Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 12 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 12 – 2024

BIKKI NEWS (DEC 23) : TODAY NEWS IN TELUGU on 23rd DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 23rd DECEMBER 2024

TELANGANA NEWS

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ పేరుతో కొందరు రాళ్ళు, టోమాటోలతో దాడి.

ఇవాళ మా ఇంటి ముందు జరిగిన ఘటన అందరూ చూశారన్నారు. తాము సంయమనం పాటించాల్సిన సమయమని.. అందుకే అదే పాటిస్తున్నామని అల్లు అరవింద్ తెలిపారు.

అల్లు అర్జున్‌కు అండగా కేంద్రమంత్రి బండి సంజయ్‌.. నువ్వేమైనా పరామర్శించావా అని రేవంత్‌ రెడ్డిపై ఫైర్‌

కాంగ్రెస్‌ నాయకుల గల్లా పట్టి నిలదీయండి.. అన్నదాతలకు కేటీఆర్‌ బహిరంగ లేఖ

అల్లు అర్జున్‌కు మేం వ్యతిరేకం కాదు.. తప్పు ఎవరు చేసిన కేసు నమోదు చేస్తాం : డీజీపీ

రైతు భరోసా మార్గదర్శకాలు ఇంకా సిద్ధం కాలే.. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయం: మంత్రి తుమ్మల

సైబర్ నేరాలు ఎక్కువగా కరెంటు ఖాతాలతోనే – సీపీ ఆనంద్

ANDHRA PRADESH NEWS

ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా.. సింగన్నపాలెం, మారెళ్లలో భూకంపం వచ్చింది.

ప్రజలపై రూ. 15,485 కోట్లు విద్యుత్‌ భారం వేసిన చంద్రబాబు : వైసీపీ మాజీ మంత్రులు

తిరుమలలో అనధికార దుఖానాలపై త్వరలోనే చర్యలు. టీటీడీ ఈవో

చంద్రబాబు భద్రత కు అటానమస్ డ్రోన్ లు.

NATIONAL NEWS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి కువైట్ దేశపు అత్యున్నత పౌర పురష్కారం ” ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ” తో సత్కరించారు.

పోలింగ్‌ బూత్‌ సీసీ ఫుటేజ్‌ తనిఖీపై కేంద్రం నిషేధం.. ఇకపై ఫుటేజ్‌ చెకింగ్‌కు నో ఛాన్స్‌

ఎన్నికల సంఘం సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర – ఖర్గే

యూపీఏ ప్రభుత్వ హయాంలోని అవినీతి కారణంగానే బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగిపోయాయని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆరోపించారు.

విదేశాంగ మంత్రి జైశంకర్ కు నేషనల్ ఎమినెన్స్ అవార్డు

రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన యూపీ హైకోర్టు

INTERNATIONAL NEWS

టిక్‌టాక్‌ పై అల్బేనియాలో నిషేధం.

వాట్సాప్‌ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్‌ స్పైవేర్‌ను జొప్పించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థపై మెటా వేసిన కేసులో అమెరికా కోర్టు దృవీకరించింది.

కువైట్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ షేక్‌ అహ్మద్‌ అల్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు.

కాంగో లో పడవ బోల్తా పడి 18 మంది మృతి

BUSINESS NEWS

ఈ ఏడాది 90 కంపెనీలు ఐపీఓ ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.6 లక్షల కోట్ల నిధులు సేకరించాయి.

ఓలా ఎలక్ట్రిక్‌..లిమిటెడ్‌ ఎడిషన్‌గా 24 క్యారెట్‌ బంగారంతో తయారైన ఎస్‌1 ప్రొ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

జెఫ్ బెజోస్ 5 వేల కోట్లతో త్వరలోనే వివాహం

SPORTS NEWS

మొట్టమొదటి అండర్‌ 19 ఆసియా మహిళల టీ20 చాంపియన్‌గా భారత్ నిలిచింది. ఫైనల్ లో బంగ్లాదేశ్ పై ఘనవిజయం సాధించింది.

రెజ్లింగ్‌ లెజెండ్‌ రే మిస్టీరియో సీనియర్‌ కన్నుమూత

ఛాంపియన్స్‌ ట్రోఫీ, భారత పర్యటనకు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ 2025 టీమిండియా మ్యాచులన్నీ యూఏఈలోనే.

వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే లో భారత మహిళల జట్టు ఘన విజయం

EDUCATION & JOBS UPDATES

NALCO JOBS – నాల్కో లో 518 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు