Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 09 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 09 – 2024

BIKKI NEWS (SEP. 06) : TODAY NEWS IN TELUGU on 6th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 6th SEPTEMBER 2024

TELANGANA NEWS

హైదరాబాద్‌ నగరాన్ని కృత్రిమ మేధస్సు(ఏఐ)కి అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే తమ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న ఫోర్త్‌ సిటీలో ఏఐ కార్యకలాపాల కోసం 200 ఎకరాలను కేటాయించిందని చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండ లం ఏజెన్సీ ప్రాంతంలోని తాటిగూడెం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, గ్రేహౌండ్స్‌ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా పంటకు 33% నష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల ప్రవేశాల్లో అవకాశం కల్పించాలని గురువారం తీర్పు చెప్పింది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ టీచర్ల కోసం సంక్షేమ చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు

బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు.

తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

సీఎం రేవంత్ వ‌ల్లే రాత్రికి రాత్రే 2000కు పైగా టీచ‌ర్లు రోడ్డున ప‌డ్డారు : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

జీఎస్‌డీపీలో జాతీయ సగటు కంటే అధికం.. ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మె ల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పని చేసే మహిళా కార్యకర్త ఫోన్‌ నంబర్‌ తీసుకుని అర్ధరాత్రి ఫోన్లు, మెసేజ్‌లతో బెదిరించినట్టు బాధితురాలు హైదరాబాద్‌లో గురువారం మీడియా సమావేశంలో వెల్లడించింది.

బుడమేరు గండ్లను పూడ్చేందుకు రంగంలోకి ఆర్మీ : కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు రెండువారాల రిమాండ్‌ విధించింది.

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బెంగళూరులో అరెస్టు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు : వాతావరణశాఖ

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్‌

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

NATIONAL NEWS

800 అడుగుల లోయలో పడ్డ వాహనం.. నలుగురు జవాన్ల దుర్మరణం

మద్యం పాలసీ కేసులో బెయిల్‌ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరికొంత కాలం నిరీక్షించక తప్పేట్టు లేదు. సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ, బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది.

విమర్శలు, వివాదాలకు దారితీసిన ‘అగ్నివీర్‌ పథకం’పై మోదీ సర్కార్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అర్హతలు, పారితోషకాలతోపాటు, మరికొంతమంది అగ్నివీర్లను సర్వీస్‌లో కొనసాగించేలామార్పులు ఉండబోతున్నాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌లో త్వరలోనే ‘ఇండియాసైజ్‌’లో దుస్తులు లభించనున్నాయి. ఇందుకోసం కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ విషయాన్ని గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ప్రకటించారు.

దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఆధార్‌ తరహాలో డిజిటల్‌ ఐడీలు జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది. రైతులను సాధికారులను చేసేందుకు వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలలో ఈ కార్డులను జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి బీఈడీ డిగ్రీ సరైన అర్హత కాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ప్రాథమిక విద్యలో డిప్లొమా ఉండటం ఈ ఉద్యోగానికి సరైన అర్హత అని చెప్పింది

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 13వ ఘటన

ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీ అవసరం లేదు..! కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు..

పదేండ్లలో 32 రెట్లు పెరిగిన సౌరశక్తి సామర్ధ్యం : ప్రధాని మోదీ

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచిన పంజాబ్‌.. విద్యుత్తుపై స‌బ్సిడీ ఎత్తివేత

INTERNATIONAL NEWS

దీర్ఘకాలికంగా వాయుకాలుష్యం బారినపడిన పురుషుల్లో సంతాన లేమి వేధిస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. 5,26,056 మంది పురుషులపై డెన్మార్క్‌లోని నార్డ్‌ యూనివర్సిటీ ఈ అధ్యయనం చేపట్టింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రాడామస్‌గా పేరొందిన ఎన్నికల విశ్లేషకుడు అలన్‌ లిచట్మన్‌ ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరో ప్రకటించారు. డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిసే వైట్‌హౌస్‌ పీఠాన్ని దక్కించుకుంటారంటూ ఆయన జోస్యం చెప్పారు.

ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్‌ క్లాక్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ గడియారం ద్వారా అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు.

లైంగిక దాడి కేసుల విచారణలో కీలకమైన డీఎన్‌ఏ పరీక్షను కేవలం 45 నిమిషాల్లోనే జరిపే కొత్త ఫోరెన్సిక్‌ సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ఉక్రెయిన్‌తో రెండేళ్లకు పైగా యుద్ధం సాగిస్తున్న రష్యా తాజాగా శాంతిచర్చలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఉక్రెయిన్‌ సంక్షోభంపై తాము భారత్‌ సహా చైనా, బ్రెజిల్‌ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ గురువారం తెలిపారు.

BUSINESS NEWS

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.

సెన్సెక్స్ : 82,201 (-151)
నిఫ్టీ : 25,145 (-54)

పన్ను ఎగవేతను నిరోధించడంపై ఫోకస్‌ : నిర్మలా సీతారామన్‌

వాటాదారులకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వినాయక చవితి పండుగ కానుకను అందించింది. 1:1 బోనస్‌ షేర్ల జారీకి ఆ సంస్థ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది.

క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉద్యోగులు నిరసనల బాట పట్టారు. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న సెబీ చీఫ్‌ మాధబీ పురి బుచ్‌ రాజీనామాను కోరుతూ ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల హెడ్‌ ఆఫీస్‌ ఎదుట పెద్ద ఎత్తున మౌన ప్రదర్శన ఇచ్చారు.

SPORTS NEWS

పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ 25 పతకాలతో రికార్డు సృష్టించింది. ఇందులో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి.

పారిస్ పారా ఒలింపిక్స్ లో క్లబ్‌ త్రోలో ధరంబీర్‌ సింగ్‌, సూర్మ ప్రణవ్‌ వరుసగా స్వర్ణ, రజతాలతో మెరిశారు.

పారా ఒలింపిక్స్ లో జూడోలో క‌పిల్ ప‌ర్మార్ కాంస్య పతకం కొల్ల‌గొట్టాడు.

ఆల్‌ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

2026 పొట్టి ప్రపంచకప్‌ కోసం ఐసీసీ నిర్వహిస్తున్న ఆసియా క్వాలిఫయర్స్‌ టోర్నీలో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 10 పరుగులకే ఆలౌట్‌ అయింది.

యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇటలీ ఆటగాడు జన్నిక్‌ సిన్నర్‌ సెమీస్ కు చేరాడు.

యూఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో జెస్సిక పెగులా 6-2, 6-4తో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ స్వియాటెక్‌ను ఓడించి సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది.

బీజేపీలో చేరిన భారత క్రికెటర్ రవీంద్ర జడేజా

టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించారు. భారత క్రీడాకారుల్లోనే అత్యధికంగా ట్యాక్స్‌ పే చేసిన క్రికెటర్‌గా నిలిచారు

EDUCATION & JOBS UPDATES

SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల. పదో తరగతి అర్హతతో 39,481 ఉద్యోగాలు భర్తీ.

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని వనపర్తి, కరీంనగర్‌ అగ్రికల్చర్‌ మహిళా డిగ్రీ కళాశాలల్లో పలు అధ్యాపక పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఈ-కామర్స్‌ సంస్థ మీషో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. విక్రయదారులు, లాజిస్టిక్‌ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్‌ సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ENTERTAINMENT UPDATES

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా ట్యాక్స్‌ కట్టిన స్టార్స్‌ లిస్ట్‌ను ఫార్చ్యూన్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీయ సెలబ్రిటీలందరిలో బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ అత్యధికంగా పన్ను చెల్లించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు