BIKKI NEWS (SEP. 27) : TODAY NEWS IN TELUGU on 27th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 27th SEPTEMBER 2024
TELANGANA NEWS
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర కోటా కింద డెహ్రాడూన్ సైనిక్ సూలులో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకొని, తిరిగి ఇంటర్మీడియట్ తెలంగాణలోనే పూర్తి చేసిన అభ్యర్థిని స్థానికుడు కాదని ఎలా అంటారని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ప్రశ్నించింది.
హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు.
హైడ్రా కూల్చివేతలను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను తాము సమర్థించబోమని పేర్కొన్నారు.
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ప్రముఖ ఆలయాల ప్రసాదాలను టెస్టింగ్ కోసం ల్యాబ్‌లకు పంపించింది.
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని యూటీఎఫ్-గురుకుల టీచర్ల జేఏసీ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 19,587 మంది ఆర్జిజన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్సన్ జేఏసీ చైర్మన్ ఈశ్వర్‌రావు, కన్వీనర్ ఎంఏ వజీర్ ట్రాన్స్‌కో, డిస్కంల యాజమాన్యాలను డిమాండ్ చేశారు.
నవంబర్ నుంచి సవరించిన చార్జీలను రిజిస్ట్రేషన్ చార్జీలను అమలు చే యాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థి రాస్తుల రిజిస్ట్రేషన్‌కు కొత్త ధరలను ఆగ స్టు 1 నుంచే అమలు చేయాలని భావించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
ANDHRA PRADESH NEWS
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు.
ఈరోజు తిరుమల పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారు. తన పర్యటన సందర్భంగా ఎలాంటి హడావుడి చేయవద్దని పార్టీ కేడర్‌కు సూచించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యంషాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్‌బుక్ అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యతో పాటు వారి అనుచరులు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు.
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్.
ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు
NATIONAL NEWS
130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలలో ఏర్పాటుచేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.
దేశంలో పారాసిటమాల్, పాన్ డి, కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్స్, యాంటీ-డయాబెటిక్ సహా 50కి పైగా మందులు నాసిరకంగా ఉన్నాయని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) తాజా నివేదిక వెల్లడించింది.
హాస్టల్ వార్డెన్‌కు మరణశిక్ష.. 21 మంది విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసుపై కోర్టు తీర్పు
బిల్కిస్ బానో కేసుపై గుజరాత్ సర్కార్‌కు షాక్.. సమీక్షా పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..
బీహార్ రాష్ట్రంలో నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పిల్లలు, మహిళలు గల్లంతయ్యారు. 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 46 మంది నీటిలో మునిగి మరణించారు.
నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొని జిల్లాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ)ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది
ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరగనున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల విచారణ చేసేందుకు వీలు లేకుండా సీబీఐకి సాధారణ సమ్మతిని గురువారం ఉపసంహరించుకుంది
కార్మికుల కనీస వేతనాలు పెరిగాయి. వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్‌ను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మికుల రోజువారీ కనీస వేతనాన్ని రూ.1,035 వరకు పెంచింది
INTERNATIONAL NEWS
నైరోబీ ఎయిర్‌పోర్టు విస్తరణ, నిర్వహణ కోసం అదానీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కెన్యా ప్రభుత్వం నిర్ణయించింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగడం యాదృచ్ఛికంగా జరగలేదని, దీని వెనక కుట్ర ఉందని ఆ దేశ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాల్పుల విరమణ పాటించాలని అగ్రదేశాలు చేసిన విన్నపాన్ని ఇజ్రాయిల్ తిరస్కరించింది. పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ కొనసాగించాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ ఆదేశించారు.
బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లు వాడితే.. ఆ దేశాలపై అణుదాడి చేస్తాం..కొత్త అణు సిద్ధాంతం ప్రకటించిన పుతిన్
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 85,836 (666)
నిఫ్టీ : 26,216 (212)
దేశ రాజధాని ఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.400 ఎగబాకి రూ.78,250 పలికింది.
గత నాలుగేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
డెట్ సెక్యూరిటీస్ పబ్లిక్ ఇష్యూ, నాన్-కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల లిస్టింగ్‌కున్న సమయాన్ని 3 రోజులకు తగ్గించాలని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నిర్ణయించింది
SPORTS NEWS
నేటి నుంచి కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో తాను చివరి మ్యాచ్‌ను ఆడేశానని తెలిపాడు.
చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.
రాజకీయాల్లో అడుగుపెట్టిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆమెకు నోటీసులు పంపింది.
EDUCATION & JOBS UPDATES
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫార్మసీలో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ చేసిన వారికి ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టీ రాము తెలిపారు.
నవంబర్ 18 న SSC CHSL టైర్ – 2 పరీక్ష
ఏపీలో ఎయిడెడ్ టీచర్స్ భర్తీ కి గ్రీన్ సిగ్నల్
SSC MTS అడ్మిట్ కార్డులు విడుదల
తెలంగాణ పాఠశాలల్లో SA – 1 పరీక్షలు అక్టోబర్ 21 – 28 వరకు నిర్వహించనున్నారు.