BIKKI NEWS (AUG 27) : TODAY NEWS IN TELUGU on 27th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 27th AUGUST 2024
TELANGANA NEWS
ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని.. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో ఆగస్టు 31 వరకు భారీ వర్షాలు పడనున్నాయి.
బీజేపీ సర్కారు తీసుకువచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు పేర్కొంది.
15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వీసీల నియమాకం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన 135 మందికి రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 27వ తేదీన యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు
హైడ్రా చర్యల వల్ల బడా బాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందా లేదా వారి ఒత్తిడితో రేవంత్ రెడ్డే జైలుకు వెళ్లే ప్రమాదం ఉందా అనేది త్వరలోనే తేలుతుందని సీపీఐ నారాయణ అన్నారు.
ఎల్ఆర్ఎస్(భూముల క్రమబద్దీకరణ) పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.
జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డీఎస్సీ 2008 బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిరసనలు వద్దు.. వచ్చి కలవండి అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ డీఎస్సీ 2008 బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ANDHRA PRADESH NEWS
ప్రపంచవాప్తంగా హడలెత్తిస్తున్న మంకీపాక్స్ ఏపీలోనూ కలకలం రేపింది. దుబాయ్నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
పెదకాద పోలింగ్ బూత్ నంబర 20లో ఈవీఎంలు తనిఖీ చేయాలని, వీవీప్యాట్ లెక్కించాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో ఘోరం జరిగింది . ఏనుగుల దాడిలో వృద్ధుడు చనిపోయిన ఘటన కొమరాడ మండలం వన్నాం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని.. రూ.13లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు
ఏపీలో ప్రొబేషనరీలుగా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పలు జిల్లాలకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అనకాపల్లి జిల్లాలో 912 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.
వైఎస్సార్ కడప జిల్లాలో రెండు వేర్వేరూ రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్నును కూడా త్వరలోనే రద్దు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపించారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు.
NATIONAL NEWS
కార్గో షిప్ సముద్రంలో మునిగింది. ఆ నౌకకు చెందిన 11 మంది సిబ్బందిని కోస్ట్ గార్డ్ రక్షించింది. ఆపద గురించి తెలుసుకున్న వెంటనే కోస్ట్ గార్డ్ నౌకలు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ అనుకూలించని వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన శివాజీ భారీ విగ్రహం కూలిపోయింది. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్‌లో 35 అడుగులు ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రైతుల నిరసనను బంగ్లాదేశ్ అలజడితో పోల్చిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రకటనపై కాంగ్రెస్ మండిపడింది.
మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందించారు. నిర్ధిష్ట ఫిర్యాదులతో ఎవరైనా ముందుకు వస్తే చట్టం తన పని తాను చేస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారని పేర్కొన్నారు.
హత్య కేసులో నిందితుడు, కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో సకల రాజ భోగాలు అందుతున్నట్లు ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఏడుగురు అధికారులు సస్పెండ్ చేశారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ సోమవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పై వారు చర్చించుకున్నారు
కేంద్రపాలిత ప్రాంతమైన లఢఖ్ లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.
దేశరాజధాని ఢిల్లీ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మరణించారు.
దేశంలోని 76 నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) కీలక అధ్యయనం నిర్వహించింది. 2019తో పోలిస్తే 2030 నాటికి ఆయా నగరాల్లో ఉద్గారాలు 11 నుంచి 45శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది
INTERNATIONAL NEWS
ఉక్రెయిన్‌పై రష్యా వంద డ్రోన్‌లు, క్షిపణులతో దాడి చేసిందని ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సోమవారం తెలిపారు. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ఆయన తెలిపారు. రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు.
బలూచిస్థాన్‌లో రెచ్చిపోయిన సాయుధులు.. వాహనాలు, పోలీస్ స్టేషన్లపై దాడి.. 33 మంది మృతి
ఆఫ్రికా దేశమైన సుడాన్ లో తాజాగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్ర సముద్రం నగరానికి మంచి నీటి సరఫరాకు ప్రధాన వనరుగా ఉన్న ఆర్బాత్ డ్యామ్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానిక మీడియా నివేదించింది.
ఉబర్ సంస్థకు భారీ జరిమానా విధించింది నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం. ఉబర్ రెయిడ్ సర్వీస్ సంస్థకు 32.4 కోట్ల డాలర్ల జరిమానా వేశారు.
సూసైడ్ డ్రోన్ల పరీక్షను సూపర్‌వైజ్ చేశారు ఉత్తర కొరియా నేత కిమ్. యుద్ధ సంసిద్ధతకు ఇది కీలమైన అంశమని పేర్కొన్నారు.
పొరుగుదేశం బంగ్లాదేశ్ లో మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఢాకా లో విద్యార్థులకు, పారామిలిటరీ దళమైన అన్సార్ సభ్యులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 50 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.
ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్స్.. హిజ్‌బొల్లాపై అటాక్‌లో పాల్గొన్నాయి. ఆ విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపారు. దానికి చెందిన వీడియోను .. ఇజ్రాయిల్ రక్షణశాఖ రిలీజ్ చేసింది.
BUSINESS NEWS
యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ వ్యాఖ్యలతో.. లాభాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,698 (612)
నిప్టీ : 25,011 (187)
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే తగ్గి 7.1 శాతానికి పరిమితం అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 7.8 శాతం వద్ద నిలిచింది.
పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ షోకాజ్ నోటీసులు ఇచ్చిన వార్తలు రావడంతో సోమవారం స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ దాదాపు 9 శాతం పతనమైంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పుడు కొత్తగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. దీనిద్వారా మరింత సులభంగా రుణాలను పొందడానికి వీలు కలుగుతుంది.
మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సీఈవో పవెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లోని లీ బగెట్ ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రైవేట్ జెట్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేశారు. మెసేజింగ్ యాప్‌నకు జారీ చేసిన ఓ వారెంట్ కింద టెలిగ్రాం సీఈవోను ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
SPORTS NEWS
ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2024కి షెడ్యూల్ విడుదల చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా అక్టోబర్ 3న మెగా టోర్నీ ప్రారంభం కానున్నది.
ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2024లో అక్టోబర్ 6న దుబాయిలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవనున్నది.
యూఎస్ ఓపెన్ 2024 ప్రారంభమైంది. డిఫెండింగ్ చాంపియన్లు నొవాక్ జొకోవిచ్ (పురుషుల), కోకో గాఫ్ (మహిళల) తమ టైటిల్స్‌ను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడు జై షా వారసుడు ఎవరు అనే చర్చ మొదలైంది. సెక్రటరీ రేసులో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ అందరికంటే ముందున్నాడని టాక్.
EDUCATION & JOBS UPDATES
త్వరలోనే 35 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
స్కిల్ యూనివర్సిటీలో అన్ని సర్టిఫికెట్, డిప్లమో కోర్సులు ఉంటాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం వృథా కాకుండా 2 వేల మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి యూనివర్సిటీ శిక్షణ ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ENTERTAINMENT UPDATES
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు నమితకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరాలను వెల్లడించారు.
సందీప్ రెడ్డి వంగా, ప్రబాస్ కాంబో లో రాబోతున్న స్పిరిట్ మూవీ 2026 లో విడుదల కానుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఆగష్టు 29 నుంచి ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ మరియు మరాఠీ భాషలలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.