BIKKI NEWS (OCT. 26) : TODAY NEWS IN TELUGU on 26th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 26th OCTOBER 2024
TELANGANA NEWS
శుక్రవారం జరిగిన ‘ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్’ పేపర్ పరీక్షకు ఇబ్రహీపట్నంలోని సీవీఆర్ కాలేజీలో మహబూబ్‌నగర్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళా అభ్యర్థి పరీక్షకు హాజరైంది. చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి. తదుపరి పరీక్షలు రాయకుండా డీబార్.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ జాక్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కనగరాజు మృతి. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి 2021 లో కనగరాజుకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రదానం చేసింది.
బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన జీవోను నిలిపివేసింది
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘దిక్కు మాలిన పాలనలో దిక్కుమొక్కులేని జీవితం గడుపుతున్నారు. అని విమర్శించారు.
రాష్ర్టాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర రహదారులన్నింటి నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పత్తి రైతులు పంటలను అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో హ వాట్సాప్ సేవలు ప్రారంభించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఉద్యోగుల డీఏ పై నేడు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసే అవకాశం.
317 జీవో నివేదిక ప్రభుత్వం అనుమతి పొందిన తరువాత విడుదల చేసే అవకాశం
ANDHRA PRADESH NEWS
డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపునకు గ్రీన్ సిగ్నల్
శంషాబాద్ – వైజాగ్ సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్
ఒడిశాలో తీరం దాటిన దానా తుఫాను
ఇసుకకు సీనరేజ్ మినహాయింపు
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులే.
ఆస్తుల కోసమే వైఎస్ షర్మిల రాద్దాంతం : వైవీ సుబ్బారెడ్డి, పేర్నినాని
NATIONAL NEWS
2022 జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లిన దాదాపు 29 వేల మంది భారతీయుల ఆచూకీ గల్లంతయ్యిందని ఓ నివేదిక వెల్లడించింది.
ఏటా సివిల్ సర్వీసుల్లోకి అభ్యర్థులను ఎంపిక చేసే యూపీఎస్సీ శుక్రవారం మరో 120 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. రిజర్వ్ లిస్టులో ఉన్న వీరి పేర్లను విడుదల చేసింది.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్‌మోల్ బిష్ణోయ్ ఆచూకీ చెప్పినవారికి రూ.10 లక్షలు బహుమతి ఇవ్వనున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రకటించింది.
నైపుణ్య భారత శ్రామిక శక్తి పట్ల నమ్మకంతో వారికి జారీ చేసే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని ప్రధాని మోదీ వెల్లడించారు.
దాతృత్వానికి పేరుగాంచిన రతన్ టాటా.. తన పెంపుడు శునకం టీటోకు భారీగా సంపదను రాసిచ్చినట్లు ఆయన వీలునామా ద్వారా తెలుస్తోంది.
ఉద్యోగాల కల్పన అనేది అత్యవసరమైన ప్రపంచ సమస్యగా మారుతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
INTERNATIONAL NEWS
కెనడా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. నలుగురు భారతీయులు మృతి
ఆన్‌లైన్ పేమెంట్స్ విధానంలో చైనా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అరచేతిని చూపిస్తే చాలు చెల్లింపు పూర్తయ్యే ఈ కొత్త విధానాన్ని ‘పామ్ పేమెంట్స్’ అంటున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. ‘ది ముకాబ్’ పేరుతో సౌదీ అరేబియా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రాజధాని రియాద్‌లో చేపట్టిన కొత్త నగరం ‘న్యూ మురబ్బా’లో దీనిని నిర్మిస్తున్నారు.
BUSINESS NEWS
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 79,402 (-663)
నిఫ్టీ : 24,181 (-219)
బులియన్ మార్కెట్లో శుక్రవారం ఒకేరోజు తులం బంగారం ధర రూ.1,150 తగ్గి రూ.80,050కి దిగింది
ఈ నెల 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పడిపోయి 688.26 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
వరుసగా రెండో నెలలోనూ భారీగా పెరిగిన బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్లు.. జియో ఎయిర్ టెల్‌లకు తప్పని తగ్గుదల
బంధన్ బ్యాంక్ ఎండీగా పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా.. నవంబర్ 1న బాధ్యతల స్వీకరణ
SPORTS NEWS
పూణే టెస్టులో పీకల్లోతు కష్టాల్లో భారత్. రెండో రోజు ఆట ముగిసే సరికి 301పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్.
చెన్నై వేదికగా జరిగిన 36వ జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శశాంక్, జ్ఞానదత్ విజేతలుగా నిలిచారు.
తెలంగాణ క్రీడా విధానానికి(స్పోర్ట్స్ పాలసీ) సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఊరట లభించింది. 2018 సాండ్‌పేపర్ గేట్ వివాదంలో వార్నర్‌పై ఇన్ని రోజులుగా ఉన్న లైఫ్‌టైమ్ కెప్టెన్సీ, లీడర్‌షిప్ నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా ఎత్తివేసింది.
భారత్ వేదికగా తొలిసారి జరుగబోతున్న ఖోఖో ప్రపంచకప్‌లో ఆయా జట్ల ప్రాతినిధ్యంపై ఆసక్తి ఏర్పడింది. జనవరిలో జరుగనున్న అరంగేట్రం ఖో ఖో ప్రపంచ పోరులో మొత్తం 24 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
EDUCATION & JOBS UPDATES
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల. నవంబర్ 11 వరకు గడువు.
రెండు వారాల్లో ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఏపీ బీసీ స్టడీ సర్కిళ్ళ ద్వారా అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
RRB ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ మార్పు