TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 10 – 2024

BIKKI NEWS (OCT. 25) : TODAY NEWS IN TELUGU on 25th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 25th OCTOBER 2024

TELANGANA NEWS

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఎమ్మెల్సీ ఓటర్లుగా అర్హులేనని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం రూ. 358 కోట్ల దీపావళి బోనస్‌ ప్రకటించింది. దీంతో ఒక్కో కార్మికునికి 93,750/- రూపాయలు రానున్నాయి.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్న ట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా కే కేశవరావు ఉంటారని ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటేషన్‌ జారీకి విధి విధానాల రూపకల్పనకు నూతన కమిటీని నియమించింది

తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మరో ముగ్గురు కొత్త జడ్జిలను నియమకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

గడువు లోగా పోలవరం పూర్తి చేస్తాం – బాబు

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం తీపి కబురు.. 57 కి.మీ కొత్త రైల్వే లైన్‌కు కేబినెట్‌ ఆమోదం

మా తల్లి, చెల్లి ఫొటోలతో డైవర్షన్‌ రాజకీయాలు : వైఎస్‌ జగన్‌

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని అంజనిపురం కాలనీలో అతిసారం ప్రబలి మరో ఇద్దరు మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

నేటి నుండి రాష్ట్రంలో పశుగణన

NATIONAL NEWS

భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా గురువారం నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.

ఓ వ్యక్తి వయసును రుజువు చేయడానికి ఆధార్‌ కార్డు తగిన ధ్రువీకరణ పత్రం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

జమ్ముకశ్మీరులో ఉగ్రవాదులు బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌ సమీపంలో గురువారం సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

భారత విమానయాన సంస్థలకు గురువారం ఒక్కరోజు 80కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

వరల్డ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ బంగాతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ..

అజిత్ పవార్ వర్గానికి ఊరట.. గడియారం చిహ్నం వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి

దీపావళి, ఛట్‌పూజకు 2వేల ప్రత్యేక రైళ్లు.. వెల్లడించిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌

INTERNATIONAL NEWS

రక్షణ సంస్థపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా తుర్కియే బుధవారం ఇరాక్‌, సిరియాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగింది.

ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్‌ ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్ష భవనం ప్రాంగణంలో పడింది.

కెనడా ప్రధాని ట్రూడోకు సొంత పార్టీ ఎంపీలు అల్టిమేటం.. రాజీనామా చేయాలంటూ డెడ్‌లైన్‌

ఫిలిప్పీన్స్‌లో ట్రామి తుఫాన్‌ బీభత్సం.. 23 మంది మృతి

BUSINESS NEWS

నాలుగో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి

సెన్సెక్స్ : 80,065 (-17)
నిఫ్టీ : 24,399 (-36)

పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశానికి సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్ గైర్హాజరయ్యారు

SPORTS NEWS

పూణే టెస్టులో యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ధాటికి కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. సుందర్ – 7, అశ్విన్ – 3 వికెట్లు తీశారు. భారత్‌ 16/1

భారత హాకీ జట్టు మాజీ సారథి రాణి రాంపాల్‌ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది

వ‌ర‌ల్ట్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్ల్యూటీసీ మ్యాచుల్లో అత‌ను 188 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

భారత మహిళా క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ (41, 1/35) ఆల్‌రౌండ్‌ షోతో అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది.

సారథి హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌ చెరో రెండు గోల్స్‌ చేయడంతో జర్మనీతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ను భారత హాకీ జట్టు 5-3తో గెలుచుకుంది

ఆనంద్ తర్వాత చెస్ లో 2800 ఎలో రేటింగ్ సాదించిన ఆటగాడిగా అర్జున్ ఘనత

EDUCATION & JOBS UPDATES

UPSC NDA and NA – 1 RESULTS విడుదల

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ తుది జాబితా విడుదల

తెలంగాణ లో పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రారంభం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు