BIKKI NEWS (NOV. 03) : TODAY NEWS IN TELUGU on 3rd NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 3rd NOVEMBER 2024
TELANGANA NEWS
రెండో దశ మెట్రో కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. ఫోర్త్ సిటీకి కూడా మెట్రో నిర్మాణం
కుల గణన మీద మేధావులతో చర్చించడానికి రాష్ట్రానికి నవంబర్ 5వ తేదీన రాహుల్ గాంధీకి వస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
ఓటర్ల నమోదు జాబితా, ప్రత్యేకత సవరణ కార్యక్రమం కొరకు నవంబర్ 28 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
నాగార్జునసాగర్ – శ్రీశైలం మరియు సోమశిల – శ్రీశైలం లాంచీ సర్వీసులు ప్రారంభం.
75 ప్రశ్నలతో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే
100% యూనివర్సిటీల ప్రక్షాళన కోసం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు – మంత్రి దామోదర రాజనర్సింహ.
15 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికను చేపడతామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, వేగవంతంగా చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు.
ANDHRA PRADESH NEWS
కరెంటు సర్‌చార్జీలు పెంచడంపై షర్మిల స్పందిస్తూ వైసీపీకి , కూటమి ప్రభుత్వానికి తేడాలేదని పేర్కొన్నారు. ఈ నెల 5న ధర్నాలకు పిలుపు
విశాఖ ఉక్కు కర్మాగారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి ప్యాలెస్‌లు కట్టిన వ్యక్తికి ప్రజాకోర్టులో శిక్ష పడాల్సిందే : చంద్రబాబు
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. వరుసకు మామ అయ్యే యువకుడు బాలికకు చాకెట్లు ఆశచూపి దారుణానికి పాల్పడ్డాడు.
NATIONAL NEWS
97.5 శాతం విద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయి.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ శనివారం చెప్పారు.
అమిత్ షా పై కెనడా మంత్రి చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం శనివారం తీవ్రంగా మండిపడింది. ఆ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ఆధార రహితమైనవని తెలిపింది.
ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. మృతుల్లో లష్కరే తాయిబా టాప్ కమాండర్
ఒక పార్టీ లేదా ఒక రాజకీయ నేత కోసం ఒక్క ఎన్నికల్లో పనిచేస్తే..తన ఫీజు రూ.100 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుందని తాజాగా ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిపాయి.
దంపతుల్లో భార్యకు, అదే విధంగా, భర్తకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది.
ప్యాకేజ్డ్ ఆహారాల్లో ఉప్పు తగ్గిస్తే 3 లక్షల మందిని కాపాడొచ్చు – ప్రపంచ ఆరోగ్య సంస్థ
INTERNATIONAL NEWS
కడవంత గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాడు అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్.
సెన్నా సియామియా, గ్లిరిసిడియా సేపియం అనే రెండు రకాల చెట్ల జాతులు విద్యుత్తు ఉత్పత్తికి అనువైనవని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇజ్రాయెల్ దాడుల్లో 77 మంది మృతి.
కెనడా పార్లమెంట్ బయట హిందూ జెండా.. ఎగరేసిన భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య
ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్‌లలో ఒకటైన వల్కాన్‌ను ఈ నెల 16న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వేలం వేయనున్నారు. డైనోసార్ అస్థిపంజరం బిడ్ నమోదు కాకముందే ధర 11 నుంచి 22 మిలియన్ అమెరికా డాలర్లు (దాదాపు రూ.92 నుంచి రూ.185కోట్లు) దాటిందని ఫ్రెంచ్ వేలం నిర్వాహకుడు కొలిన్ డు బోకేజ్ అండ్ బార్బరోస్సా పేర్కొన్నారు.
BUSINESS NEWS
ఇక వాట్సాప్ యూజర్లు స్టేటస్ పెడుతున్నప్పుడు కాంటాక్టుల్లో నచ్చిన వ్యక్తుల్ని ట్యాగ్ చేయొచ్చు.
గత నెల 25తో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు 3.463 బిలియన్ల డాలర్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 684.805 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ విడుదల చేసిన డేటా పేర్కొంది.
ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ చేతికి.. చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ రాబోతున్నదన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.
SPORTS NEWS
వాంఖడే టెస్ట్ రసవత్తర స్థితికి చేరింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 143 పరుగులు ఆధిక్యంలో ఉన్న కివీస్ జట్టుకు ఒక వికెట్ మాత్రమే చేతిలో ఉంది.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న రన్ మిషీన్ విరాట్ కోహ్లీ మరో మూడేండ్ల పాటు ఆ జట్టుతోనే కొనసాగనున్నాడు.
భారత యువ బాక్సర్ కృష్ణ వర్మ అండర్ -19 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడితో మెరిసింది.
హైలొ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ ఫైనల్‌కు ప్రవే శించింది.
EDUCATION & JOBS UPDATES
రైల్వే అసిస్టెంట్ లోకో పైలెట్ పరీక్షలు నవంబర్ 25 – 29 వరకు జరుగుతాయి.
రైల్వే ఆర్ఫీఎఫ్ ఎస్సై పరీక్షలు డిసెంబర్ 2 – 12 వరకు జరుగుతాయి.
రైల్వే టెక్నీషియన్ పరీక్షలు డిసెంబర్ 18 – 29 వరకు జరుగుతాయి.
రైల్వే జూనియర్ ఇంజనీర్ పరీక్షలు డిసెంబర్ 13- 17 వరకు జరుగుతాయి.