Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 12 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 12 – 2024

BIKKI NEWS (DEC 25) : TODAY NEWS IN TELUGU on 25th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 25th DECEMBER 2024

TELANGANA NEWS

పూరిగుడిసె ఉన్నోళ్లకే తొలి విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

జిల్లా స్థాయిలో డీఎఫ్‌ఆర్సీ.. స్టేట్‌ లెవల్లో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ.. ఇలా రాష్ట్రంలోని ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఫీజుల ఖరారుకు త్వరలోనే రెండు కమిటీలు ఏర్పాటు కానున్నాయి

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలపై త్వరలో సినీ పెద్దలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎఫ్‌డీసీ) చైర్మన్‌, నిర్మా త దిల్‌ రాజు తెలిపారు

చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యారు.

గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన‌ అభ్యర్థులకు ఈనెల 27, 28, 30 తేదీల్లో డెమో నిర్వహించ‌నున్నారు.

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని బీచుప‌ల్లి రెసిడెన్షియ‌ల్ స్కూల్‌ విద్యార్థులు ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ ఏకంగా 18 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశారు

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హ‌రీశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ANDHRA PRADESH NEWS

ఏపీకి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, మాజీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది

ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణం.. టీటీడీ ఈఓ శ్యామలరావు

వైసీపీ హయాంలో నియమితులైన 410 మంది ఫైబర్‌నెట్‌ ఉద్యోగుల తొలగింపు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్షం సూచన

పులి పంజలా కొట్టగలిగే శక్తి మాలో ఉంది.. ఏపీ కూటమికి వైసీపీ నేత సజ్జల హెచ్చరిక

NATIONAL NEWS

జమ్మూ కశ్మీరులోని పూంఛ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మెంధర్‌లోని బల్నోయి ప్రాంతంలో సైనిక వాహనం అదుపుతప్పి 350 అడుగుల లోయలో పడిపోయింది.. దీంతో ఐదుగురు జవాన్ల మృతి.

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.

బిహార్‌ గవర్నర్‌ – ఆరిఫ్‌ అహ్మద్‌, మణిపూర్‌ గవర్నర్‌ – అజయ్‌ కుమార్‌ భల్లా
ఒడిశా గవర్నర్‌ – కంభంపాటి హరిబాబు
కేరళ గవర్నర్‌ – రాజేంద్ర ఆర్లేకర్ మిజోరాం గవర్నర్‌ – జనరల్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ సింగ్‌

ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలు, నర్సింగ్స్‌ హోమ్‌లు రేప్‌, యాసిడ్‌ దాడి, లైంగిక హింస బాధితులకు ఉచిత వైద్య చికిత్సను నిరాకరించలేవని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

దేశంలో నే అత్యధికంగా నాగాలాండ్ లో 99.8 శాతం మంది మాంసాహారాన్ని ఆరగిస్తారని సర్వే తెలియజేసింది.

అసదుద్దీన్‌ ఒవైసీకి యూపీ కోర్టు సమన్లు.. పార్లమెంట్‌లో పాలస్తీనా అనుకూల నినాదాలపై ఫిర్యాదు

చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపడమే లక్ష్యం : ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌

కేన్-బెట్వా న‌దీ అనుసంధానం జాతీయ ప్రాజెక్టుకు ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు

INTERNATIONAL NEWS

ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్‌ వైమానిక దాడులు.. 15 మంది మృత్యువాత

ప్రపంచంలోనే తొలిసారి పూర్తిగా సాయుధ రోబోలు, డ్రోన్లతో కూడిన అసాల్టింగ్‌ ఫోర్స్‌ను ఉక్రెయిన్ రంగంలోకి దింపింది.

అఫ్గానిస్థాన్‌లో క్రియాశీలకంగా లేని జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేస్తున్న సిబ్బందిపై మంగళవారం దాడి జరిగింది

సూర్యుడిలోని క‌రోనా భాగానికి అత్యంత చేరువ‌గా పార్క‌ర్ సోలార్ ప్రోబ్ స్పేస్‌క్రాఫ్ట్ వెళ్ల‌నున్న‌ది. డిసెంబ‌ర్ 27వ తేదీన మ‌ళ్లీ ఆ ప్రోబ్ నుంచి సిగ్న‌ల్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది.

చైనా నుంచి 40 స్టీల్త్ ఫైట‌ర్ విమానాలు కొనుగోలు చేయ‌నున్న పాకిస్తాన్‌

BUSINESS NEWS

సెన్సెక్స్ 67.30 పాయింట్ల నష్టంతో 78,472.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 25.80 పాయింట్లు తగ్గి.. 23,727.65 వద్ద స్థిరపడింది.

డాలర్ తో రూపాయి విలువ 4 పైసలు క్షీణించి ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి 85.15కు చేరిక

సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రిటైల్‌ షాపుల్లో యూపీఐ క్యూఆర్‌ లావాదేవీలు 33శాతం పెరిగాయి.

బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు.

స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్‌పర్సన్ మాధాబి పూరీ బుచ్ ను అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ లోక్‌పాల్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

SPORTS NEWS

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదల. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ మొదలు. మార్చి 9న ఫైనల్‌. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ భారత్ పోరు

రేపటి నుండి బాక్సింగ్ డే టెస్ట్

వచ్చే ఏడాది కౌలాలంపూర్‌ వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ మహిళా సెలక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

EDUCATION & JOBS UPDATES

ఏపీలో పదో తరగతి ఫీజు గడువును తత్కాల్ కింద 1000 రూపాయల ఆలస్య రుసుముతో జనవరి 10 వరకు పొడిగించారు.

గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన‌ అభ్యర్థులకు ఈనెల 27, 28, 30 తేదీల్లో డెమో నిర్వహించ‌నున్నారు.

UGC NET సిటీ ఇంటిమెషన్ స్లిప్స్ అందజేత. జనవరి 3 నుంచి పరీక్షలు

ITBP లో 51 కానిస్టేబుల్ ఉద్యోగాలకై నోటిఫికేషన్

తెలంగాణ గురుకులాల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ లౌ ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా చేపట్టాలని నిర్ణయం.

అన్నమయ్య జిల్లాలో 116 అంగన్వాడీ ఉద్యోగాలకై నోటిఫికేషన్

UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ తుది ఫలితాలు ప్రకటించింది

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు