామ్. ఢాకా యూనివర్సిటీలో అతను సోసియాలజీ చదువుతున్నాడు.
బంగ్లాదేశ్ జైలులో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత ఖలీదా జియాను రిలీజ్ చేయాలని దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్ ఆదేశించారు. జియా ప్రత్యర్థి.. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు.
BUSINESS NEWS
నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు.
గత మూడు రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు శాతం వరకు నష్టపోవడంతో మదుపరులు ఏకంగా రూ.22 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
సెన్సెక్స్ : 78,593 (-166)
నిఫ్టీ : 23,992 (-63)
ఈ ఏడాది జూలై 23 కంటే ముందు ఇండ్లను కొనుగోలు చేసినవారు.. వాటిని అమ్ముకున్నప్పుడు చెల్లించే దీర్ఘకాల మూలధన లాభాల (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా ఎల్‌టీసీజీ) పన్నుకు సంబంధించి ఉన్న కొత్త, పాత విధానాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభంపై భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.1,100 దిగి రూ.71,700 వద్ద నిలిచింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఒకేసారి నాలుగు పాలసీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ యువ టర్మ్, డిజీ టర్మ్‌తోపాటు యువ క్రెడిట్ లైఫ్, డిజీ క్రెడిట్ లైఫ్ పేర్లతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ న్యూ చేతక్ 3210 స్పెషల్ ఎడిషన్ ఆవిష్కరించింది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ రాజీనామా చేశారని సమాచారం.
SPORTS NEWS
పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో ఫైనల్ కు చేరిన నీరజ్ చోప్రా. తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల దూరం బల్లెం విసిరిన నీరజ్.
ఒలింపిక్స్ ఫైనల్‌కు తొలి భారత మహిళా రెజ్లర్ గా వినేశ్ పోగట్ రికార్డు
సెమీస్‌లో జర్మనీ చేతితో పోరాడి ఓడిన భారత హకీ టీమ్. కాంస్య పోరుకు సిద్ధం.
భారత్ శ్రీలంక ల మద్య నేడే చివరి వన్డే. 1-0 లీడ్ తో ఉన్న శ్రీలంక.
ఒకే ఏడాది 2 వేల కోట్ల జీఎస్టీ.. కేంద్ర ఖజానా నింపుతున్న బీసీసీఐ