BIKKI NEWS (JULY 25) : TODAY NEWS IN TELUGU on 25th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 25th JULY 2024
TELANGANA NEWS
బడ్జెట్‌లో అన్యాయం.. నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరించిన తెలంగాణ సీఎం
25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్‌రెడ్డి, గద్దెనెకిన తర్వాత మర్చిపోయారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు..
ఉద్యోగులకు త్వరలో పెండింగ్ డిఏలు విడుదల చేస్తాం – భట్టి విక్రమార్క
రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా రైతు భరోసా అమలు చేస్తాం – మంత్రి తుమ్మల
విధి విధానాలు పూర్తయ్యాక తెల్ల రేషన్ కార్డులు జారీ – మంత్రి ఉత్తమ్
అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇల్లు – మంత్రి పొంగులేటి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ పిడిఎస్‌యు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం
ANDHRA PRADESH NEWS
ఆంధ్రప్రదేశ్‌లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిల్లీ లో జంతర్ మంతర్ వద్ద డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వ మద్యం పాలసీపై సీఐడీ విచారణకు ఆదేశం.
ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్‌శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం. త్వరలో మార్గదర్శకాలు. అనంతరం నిధులు విడుదల – లోకేష్
NATIONAL NEWS
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో ‘పాన్’ కార్డ్ పొందటాన్ని అక్టోబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది.
బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ’ రెండో దశ ప్రయోగం సక్సెస్ అయ్యింది. 5 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన శత్రు దేశ క్షిపణులను ఇది ఎదుర్కొనగలదు.
పరీక్షల్లో అక్రమాల నిరోధానికి బీహార్‌లో బిల్లు – పేపర్ లీక్‌లకు పాల్పడితే జైలు శిక్ష, రూ.10 లక్షల ఫైన్.
నీట్ రద్దుకు బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం దక్కింది. పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
INTERNATIONAL NEWS
84 ఏండ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జూలై 22వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ రోజున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీలుగా నమోదైనట్టు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లెమేట్ చేంజ్ సర్వీస్(CCCS) తెలిపింది.
టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. 18 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్.
కొవిడ్ నుంచి కోలుకున్న బైడెన్.. వైట్‌హౌస్‌కు అధ్యక్షుడు
షార్క్ చేపల్లో కొకైన్.. ఆ నీటిని తాగటంతోనే వాటి శరీరంలోకి కొకైన్ ప్రవేశం.
BUSINESS NEWS
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్‌లు.. సెన్సెక్స్ : 80,148.88 (-280)
నిఫ్టీ : 24,413 ( -65 )
బడ్జెట్‌లో మదుపరులకు గట్టి దెబ్బ.. మూలధన లాభాల పన్నుల పెంపు
‘బ్యాంకుల్లో నగదు చెల్లింపుల నిబంధనలు కఠినతరం’ – బ్యాంకులు తమ వద్ద ఖాతాలేని వారికి ఇస్తున్న నగదు విషయంలో ఆ వ్యక్తుల రికార్డులను భద్రపరుచాలన్న ఆర్బీఐ
72 వేల దిగువకు పసిడి ధరలు
SPORTS NEWS
యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) లోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్ లేక్ సిటీ 2034 వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.
పారిస్ వేదికగా జరుగుతున్న 33వ ఒలింపిక్స్ పోటీలలో భాగంగా బుధవారం సాకర్, రగ్బీ సెవెన్స్ మ్యాచ్‌లతో విశ్వక్రీడలు ప్రారంభమయ్యాయి.
లారా: ద ఇంగ్లండ్ క్రానికల్స్ అనే పుస్తకాన్ని బ్రియన్ లారా విడుదల చేశారు.
ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ మరోసారి ఎంపిక.
EDUCATION & JOBS UPDATES
DEECET 2024 RESULTS – డీఈఈసెట్ 2024 ఫలితాలు విడుదల
లా కోర్సులలో అడ్మిషన్లకు వచ్చే ఏడాదికి మార్గదర్శకాలు – హైకోర్టు
తెలుగు యూనివర్సిటీ అడ్మిషన్లు ఇక కేవలం తెలంగాణ వారికి పరిమితం.
ఎస్సీ జూనియర్ గురుకులాల్లో ఇంటర్మీడియట్ స్పాట్ అడ్మిషన్లు 26, 27 తేదీలలో.
ఆగస్టు ఒకటి నుండి జేఎన్టీయూలో బీఆర్క్ ప్రవేశాలు.