TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 08 – 2024

BIKKI NEWS (AUG 03) : TODAY NEWS IN TELUGU on 3rd AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 3rd AUGUST 2024

TELANGANA NEWS

తెలంగాణ జాబ్ కేలండర్ 2024 – 25 విడుదల.

త్వరలోనే నూతన రెవెన్యూ చట్టం. ధరణి చట్టం స్థానంలో నూతన చట్టం. భూమాత చట్టంగా నామకరణం చేసే అవకాశం.

తెలంగాణ శాసనసభ దుశ్శాసన సభగా మారింది.. ఇదేనా పిల్లలకు నేర్పేది.. హరీశ్‌రావు ఫైర్‌

ఒక్క నోటిఫికేషన్‌ అయినా ఇచ్చారా? దమ్ముంటే సమాధానం చెప్పు.. రేవంత్‌రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు

తెలంగాణ భవిష్యత్ టీచర్స్ చేతిలోనే – సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ నూతన క్రీడా పాలసీ తీసుకోస్తాం. – క్రీడాకారులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం – సీఎం రేవంత్ రెడ్డి.

ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద.

నాంప‌ల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్సిటీకి సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి పేరు.

విద్యా రంగంలో సమస్యలు పరిష్కరించండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం పెరిగాయని కాగ్‌ నివేదిక (CAG) వెల్లడించింది.

సభలో ఎమ్మెల్యే దానం అనుచిత వ్యాఖ్యలు. బీఆరెస్ వాకౌట్.

గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.

ANDHRA PRADESH NEWS

అమరావతి సీఆర్డీఏ పరిధి పెంపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.

అక్టోబర్ 01 నుంచి నూతన మద్యం విధానం అమలు.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఉధృతి.. 20 అడుగుల మేర 10 గేట్లు ఎత్తి నీరు విడుద‌ల.

విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా బోత్స సత్యనారాయణ ఎంపిక.

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బెదిరింపులను ధీటుగా ఎదుర్కోవాలి : వైఎస్‌ జగన్‌.

NATIONAL NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు.

నీట్‌ ప్రవేశపెట్టక ముందు పీజీ సీట్లను రూ. 13 కోట్లకు అమ్మకానికి పెట్టారు : జేపీ నడ్డా

ఢిల్లీ సివిల్స్‌ అభ్యర్ధుల మృతి కేసుపై సీబీఐ విచారణకు డిల్లీ హైకోర్టు ఆదేశం.

ఢిల్లీలోని నేషనల్‌ అగ్రికల్చర్‌ సైన్స్ సెంటర్‌ (NASC) కాంప్లెక్స్‌లో శనివారం జరిగే 32వ వ్యవసాయ ఆర్ధికవేత్తల అంతర్జాతీయ సదస్సు (ICAE)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.

రోడ్డు ప్రమాద భాదితులకు నగదు రహిత చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన పథకం.

పాట్నా, హ‌జారిబాగ్‌లో మాత్ర‌మే నీట్ పేప‌ర్ లీకేజీ: సుప్రీంకోర్టు

డిల్లీ షెల్టర్ హోమ్ (ఆశ్రమంలో) గడచిన 20 రోజుల్లో 14 మరణాలు.

BSF డీజీ నితిన్ అగర్వాల్ మరియు డిప్యూటీ స్పెషల్ డీజీ (పశ్చిమ) వైబీ ఖురానియా లను తొలగించిన కేంద్రం.

INTERNATIONAL NEWS

ఐఎస్ఎస్ యాత్రకు ప్రధాన వ్యోమోగామి గా భారతీయుడు శుభాన్స్ శుక్లా ఎంపిక.

స్మార్ట్‌ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు : ఐక్యరాజ్యసమితి నివేదిక

పొరుగు దేశం పాకిస్థాన్‌ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాలకు 30 మందికిపైగా మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.

అమెరికా, ర‌ష్యా దేశాలు ఖైదీల‌ను అప్ప‌గించుకున్నాయి. ర‌ష్యా 16 మంది ఖైదీల‌ను రిలీజ్ చేయ‌గా, అమెరికాతో పాటు ఇత‌ర ప‌శ్చిమ దేశాలు 8 మంది ర‌ష్య‌న్లను రిలీజ్ చేశాయి.

BUSINESS NEWS

ఆటో.. ఐటీ స్టాక్స్ పతనంతో భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.
సెన్సెక్స్ : 80,982 (- 886)
నిప్టీ : 24,717 (-293)

ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు.. 7.28 కోట్లు దాటిన ఐటీఆర్స్..

3.47 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ రిజర్వు నిల్వలు.

రూ.73 వేలకు చేరువలో బంగారం ధర.

5జీ సేవలకు బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధం. వీడియో కాల్ ను పరీక్షించిన సింధియా.

అమెజాన్ గ్రేట్ ప్రీడమ్ సేల్ ఆగస్టు 6 – 11 వరకు.

SPORTS NEWS

పారిస్ ఒలింపిక్స్ లో భారత్

హ్యాట్రిక్ మెడ‌ల్‌కు చేరువైన మ‌ను భాక‌ర్.. 25 మీట‌ర్ల పిస్ట‌ల్ ఈవెంట్‌లో అద‌ర‌గొట్టిన మ‌ను ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.

సెమీస్‌లో ల‌క్ష్య‌సేన్.. చ‌రిత్ర సృష్టించిన భారత యువ ష‌ట్లర్.

మిక్స్‌డ్ టీమ్ ఆర్చ‌రీ సెమీస్‌లో ఓట‌మి.. కాంస్యం వేట‌లో ధీరజ్, అంకిత‌.

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త పురుషుల హాకీ జ‌ట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. బ‌ల‌మైన ఆస్ట్రేలియా పై రికార్డు విజ‌యంతో క్వార్ట‌ర్స్ బెర్తు సాధించింది.

టెన్నిస్‌కు బ్రిట‌న్ దిగ్గ‌జం ముర్రే వీడ్కోలు.

భారత్ – శ్రీలంక మద్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ “టై” గా ముగిసింది. శ్రీలంక – 230/8
భారత్ – 230/10

మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ కు గ్రూప్ – 1 ఉద్యోగాలు. – భట్టి

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ జాబ్ కేలండర్ విడుదల.

TGPSC – AEE (CIVIL) 1154 ఉద్యోగాల తుది ఎంపిక జాబితా విడుదల

UGC NET 2024 JUNE ADMIT CARDS విడుదల

TGPSC – డిపార్ట్మెంటల్ పరీక్షలు మే 2024కు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ ను విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రీకౌంటింగ్ ఫలితాలు విడుదల

డిగ్రీ ఖాళీ సీట్లు భర్తీ కోసం సెంట్రల్ యూనివర్సిటీ లు ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రం లో 5 ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు కు ఆమోదం.

టీజీ సెట్ 2024 పరీక్ష తేదీ లు మార్పు – సెప్టెంబర్ 10 నుంచి పరీక్షలు.

గురుకుల డిగ్రీ కళాశాలలో యానిమేషన్ కోర్స్ అడ్మిషన్లు

బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష రెండో దశ ఫలితాలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్లు

ENTERTAINMENT UPDATES

రాజ్‌తరుణ్ వ్యవహారం లో లావణ్య పై కేసు నమోదు.

బిగ్ బాస్ 8వ సీజన్ టీజర్ విడుదల. కమిట్ అయితే లిమిట్ లేదంటున్న నాగార్జున.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు