Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 09 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 09 – 2024

BIKKI NEWS (SEP. 25) : TODAY NEWS IN TELUGU on 25th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 25th SEPTEMBER 2024

TELANGANA NEWS

మూసీ నది అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలే.. హెచ్చరించిన వాతావరణశాఖ

ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లు ఆమోదానికి కృషి చేయాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మంత్రి సీతక్క కోరారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 రాష్ర్టానికి రానున్నారు. ఉదయం నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరై మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను ప్రారంభిస్తారని రాష్ట్రపతి నిలయం పేర్కొంది.

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు చోట్ల పిడుగులు పడి నలుగురు మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన బీసీ హామీ అమలయ్యే వరకు బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. బీసీల నాయకత్వాన్ని ప్రొత్సహించింది బీఆర్‌ఎస్సేనని గుర్తుచేశారు.

అప్పులుచేసి కాలేజీలను నడుపుతున్నామని, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్య సంఘాలు కోరాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెల 16న జరిగే విచారణకు తప్పక హాజరుకావాలంటూ నాంపల్లి ఈడీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. రేవంత్‌రెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసు విచారణ నాంపల్లి ఈడీ కోర్టులో మంగళవారం కొనసాగింది.

రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట రు జాబితా రూపొందించే ప్రక్రియ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. వచ్చే మార్చి 29తో రాష్ట్రంలో మూడు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

తెలంగాణ సాధన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది.

వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి విధివిధానాలు ఖరారు చేసి అక్టోబర్‌ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

ANDHRA PRADESH NEWS

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు..చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఏపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల లక్ష్మికి ఉద్వాసన

న్యాయస్థానాలు జోక్యం చేసుకుని చంద్రబాబు కుట్రలు బయటపెట్టాలి : మాజీ మంత్రి అంబటి

త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు

NATIONAL NEWS

ప్ర‌పంచ సంస్థ‌ల్లో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాంతి వ‌ర్ధిల్లిలాల‌ని ఆయ‌న ఆశించారు. న్యూయార్క్‌లోని ఐక్య‌రాజ్య‌స‌మితిలో జ‌రిగిన స‌మ్మిట్ ఆఫ్ ద ఫ్యూచ‌ర్ మీటింగ్‌లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీని క‌లిశారు. ఆ ఇద్ద‌రూ ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌, డెంటల్‌ అడ్మిషన్లలో ఎన్నారై కోటా పరిధిని విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయంపై పంజాబ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ మోసానికి ముగింపు పలకాల్సిందేనని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

రైతుల పోరాటంతో రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ చేయాలని బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ పేర్కొన్నారు

మధ్య ప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో కనీసం ఒక విద్యార్థి కూడా చేరని సర్కారు బడుల సంఖ్య 5,500కుపైనే ఉండటం విశేషం.

ఉద్యోగ నిర్వహణలో భాగంగా భర్తకు దూరంగా నివసించడం క్రూరమైన చర్య, విడిచిపెట్టడంగా భావించలేమని, విడాకులు పొందడానికి అది ఎంతమాత్రం కారణం కాజాలదని అలహాబాద్‌ హైకోర్టు ఒక ప్రధాన తీర్పులో పేర్కొంది

మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకున్న చర్యలేంటో వివరించండి.. ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు ‘సుప్రీం’ ఆదేశం..

INTERNATIONAL NEWS

ఇజ్రాయెల్‌ మంగళవారం కూడా దక్షిణ లెబనాన్‌పై దాడులు కొనసాగించింది. దీంతో దాడుల్లో దాదాపు 558 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.

శ్రీలంక రెండు వైపుల నుంచి నొక్కుకుపోవాలని కోరుకోవడం లేదని ఆ దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. ముఖ్యంగా భారత్‌, చైనాల మధ్య ఇరుక్కుపోవాలని అనుకోవడం లేదన్నారు.

శ్రీలంక ప్రధాని పీఠంపై చాలా ఏళ్లకు మళ్లీ మహిళ.. నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణం

చాట్‌ జీపీటీ’ సృష్టికర్త ఓపెన్‌ ఏఐ సంస్థ ప్రస్తుతం హ్యాకర్ల సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది. తాజాగా ఆ సంస్థకు చెందిన ఒక ఎక్స్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది.

200 రాకెట్ల‌తో హిజ్‌బొల్లా ఫైరింగ్‌.. పేల్చేసిన‌ ఇజ్రాయిల్ ఐర‌న్ డోమ్‌.

BUSINESS NEWS

సెన్సెక్స్‌ @ 85000, నిఫ్టీ @26000

సెన్సెక్స్ : 84,914 (-15)
నిఫ్టీ : 25,940 (1)

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద దాదాపు 10,700 నకిలీ రిజిస్ట్రేషన్లను అధికారులు గుర్తించారు. ఇవన్నీ రూ.10,179 కోట్ల పన్ను ఎగవేసినట్టు తేల్చారు.

నెక్సాన్‌ విభాగంలోనే సీఎన్‌జీ, సరికొత్త 45 కిలోవాట్ల బ్యాటరీతో నెక్సాన్‌ ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు లైన్‌ క్లియరైంది. దాదాపు 3 బిలియన్‌ డాలర్ల (రూ.25,000 కోట్లు) నిధుల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) దేశంలోనే అతిపెద్దది కానున్నది.

జీవిత కాల గరిష్టానికి బంగారం.. ఔన్స్ ధర 2658.30 డాలర్లు

SPORTS NEWS

ఇటీవలే పారిస్‌ వేదికగా ముగిసిన పారాలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఐదు పతకాలు అందించిన పారా షట్లర్లకు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌) రూ. 50 లక్షల నగదు రివార్డును ప్రకటించింది.

చైనా వేదికగా జరిగిన హాంగ్జో ఓపెన్‌లో అన్‌సీడెడ్‌ భారత ఆటగాళ్లు జీవన్‌, విజయ్‌.. 4-6, 7-6(7/5), 10-7తో ఫ్రాంట్జెన్‌, జెబెన్స్‌(జర్మనీ)ను ఓడించి డబుల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నారు.

చైనా వేదికగా జరిగిన చెంగ్డూలో ఓపెన్ లో రన్నరప్‌గా యూకీ ద్వయం

ఈసారి మ‌హిళల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు పూర్తి గా మహిళ అంపైర్ లతోనే నిర్వహించాలని అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) నిర్ణయం

బరువు పెరగడం వినేశ్ పోగట్ తప్పే.. దాన్ని కుట్రగా పేర్కొనడం సరికాదు.. వినేశ్‌పై యోగేశ్వర్ దత్‌ మండిపాటు

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ ఎంబీబీఎస్ క‌న్వీన‌ర్ కోటా కౌన్సెలింగ్ కోసం చ‌ర్య‌లు.. నేడు ప్రొవిజ‌న‌ల్ మెరిట్ లిస్ట్ విడుద‌ల‌..

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ క్యాబినెట్‌ నిర్ణయం మేరకు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది

తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించాలనుకుంటున్నది. బాలవాటిక పేరుతో తరగతులను నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు తీవ్రతరం చేశారు

ఐసెట్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తి..

ENTERTAINMENT UPDATES

తాత్కాలిక ఆనందాల కోసం డ్రగ్స్‌ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు