BIKKI NEWS (JULY 30) : TODAY NEWS IN TELUGU on 30th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 30th JULY 2024
TELANGANA NEWS
రెండో విడత రైతు రుణమాఫీ నిధుల జమ నేడే. లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ.
రేపు తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం.
విద్యుత్ ప్లాంట్ ల నిర్మాణంలో కుంభకోణం. రేవంత్ రెడ్డి
సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.
ANDHRA PRADESH NEWS
సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి పెంచింది.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్‌లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది
ఇంటి నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్ణణాలలో 2 సెంట్లు. చంద్రబాబు
ఆగస్టు 2న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం.
NATIONAL NEWS
తొలిసారి ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం బెంచ్ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించగా.. కోర్టు రూమ్‌లోకి మీడియా కెమెరాలను కూడా అనుమతించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాలతో కలిపి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.185 లక్షల కోట్లకు చేరవచ్చని నరేంద్రమోదీ సర్కారు అంచనా వేసింది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 56.8 శాతానికి సమానమని తెలిపింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో తేడాలున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ సంచలన విషయం వెల్లడించింది. ఏకంగా 538 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలున్నట్టు తెలిపింది.
నితీశ్ కుమార్ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది.
పాము కాటు వల్ల దేశంలో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవా రం లోక్‌సభలో వెల్లడించారు.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
జమ్మూ కశ్మీర్‌లో సోమవారం పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
బీహార్‌లో కూలుతున్న బ్రిడ్జిలు.. నితీశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
INTERNATIONAL NEWS
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వెనిజువెలా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో మళ్లీ గెలుపొందారు.
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
120వ మూలకాన్ని సృష్టించడంలో భాగంగా టైటానియం పార్టికల్ బీమ్ ఉపయోగించి నివర్‌మోరియం, ‘ఎలిమెంట్ 116’ నుంచి రెండు పరమాణువులను సృష్టించినట్టు లారెన్స్ బెర్కెలే నేషనల్ ల్యాబొరేటరీ(బెర్కెలే ల్యాబ్) శాస్త్రవేత్తలు న్యూక్లియర్ స్ట్రక్చర్ 2024 సదస్సులో ప్రకటించారు.
BUSINESS NEWS
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్
సెన్సెక్స్ : 81,356 (23)
నిఫ్టీ : 24,836 (1)
ద్విచక్ర వాహన తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ.. ఈవారంలోనే ఐపీవోకి రాబోతున్నది. షేర్ల ధరల శ్రేణి రూ.72-76 స్థాయిలో ఉంటుందని ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రం కు గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.28 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. తద్వారా సుమారు 85 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
1935లో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఏర్పాటైంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్బీఐ ఏర్పాటై 90 ఏండ్లు పూర్తయ్యాయి. 90 ఏండ్ల ఆర్బీఐ ప్రస్థానంలో కీలక విశేషాలను ప్రస్తావిస్తూ సాగుతుందీ వెబ్ సిరీస్.
దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండటంతో బులియన్ మార్కెట్లో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.950 తగ్గి రూ.71,050లకు పరిమితమైంది. కిలో వెండి ధర రూ.4500 తగ్గింది.
SPORTS NEWS
వచ్చే ఏడాది ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్.. టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న టోర్నీ..
నేడే భారత్, శ్రీలంక ఆఖరి టీ20. క్లీన్ స్వీప్ లక్ష్యం.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో మను, సరబ్‌జ్యోత్ సింగ్ ద్వయం మూడో స్థానంలో నిలిచి క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది
అర్జెంటీనాతో జరిగిన హకీ పూల్-బీ రెండో మ్యాచ్‌లో భారత జట్టు డ్రా (1-1)తో ముగించింది.
పురుషుల సింగిల్స్ గ్రూప్-ఎల్ లో భాగంగా లక్ష్య సేన్ 21-19, 21-14తో జులియన్ కరెగ్గి (బెల్జియం)ను వరుస సెట్లలో ఓడించాడు.
EDUCATION & JOBS UPDATES
నీట్-యూజీ కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుందని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) సోమవారం వెల్లడించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో మొదలవుతుంది.
సీఏ పౌండేషన్ ఫలితాలు విడుదల. 14.96% మాత్రమే ఉత్తీర్ణత.