Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 26 – 12 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 26 – 12 – 2024

BIKKI NEWS (DEC. 26) : TODAY NEWS IN TELUGU on 26th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 26th DECEMBER 2024

TELANGANA NEWS

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌, పుష్ప సినిమా నిర్మాతలు రూ.2 కోట్లు సాయం అందించారు

గ్రీన్‌ ఎనర్జీ పాలసీపై వచ్చే నెల 3న సమావేశం నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తారు వర్షాలు కురువొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

గ్రామీణ మహిళ ల అక్షరాస్యతలో తెలుగు రాష్ర్టాలు అట్టడుగున నిలిచాయి. బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వెనుకబడ్డాయి

రాష్ట్రంలో మరో కొత్తజాతి పక్షి.. మహబూబాబాద్‌ జిల్లాలో కొరియన్‌ ఫ్లైక్యాచర్‌

మహిళలను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జం

ANDHRA PRADESH NEWS

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21న హోమగుండంలో అగ్నిప్రతిష్ఠాపనతో మొదలైన భవానీదీక్షలు బుధవారం పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి.

ఈనెల 31 వరకు తత్కాల్‌ పథకం కింద 3 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు

జనవరి 9న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ : టీటీడీ ఈవో

ఏపీని కలవరపెడుతున్న వరుస అల్పపీడనాలు.. కోస్తా, రాయలసీమలో వర్షాలు

NATIONAL NEWS

క్రిస్మస్‌ వేళ మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది

బీజేపీ ప్రోద్బలంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని తప్పుడు కేసులోఅరెస్టు చేయవచ్చని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం అనుమానం వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా ఆయన స్మారక స్థూపం ‘సదైవ్‌ అటల్‌’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తదితర రాజకీయ ప్రముఖులు బుధవారం నివాళి అర్పించారు.

వాజపేయి శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.100 స్మారక నాణేన్ని, తపాల స్టాంప్‌ను విడుదల చేశారు.

వైష్ణ‌వోదేవి ఆల‌యం వ‌ద్ద నిర్మించ‌నున్న‌ రోప్‌వే ప్రాజెక్టును వ్య‌తిరేకిస్తూ 72 గంట‌ల పాటు కాట్రాలో బంద్ నిర్వ‌హిస్తున్నారు

INTERNATIONAL NEWS

అజర్‌బైజాన్‌ విమానం కూలిన ప్రమాదంలో 40 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు

తూర్పు అఫ్గనిస్థాన్‌పై పాకిస్థాన్‌ జరిపిన వైమానిక దాడులలో 46 మంది పౌరులు మరణించినట్లు తాలిబన్‌ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

రేపిస్టులు, హంతకులను క్షమించేది లేదు.. వారికి మరణ శిక్షే : డొనాల్డ్‌ ట్రంప్‌

అంతరిక్షంలో పెద్ద పరిమాణంలో ఉన్న రిజర్వాయర్‌ను జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిమాణం భూమిపైనున్న మహాసముద్రాలకంటే 140 ట్రిలియన్‌ రెట్లు పెద్దగా ఉంటుంది. ఇది ఓ సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌ హోల్‌కు దగ్గరలో ఉంది.

ఈ పవిత్ర సంవత్సరంలో ఆయుధాల గర్జనలను ఆపే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని, ప్రపంచంలో వ్యాపిస్తున్న విభజనలను అధిగమించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ అన్ని దేశాల ప్రజలకు బుధవారం క్రిస్మస్‌ సందేశం ఇచ్చారు.

BUSINESS NEWS

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ ఓలా స్పీడ్‌ పెంచింది. ఒకేసారి దేశవ్యాప్తంగా 3,200 అవుట్‌లెట్లను తెరిచింది.

ఈ సంవత్సరం మొదలు నవంబర్‌ నెలాఖరుదాకా మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ ఏకంగా రూ.17 లక్షల కోట్లపైనే పెరిగింది

SPORTS NEWS

ప్రో కబడ్డీ లీగ్ లో లీగ్‌ దశలో రాణించి పాయింట్ల పట్టికలో టాప్‌-6లో నిలిచిన హర్యానా స్టీలర్స్‌, దబాంగ్‌ ఢిల్లీ (ఈ రెండు జట్లు నేరుగా సెమీస్‌ చేరాయి), యూపీ యోధాస్‌, పాట్నా పైరేట్స్‌, యూ ముంబా, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

నేటి నుండి మెల్‌బోర్న్‌ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్ట్) మొదలుకానుంది.

బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్‌ పాయింట్లకు చేరిన రెండో బౌలర్ గా రికార్డు. గతంలో రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఈ ఘనత సాదించాడు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను చెల్లించిన క్రికెటర్‌లలో విరాట్‌ కోహ్లీ తొలి స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఏకంగా రూ.66 కోట్ల పన్ను చెల్లించాడు.

EDUCATION & JOBS UPDATES

డిగ్రీ థర్డ్‌ ఇయర్‌లో లాంగ్వేజెస్‌కు టాటా.. ఇక నుంచి కేవలం కోర్‌ సబ్జెక్టులే – తెలంగాణ ఉన్నత విద్యా మండలి

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) హాల్‌టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు