Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 08 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 08 – 2024

BIKKI NEWS (AUG 04) : TODAY NEWS IN TELUGU on 4th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 4th AUGUST 2024

TELANGANA NEWS

జీవో 317పై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం, తుది నివేదిక సమర్పించాలని ఆదేశం

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య హెచ్చరించారు.

డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్‌ కీని ఖరారు చేస్తారు.

వర్గల్‌లోని ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రంలో పూర్వయుగ సంసృతులను తెలిపే రాతిచిత్రాల తావులు ఉన్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్‌, వేముగంటి మురళీకృష్ణ తెలిపారు. మెగాలిథిక్‌ సమాధుల జాడలు, రాష్ట్రకూటుల నాటి శాసనాలను గుర్తించినట్టు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

8 మంది ఐఎఎస్ ల బదిలీలు

నాగార్జున సాగర్‌ 4.94లక్షల క్యూసెక్కుల భారీ వరద.

మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో భేటీ అయినా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

రాష్ట్ర జీవన్ దాన్ కి జాతీయ ఉత్తమ పురష్కారం.

జలాశయాలు నింపి రైతులకు నీరివ్వండి – హరీష్ రావు

ANDHRA PRADESH NEWS

ఎగువ పరివాహక ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పది గేట్లను 20 అడుగుల ఎత్తు ఎత్తి వదలడంతో నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది.

ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు.

యామినీ కృష్ణమూర్తి 1968లో పద్మశ్రీ. 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలను పొందారు.. అలాగే, 1977లో సంగీతనాటక అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు.

టీడీపీ పథకాలేనా? జనసేన ఇచ్చిన హామీలను కూడా అమలు చేయండి.. చంద్రబాబు, పవన్‌కు హరిరామ జోగయ్య రిక్వెస్ట్‌.

తిరుమల శ్రీవారి ఆలయంలో 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు.

NATIONAL NEWS

పోలింగ్ శాతం అనుహ్య పెరుగుదలపై ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ డిమాండ్.

ప్రజలు కోర్టు వ్యవహారాలతో విసిగిపోయి ఉన్నారని, అందువల్లే వారు సెటిల్‌మెంట్‌ కోరుకుంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

అవయవాలను అత్యంత వేగంగా రవాణా చేసి అవసరమైన వారికి అమర్చి(ట్రాన్స్‌ప్లాంటేషన్‌) వారి ప్రాణాలను కాపాడేందుకు అవలంబించాల్సిన ప్రామాణిక పద్ధతి(ఎస్‌ఓపీ)ని కేంద్రం శనివారం విడుదల చేసింది.

భార‌త్‌లో ఆహార నిల్వ‌లు స‌మృద్ధిగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆహార‌, పోష్టికార భ‌ద్ర‌త‌కు ప‌రిష్కారాలు చూపేందుకు భార‌త్ ప‌నిచేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు.. పంజాబ్ సీఎంకు ద‌క్క‌ని అనుమ‌తి.

358కు పెరిగిన వయనాడ్‌ మృతుల సంఖ్య.. అత్యాధునిక సాంకేతికతో గాలింపు.

INTERNATIONAL NEWS

హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడికి సిద్ధమవుతున్నదనే వార్తలు వస్తున్నాయి.

1852లో అన్నీబలే డి గాస్పరిస్‌ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నిఖిల్‌, ప్లాటినం లోహాలు ఉన్నట్టు నాసా కనుగొన్నది.

సొమాలియాలో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి.

కమలా హారిస్‌తో డిబేట్‌కు ఓకే చెప్పిన ట్రంప్.

ఇజ్రాయిల్‌పై అటాక్‌కు ఇరాన్ రెఢీ.. యుద్ధ నౌక‌ల‌ను మోహ‌రిస్తున్న అమెరికా.

BUSINESS NEWS

SBI లాభం 19,325 కోట్లు

తెలుగు రాష్ట్రాల లో పెరిగిన మహిళ పెట్టబడిదారులు – యాక్సిస్ నివేదిక

భారత్ లో దివాళా అనుమతులు భేష్ – క్రిసిల్

27 వేల కోట్లతో అస్సాం టాటా ల చిప్ ప్లాంట్

పసిడి బాండ్ల పై 122 % లాభం

SPORTS NEWS

పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 100 మీటర్ల పరుగుల పోటీలో విజేతగా జలియన్ (10.72 సెకండ్స్) నిలిచింది.

మహిళల 25 మీటర్ల వ్యక్తిగత పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో మను భాకర్‌ వెంట్రుకవాసిలో మూడో పతకాన్ని దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. 4వ స్థానంలో నిలిచింది.

భారత ఆర్చర్లు భజన్‌కౌర్‌, దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో విఫలమై పారిస్‌ నుంచి భారంగా నిష్క్రమించారు.

భారత యువ బాక్సర్‌ నిషాంత్‌దేవ్‌ పోరాటం క్వార్టర్స్ లోనే ముగిసింది.

బంగారు ప‌త‌కం కోసం జ‌రిగే మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్క‌రాజ్ తో జ‌కోవిచ్ త‌ల‌ప‌డ‌నున్నాడు.

నేడు భారత్ – శ్రీలంక జట్ల మద్య రెండో వన్డే.

EDUCATION & JOBS UPDATES

TGPSC – డిపార్ట్మెంటల్ టెస్టు మే 2024 సెషన్ ఫలితాలు విడుదల

రాష్ట్రంలోని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలోని పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ ఎండీఎస్‌-2024లో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొంది.

గ్రూప్ – 1 సైన్స్ & టెక్నాలజీ పుస్తకం ఆవిష్కరించిన తెలుగు అకాడమీ.

DOST 2024 డిగ్రీ ప్రత్యేక అడ్మిషన్ల గడువు ఆగస్టు 5వరకు పెంపు.

ENTERTAINMENT UPDATES

గూఢచారి సినిమా సీక్వెల్ G2 చేస్తున్న అడవి శేషు

ఈగ స్పూర్తితో బడ్డీ సినిమా చేశాం దర్శకుడు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు