BIKKI NEWS (SEP. 23) : TODAY NEWS IN TELUGU on 23rd SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 23rd SEPTEMBER 2024
TELANGANA NEWS
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమ యం పట్టే అవకాశం ఉన్నది. తాజా సమాచారం ప్రకారం పీఆర్సీ నివేదిక సమర్పణకే మ రో మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టనున్నది.
కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అమృత్ పథకం టెండర్లలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు జీవధార అని, ఇది వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో పర్యావరణానికి పెనుముప్పు కలుగనున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్‌ను నెలకొల్పేందుకు 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కచ్చితంగా జనాభాను లెకించాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎకడి నుంచి అయినా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తొమ్మిది నెలల్లో ఒక రోజు కూడా తాను సెలవు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. సోమవారం వాయవ్య, పరిసర పశ్చిమ -మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది.
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా బుల్డోజర్లు.. పటేల్‌గూడలో విల్లాల కూల్చివేత
ANDHRA PRADESH NEWS
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని టీడీపీ చేస్తున్న ప్రచారమంతా బోగస్ అని టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో తేలిపోయింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లలో నాణ్యత తగ్గినట్లు గుర్తించి ఆ నెయ్యిని ఉపయోగించలేదని.. జంతు, వెజిటెబుల్ కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ నుంచి నివేదిక రావడంతో ట్యాంకర్లను వెనక్కి పంపించేశామని తెలిపారు.
తిరుమలలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై వైసీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. స్వామి వారి లడ్డు విషయంలో వాస్తవాలు నిగ్గుతేల్చాలని లేఖలో కోరారు. తన రాజకీయాల కోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు.
లడ్డూ కల్తీపై సీబీఐతో విచారణ జరిపించే దమ్ముందా? చంద్రబాబును నిలదీసిన టీటీడీ మాజీ చైర్మన్
కల్తీ జరగలేదని ప్రమాణం చేస్తాం.. మీరు చేస్తారా ? చంద్రబాబుకు అంబటి సూటి ప్రశ్న
పవన్‌కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో తప్పును ఒప్పుకున్నారు : మాజీ మంత్రి రోజా
అల్లూరి జిల్లాలో విషాదం.. జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతు
NATIONAL NEWS
ఆగ్రాలోని తాజ్‌మహల్ లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఫలితంగా ఈ పాలరాతి కట్టడంలోని గోడలు, ఫ్లోరింగ్ పలు చోట్ల దెబ్బతినడమే కాక, పగుళ్లు కూడా దర్శనమిస్తున్నాయి.
భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నష్ట పరిహారం చెల్లింపు వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంటుందని, ఇది రాష్ర్టాల రాజ్యాంగ, చట్టబద్ధమైన బాధ్యత అని గుర్తు చేసింది. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన తీర్పును వెలువరించింది.
ఈడీ వేధింపుల గురించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ మారకపోతే తనను జైల్లోనే చంపేస్తామని కొందరు బెదిరించారన్నారు.
రామ జన్మభూమిలోని రామాలయంలో పూజలు చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆదివారం తిరస్కరించారు. నిర్మాణం పూర్తి కాని దేవాలయంలో తాను పూజలు చేయనని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఆ మార్గంలో వెళుతున్న గూడ్స్ రైలు లోకో పైలట్ దీనిని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో ప్రమాదం తప్పింది.
దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులలో 97.7 శాతం కేసులు 13 రాష్ర్టాలలోనే చోటుచేసుకున్నాయి. వీటిలో యూపీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.
తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇండో పసిఫిక్ విద్యార్థుల కోసం భారత ప్రధాని ఐదు లక్షల డాలర్లతో 50 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రకటించారు.
అక్కడ ఆర్టికల్ 370 పునరుద్ధరణ ఏ శక్తివల్లా కాదు.. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్
బైడెన్‌తో చర్చలు ఫలించాయి.. క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ నుంచి హిల్సా చేపల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. త్వరలో 3 వేల టన్నుల పద్మా పులస చేపలను భారతదేశానికి ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
INTERNATIONAL NEWS
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది.
ఇరాన్‌లోని ఓ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది 51మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది.
ఇజ్రాయెల్‌పై 100 రాకెట్లతో హెజ్బొల్లా దాడి. లెబనాన్‌పై జరిగిన దాడికి బదులుగా ప్రయోగం.ఇరు ప్రాంతాల్లో ముదురుతున్న ఉద్రిక్తతలు
గాజా నగరంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
భూమి వైపుగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ అపోఫిస్..! దిశ మారితే విధ్వంసం తప్పదంటూ శాస్త్రవేత్తల ఆందోళన..!
అమెరికాలో తుపాకీ కాల్పులు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు.
BUSINESS NEWS
20 రోజుల్లోనే రూ.33,700 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ హైల్లో కదలాడుతున్నాయి. మదుపరులు పెట్టుబడులకే పెద్దపీట వేస్తున్నారు. గత వారం ట్రేడింగ్‌లో శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,360, నిఫ్టీ 375 పాయింట్లు పెరిగాయి. ఈ క్రమంలోనే వారం మొత్తంగా సూచీలు భారీగానే ఎగిశాయి.
ఐ-ఫోన్ సహా ఆపిల్ ఉత్పత్తులతో ముప్పు.. హెచ్చరించిన కేంద్రం..
వాట్సాప్ తన యూజర్లు నచ్చిన థీమ్ తో ఇతరులతో చాటింగ్ చేసే ఫీచర్ తీసుకొస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌పై వీసా ఉల్లంఘన.. పన్ను ఎగవేత.. వివక్ష ఆరోపణలు.. దర్యాప్తు చేపట్టిన హోంశాఖ..
కోమెట్ ఈవీ ధర రూ.4.99 లక్షలకు తగ్గనున్నది. ఎక్స్‌షోరూం ధర రూ.6.99 లక్షలు. ఈ నూతన ధరలతో కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ.2.5కి తగ్గనున్నదని పేర్కొంది.
SPORTS NEWS
ప్రతిష్టాత్మక బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ లో భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. రెండు విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది.
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన 280 పరుగులతో విజయదుందుభి మోగించింది. 515 పరుగుల ఛేదనలో బంగ్లా 234 పరుగులకే పోరాటాన్ని చాలించింది.
దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ దక్కించుకుంది. ఆట ఆఖరి రోజు 350 పరుగుల ఛేదనలో ఇండియా ‘సీ’.. 217 పరుగులకు కుప్పకూలడంతో అగర్వాల్ సేన 132 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం అన్మోల్ ఖర్బ్ మరోసారి సత్తా చాటింది. కొద్దిరోజుల క్రిత మే ‘బెల్జియం ఇంటర్నేషనల్’ను గెలుచుకున్న 17 ఏండ్ల ఈ అమ్మాయి.. ఆదివారం లుబ్లిన్ (పోలండ్) వేదికగా ముగిసిన ‘పోలిష్ ఇంటర్నేషనల్ 2024’ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
EDUCATION & JOBS UPDATES
ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల.
నేటితో ముగియనున్న నవోదయ 6వ తరగతి ప్రవేశాల గడువు
ఇండియన్ నేవీ లో 250 నేవీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
TG PGECET 2024 రెండో విడత కౌన్సెలింగ్ 23 నుంచి
ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ గ్రాడ్యుయోట్ కోర్సులు
ENTERTAINMENT UPDATES
గిన్నిస్ బుక్‌లోకి మెగాస్టార్ చిరంజీవి. 156 సినిమాలు.. 537 పాటలు.. 24వేల స్టెప్పులతో రికార్డు.