Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 31 – 07 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 31 – 07 – 2024

BIKKI NEWS (JULY 31) : TODAY NEWS IN TELUGU on 31st JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 31st JULY 2024

TELANGANA NEWS

రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు చివరి వరకు 2 లక్షల రుణమాఫీ – సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్‌ వర్మ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం చేయించనున్నారు.

తెలంగాణలో విద్యుత్తు విచారణ కమిషన్‌ నూతన చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూర్‌ నియమితులయ్యారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద గౌడ్‌ దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్‌.. సొంత గూటికి చేరుకున్న గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి

బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై డ్రైవర్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు.

వేతనాలు పెంచాలంటూ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) పథకం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్ లో భారీ ధర్నా చేపట్టారు.

ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆటోడ్రైవర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆటోరిక్షా డ్రైవర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు.

ANDHRA PRADESH NEWS

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవలు బంద్‌ .. ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం కీలక నిర్ణయం.

ఆగస్టు ఒకటిన శ్రీ‌శైలానికి ఏపీ సీఎం చంద్రబాబు.. ఏర్పాట్ల‌పై అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు..

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. ఏడుగేట్లు ఎత్తివేత.

ఆరోగ్యశ్రీ నిలిపివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయా? వైఎస్‌ షర్మిల సందేహం.

ప్రతిపక్ష హోదా కోసం జగన్‌ పిటిషన్‌.. స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

అమరావతి అభివృద్ధికి ఇచ్చిన 15 వేల కోట్లు అప్పు మాత్రమే.. బీజేపీ నేత జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు.

NATIONAL NEWS

లఢక్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది.

గత ఏడాది దేశవ్యాప్తంగా 30.5 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయని, 286 మంది మరణించారని మంగళవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ రాతపూర్వక సమాధానమిచ్చారు.

చట్ట విరుద్ధ మతమార్పిడి (సవరణ బిల్లు) 2024కు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శిక్షలను మరింత పెంచారు. మోసపూరితంగా, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడినట్టు తేలితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.

త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌ : ప్రధాని మోదీ

2025-26 నాటికి ద్రవ్య లోటు కట్టడి : బడ్జెట్‌పై చర్చకు బదులిచ్చిన ఆర్ధిక మంత్రి

వయనాడ్‌ లో వరద విలయం.. 600 మంది కార్మికులు గల్లంతు. 24 గంటల్లో 372 మిల్లీమీటర్ల వర్షపాతం..

8వ వేత‌న సంఘం ఏర్పాటు చేసే అంశంపై రెండు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్లు కేంద్ర స‌ర్కారు వెల్ల‌డించింది. కానీ ఆ సంఘం ఏర్పాటుపై తామేమీ ఆలోచించ‌లేద‌ని ఇవాళ పార్ల‌మెంట్‌లో కేంద్ర స‌ర్కారు స్ప‌ష్టం చేసింది.

ప‌ట్టాలు త‌ప్పిన హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్.. ఇద్ద‌రు మృతి.

దేశంలో రైలు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి.. జార్ఖండ్‌ ఘటనపై బెంగాల్‌ సీఎం.

వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ (OROP) పథకం ప్రకారం రిటైర్డ్‌ రెగ్యులర్‌ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవడంపై జాప్యంపై కేంద్రం పై సుప్రీం కోర్ట్ మండిపడింది.

ఫాస్టాగ్‌ సర్వీసులపై ఆగస్టు 1 నుంచి కొత్త రూల్‌ అమల్లోకి రానున్నది. వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను ఫాస్టాగ్‌ నంబర్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

INTERNATIONAL NEWS

గ్రీన్‌కార్డు హోల్డర్లకు మూడు వారాల్లో అమెరికా పౌరసత్వం.

ట్రంప్‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌నున్న ఎఫ్‌బీఐ

వెనిజులా దేశాధ్య‌క్షుడిగా నికోల‌స్ మాడురో మూడోసారి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ను వ్య‌తిరేకిస్తూ ప్ర‌జ‌లు ఆందోళ‌న చేప‌ట్టారు.

BUSINESS NEWS

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,455 (99)
నిఫ్టీ : 24,857 (21)

ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పెంచండి.. సీబీడీటీకి ఏఐఎఫ్‌టీపీ వినతి.

2019-20 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెన్‌ చేయని ఖాతాదారుల నుంచి జరిమానాల రూపంలో ఏకంగా రూ.8,500 కోట్లు వసూలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రూ.25 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని నిరర్థక ఆస్తుల ఖాతాల్లో ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల అంశాన్ని పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశీయంగా గోల్డ్‌ డిమాండ్‌ 149.7 టన్నులకే పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 5 శాతం తగ్గింది.

ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌తోపాటు పీఎన్‌ గాడ్జిల్‌ జ్యూవెల్లరీస్‌ లిమిటెడ్‌, ఎకోస్‌ ఇండియా మొబిలిటీ, కేఆర్‌ఎన్‌ హీట్‌ ఎక్సేంజర్‌ అండ్‌ రిఫ్రిజిరేషన్‌ సంస్థల ఐపీవోలకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

SPORTS NEWS

పారిస్ ఒలింపిక్స్ లో భారత్

షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్తోల్ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మను భాకర్‌ తో కలిసి సరబ్‌జోత్‌ సింగ్‌ కాంస్య పతకం గెలిచాడు.

మను భాకర్.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ప్లేయర్‌గా ఘనత.

ఐర్లాండ్‌పై అద్భుత విజ‌యం.. క్వార్ట‌ర్స్‌కు చేరువైన‌ భార‌త హకీ జట్టు.

బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌కు సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

ఆర్చరీలో 1/16 రౌండ్‌కు భజన్‌ కౌర్‌

టేబుల్‌ టెన్నిస్‌లో మనికా బాత్ర, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.

ఒలింపిక్స్‌ రోయింగ్‌ పోటీలలో బరిలోకి దిగిన ఏకైక రోయర్‌ బాల్‌రాజ్‌ పన్వర్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.

కామన్‌వెల్త్ గేమ్స్‌లో ప‌సిడి ప‌త‌కంతో మెరిసిన అంతిమ్ పంగ‌ల్ 16వ రౌండ్‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు.

ఆఖరి టీ20లో టీమిండియా లంకపై సూపర్ ఓవర్‌లో అద్భుత విజయం సాధించింది. సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది.

వ‌చ్చే ఆరేండ్ల‌లో కాదు ఏకంగా నాలుగు ఐసీసీ ట్రోఫీల‌కు ఇండియా ఆతిథ్య‌మివ్వ‌నుంది.

EDUCATION & JOB UPDATES

నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు.

డి ఈ ఈ సెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.

నేటితోముగుస్తున్న ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు.

TGPSC – CDPO, ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ పరీక్షల నూతన తేదీలు ప్రకటన

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు 2024 నోటిఫికేషన్ విడుదల

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు