BIKKI NEWS (NOV. 04) : TODAY NEWS IN TELUGU on 4th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 4th NOVEMBER 2024
TELANGANA NEWS
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఈసారి 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. సన్న రకాలకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ ఇస్తున్నాం` సంక్రాంతి తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తాం అని భట్టి చెప్పారు.
6న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక.
తెలంగాణ బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టు తీర్పునకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ANDHRA PRADESH NEWS
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.
విశాఖలోని రుషికొండలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
ఏపీలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఈరోజు విడుదల చేయనుంది.
ఏపీలో చంద్రబాబు పాలన మొదలైన నాటి నుంచి అరాచకం మొదలైందని, మాఫియా పాలన కొనసాగుతుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాలు ఈనెల 11 నుంచి పది రోజులపాటు జరుగనున్నాయి.
NATIONAL NEWS
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బలరాంపూర్ జిల్లాలో అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
సెంట్రల్ కశ్మీర్ శ్రీనగర్ జిల్లా ఆదివారం మార్కెట్‌లో గ్రెనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు.
10 రోజుల్లో రాజీనామా చేయ్.. లేదంటే చంపేస్తాం.. యూపీ సీఎం యోగికి బెదిరింపు.
ఉగ్రవాదులు పట్టుబడితే చంపొద్దు.. ప్రాణాలతో పట్టుకోండి: ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా
సినీ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు.. రూల్స్ బ్రేక్ చేశారని ఆరోపణలు.
INTERNATIONAL NEWS
బంగ్లాదేశ్‌కు ఆల్టిమేటం.. ఏడో తేదీ లోపు బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సప్లయ్ నిలిపేస్తామన్న అదానీ పవర్
BUSINESS NEWS
ఆరో తేదీన స్విగ్గీ ఐపీఓ. స్విగ్గీ షేర్ విలువ రూ.371-390 మధ్య ఉంటుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.11,327.43 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,07,366.05 కోట్లు పెరిగింది.
SPORTS NEWS
కివీస్ చేతిలో 25 పరుగుల తేడాతో వాంఖడే టెస్ట్ కోల్పోయిన భారత్. 12 ఏండ్లుగా ట్రోఫీని వదలని టీమిండియా తొలిసారి ఘోర పరాభవం మూటగట్టుకుంది.
డబ్ల్యూటీసీ రాంకింగ్స్‌లో టీమిండియా 58.33 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది.
టెస్ట్ చరిత్రలో ఇండియా లో టీమిండియా 3-0 తో వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి.
టీమిండియా తరఫున టెస్టుల్లో నాలుగోసారి 10 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. నాలుగో స్థానంలో నిలిచాడు.
EDUCATION & JOBS UPDATES
నేడు ఏపీ టెట్ 2024 రిజల్ట్స్
SSC GD CONSTABLE దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ నవంబర్ 5 – 7 వరకు అవకాశం కలదు
GATE 2025 దరఖాస్తు ఎడిట్ అవకాశం. నవంబర్ 10 వరకు కలదు.
కౌశల్ సైన్స్ క్విజ్ పోటీలు, పోస్టర్ పోటీలకు దరఖాస్తులను నవంబర్ 15 వరకు కలదు. 8,9, 10 తరగతుల విద్యార్థులు అర్హులు.
ఎండీ హోమియో దరఖాస్తులకు నవంబర్ 07 వరకు అవకాశం కలదు.