BIKKI NEWS (OCT. 03) : TODAY NEWS IN TELUGU on 3rd OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 3rd OCTOBER 2024
TELANGANA NEWS
తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తీరొక్క పూలతో అంగరంగ తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి.
దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలి – సీఎం రేవంత్
హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం.
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. మంత్రి చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తన కుటుంబ సభ్యుల పట్ల నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హీరో నాగార్జున పేర్కొన్నారు.
మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
సీఎం రేవంత్ రెడ్డి చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు
న్యాయం చేయాలని గాంధీ భవన్ ఎదుట నిరసన తెలిపిన 317 జీవో బాధితులు..
హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు.
తెలంగాణలో మరో రెండురోజులు వానలు.. 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
గంజాయి విక్రయిస్తున్న దంపతులను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు
ANDHRA PRADESH NEWS
ఏపీలో నేటి నుంచి టెట్ పరీక్షలు.. 4.27 లక్షల మంది దరఖాస్తులు
విశాఖ స్టీల్‌లో కార్మికుల తొలగింపునకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళన
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 10న జరుగనుంది. ఈ సమావేశంలో నూతన మద్యం పాలసీ, మూడు సిలిండర్ల పంపిణీపై చర్చ జరిగే అవకాశముంది.
గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో బుధవారం నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. కానీ రైతులకు ఉండదన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ – సీఎం రమేష్
NATIONAL NEWS
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి ఆయన చెత్తను ఊడ్చారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణులతో దాడుల నేపథ్యంలో
ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దని భారతీయులకు కేంద్రం సూచించింది.
ఉజ్జయిని మహాకాల్ ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలను పేల్చివేస్తామని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న లేఖలో బెదిరించారు.
ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ పార్టీని బీహార్ లో ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 500 కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
జార్ఖండ్ సాహిబ్‌గంజ్‌లో గుర్తు తెలియని దుండగులు రైల్వేటాక్‌ను పేల్చివేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్లరాకపోలకు అంతరాయం కలుగుతున్నది
INTERNATIONAL NEWS
ఐక్య రాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.. వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. సెంచరీ మార్క్ కొట్టిన తొలి యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయన రికార్డు సృష్టించారు.
ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదు.. క్షిపణుల దాడిపై ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్
భారత్ వాంటెడ్ వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్ పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు.
BUSINESS NEWS
SBI ఈ ఏడాది కొత్తగా 600 శాఖలను ప్రారంభించనుంది.
విద్యుత్ వాహనాలు కొనుగోలు పెంచేందుకు కేంద్రం ‘పీఎం ఈ డ్రైవ్’ పథకాన్ని 10,900 కోట్లతో ప్రారంభించింది.
ఐపీవోకు కంపెనీలు క్యూ.. ఒక్కరోజే సెబీకి 13 సంస్థల దరఖాస్తు.
SPORTS NEWS
నేటినుంచి మహిళల ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 ప్రారంభం.
ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అశ్విన్ రెండోస్థానానికి పడిపోయాడు.
బ్యాట్స్‌మెన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో, కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో, జైశ్వాల్ మూడో స్థానంలో నిలిచారు.
పాకిస్థాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నాడు. పరిమితి ఓవర్ల క్రికెట్‌కు .. సారథ్య బాధ్యతలు చేపట్టబోనని స్పష్టం చేశాడు. దీంతో వన్డే, టీం కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇరానీ కప్ లో ముంబై బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ సాదించాడు.
చైనా ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా అల్కరాజ్ నిలిచాడు. ఫైనల్ లో సిన్నర్ పై విజయం సాధించాడు.
చైనా ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ విజేతగా వావాసూరి & బోలెల్లి జోడి నిలిచింది.
EDUCATION & JOBS UPDATES
నేటి నుండి ఏపీ టెట్ పరీక్షలు. రోజుకు రెండు సెషన్స్ చొప్పున పరీక్షలు.
నవోదయలో 9వ, 11వ తరగతి అడ్మిషన్స్ 2025 కై ప్రకటన విడుదల.
తెలంగాణ లో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నేటి నుండి ప్రారంభం.
ENTERTAINMENT UPDATES
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్ ట్రైలర్ విడుదల. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది.