BIKKI NEWS (AUG 28) : TODAY NEWS IN TELUGU on 28th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 28th AUGUST 2024
TELANGANA NEWS
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒకరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు
ఉస్మానియా దవాఖాన కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి చర్చించారు.
165 రోజులు కారాగారవాసం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటికి వచ్చింది. కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నన్ను అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు అని ఆమె అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం లేకుండా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘ఇది అధికార నిర్ణయమా? లేక అనధికార నిర్లక్ష్యమా? తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా సీఎస్ గారు?’ అంటూ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌సీ) నుంచి తెలంగాణకు ఏటా 200 మెగావాట్ల సౌరవిద్యుత్తు అందనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
బుల్కాపూర్ నాలా హద్దుల నిర్ధారణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
విద్యాసంవత్సరం మధ్యలో విద్యాలయాల అక్రమ భవనాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఇచ్చిన వార్నింగ్‌తోనే హైడ్రా తోకముడిచిందని సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
టీజీఎస్‌ఆర్టీసీలో కొలువుల భర్తీకి మరో రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్లలో పేదలు వేసుకున్న రేకుల షెడ్లు, గుడిసెల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. సర్వే నంబర్ 148, 149లో నిరుపేదలు నిర్మించుకున్న రేకుల షెడ్లను తొలగించేందుకు పోలీసులు జేసీబీలతో రంగప్రవేశం చేశారు.
ఏపీ నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను భువనగిరి ఎస్‌వోటీ, పోచంపల్లి పోలీసులు పట్టుకున్నారు
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 4వ పులుల గణాంకాల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 33 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి.. 32 ఎకరాల్లో భవనాల నిర్మాణానికి నిర్ణయం
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ (TGSRTC) కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు.
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను సవరించి, రూల్ 3ఏ సెక్షన్‌ను చేర్చుతూ ప్రభుత్వం గత నెల 19న జారీచేసిన జీవో 33కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.
ఖమ్మం కలెక్టరేట్ వద్ద వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వామపక్ష నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ANDHRA PRADESH NEWS
ఏపీలో పోలింగ్‌శాతం పెరుగుదలపై ఎన్నికల సంఘానికి వైసీపీ మరోసారి ఫిర్యాదు
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట దక్కింది. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్‌సిగ్నల్
తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. టీడీపీకి వైసీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల పుణేలో కూలిపోయిన హెలికాప్టర్ సీఎం చంద్రబాబుకు కేటాయించిందేనని తేలడంతో ఆయన భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా..? జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
ఈరోజు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. నోట్స్ లేకుండా ఈ-ట్యాబ్‌లతో నిర్వహణ
ఏపీలోని ఆర్థిక రాజధాని విశాఖలో అక్రమ నిర్మాణాలు చేపడితే హైదరాబాద్‌లో మాదిరిగా హైడ్రా తరహ చర్యలు మొదలు పెడుతామని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.
NATIONAL NEWS
పశ్చిమ బెంగాల్ భగ్గుమంది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నబన్న అభిజన్’ ర్యాలీ పేరుతో పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ అనే విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది.
దేశంలో మైనర్లు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 15 ఏండ్ల బాలికపై ఇద్దరు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు
రైల్వే బోర్డు చైర్మన్‌గా సతీశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్‌ఎంఎస్) అధికారి.
ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది. ఆయన కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ జడ్జి కావేరీ బవేజా సమక్షంలో హాజరుపరిచారు.
రాజ్యసభకు 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా, ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ(అజిత్ పవార్) నుంచి ఒకరు, రాష్ట్రీయ లోక్‌మంచ్ నుంచి ఒకరు ఉన్నారు.
ముక్కు ద్వారా అందించే కొవిడ్-19 టీకాను గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిని ‘సీడీఓ-7ఎన్-1గా పిలుస్తున్నారు.
యాపిల్ నూతన సీఎఫ్‌ఓగా భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌కు పదోన్నతి కల్పించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు.
భారీ వర్షాలకు గుజరాత్ అస్తవ్యస్తం.. 6 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా మరోసారి మాయావతి.. ఏకగ్రీవంగా ఎన్నిక
బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా.. ఈ నెల 30న చేరుతున్నా : చంపాయ్ సోరెన్
ఉక్రెయిన్ ట్రిప్ గురించి పుతిన్‌తో మాట్లాడిన మోదీ
INTERNATIONAL NEWS
కరువు కోరల్లో చిక్కుకొన్న ప్రజల కడుపు నింపేందుకు 723 వన్య ప్రాణులను వధించాలని నమీబియా సర్కారు నిర్ణయించింది. పరిమితికి ఉంచి ఉన్న వన్యప్రాణులను చంపడానికి నిర్ణయించినట్టు ఆ దేశ పర్యావరణ శాఖ సోమవారం తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సుమారు 24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
బైబై స్వీడన్.. పెరిగిన జీవన వ్యయంతో దేశాన్ని వీడుతున్న భారతీయులు
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరింత ముదురుతున్నదని, మూడో ప్రపంచ యుద్ధం సంభవించే ప్రమాదముందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన మట్టి నుంచి నీటిని వెలికితీశారు
BUSINESS NEWS
వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ సంకేతాలు.. ఆచితూచీ ఇన్వెస్టర్లు.. ఫ్లాట్ గా ఇండెక్సుల ముగింపు
సెన్సెక్స్ : 81,712 (14)
నిఫ్టీ : 25,018 (7)
యూజర్లకు షాకిచ్చిన యూట్యూట్.. ప్రీమియం ఛార్జీలు పెంపు.
ఐదు శాతం వడ్డీరేటుపై రూ.25 లక్షల వరకూ మధ్యతరగతి వర్గ ప్రజలకు ఇండ్ల కొనుగోలుకు రుణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారెడ్కో అధ్యక్షుడు జీ హరిబాబు కోరారు.
పాత వాహనాన్ని స్క్రాపేజీ కింద తొలగించి, సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వాలని కార్లు, వాహనాల తయారీ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.
ఫోర్త్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సిటీని ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) అనేది ఓ కొత్త పథకమని, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిపట్ల సంతృప్తికరంగా ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్..నోటిద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ ‘హిల్‌కాల్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
SPORTS NEWS
పారిస్ పారాలింపిక్స్‌కు మరికొన్ని గంటల్లో అట్టహాసంగా తెరలేవనుంది. సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో చారిత్రక సీన్‌నదిపై ఆరంభ వేడుకలతో ప్రపంచదృష్టిని ఆకర్షించిన పారిస్..మరోమారు అలరించేందుకు ముస్తాబవుతున్నది
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), కొకో గాఫ్ (అమెరికా) ముందంజ వేశారు
హైదరాబాద్‌ను మిస్ అవుతున్నా.. వార్నర్ ఇన్‌స్టా స్టోరీ వైరల్
మహిళల టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. హర్మన్ ప్రీత్‌కు సారథ్య బాధ్యతలు
దేశవాళీలో మహిళా క్రికెటర్లకు ప్రైజ్ మనీ.. బీసీసీఐ మరో తీపి కబురు
భారత్‌కు భంగపాటు.. శాఫ్ అండర్-20 చాంపియన్‌షిప్ సెమీస్‌లో ఓటమి.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్ కైవసం చేసుకుంది.
EDUCATION & JOBS UPDATES
TGPSC – గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో నాన్ గెజిటెడ్ పోస్టులకు 31న సర్టిఫికెట్ వెరిఫికేషన్
TGPSC – వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ A& B) నోటిఫికేషన్ కు సంబంధించి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేశారు.
SSC – జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 05 న విడుదల చేరనున్నట్లు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 కానిస్టేబుల్ పోస్టులకు త్వరలోనే ఈవెంట్స్ షెడ్యూల్ ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ లో త్వరలోనే 3035 ఉద్యోగాలకు నోటిఫికేషన్
జర్నలిజం కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలుగు యూనివర్సిటీ అడ్మిషన్స్ గడువు పెంపు