Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 08 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 08 – 2024

BIKKI NEWS (AUG 23) : TODAY NEWS IN TELUGU on 23rd AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 23rd AUGUST 2024

TELANGANA NEWS

రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణలోని గ్రూప్‌ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ప్రజాపాలనలో నాయకులు, జర్నలిస్టులపై దాడులు చేస్తారా.. హరీశ్‌రావు ఫైర్

ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు

రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌ సమీపంలో శుక్రవారం అధునాతన కేన్స్‌ టెక్‌ ఎలక్ట్రానిక్‌ యూనిట్‌ సెమీకండక్టర్ల తయారీ సంస్థను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లారు.

జనవరి 2025 నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం – ఉత్తమ్

ANDHRA PRADESH NEWS

ఏపీలో న్యాయం, ధర్మం కనిపించడం లేదు..చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ లీగల్‌ సెల్‌ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ధ్వజం

అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచన చేశారు. ఇప్పటి వరకు తిరుమల, ఎగువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా స్థానికులు, యాత్రికులు పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దువ్వాడ శ్రీనివాస్‌ ను టెక్కలి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన వైసీపీ

అచ్యుతాపురం బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : మాజీ మంత్రి బొత్స

త్వరలోనే జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్ లు – కొల్లు రవీంద్ర

నేడు అనకాపల్లి కి జగన్, అచ్యుతాపురం ప్రమాద బాధితులకు పరామర్శ.

NATIONAL NEWS

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 6 గంరు మరణించగా 22 మంది గాయపడ్డారు.

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరింది.

మహిళలపై లైంగిక దాడుల నియంత్రణకు కఠిన చట్టం : ప్రధాని మోదీకి దీదీ లేఖ.

సుప్రీంకోర్టు విజ్ఞప్తితో.. 11 రోజుల సమ్మెను విరమించిన ఎయిమ్స్‌ వైద్యులు

విదేశీ గడ్డపై దేశ మాజీ ప్రధానులను విమర్శిస్తున్నారు : మోదీపై జైరాం రమేష్‌ ఫైర్‌

మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ ఎస్పీ) అధినేత శరద్ పవార్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భద్రత జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది.

ప్ర‌ఖ్యాత బ‌యోకెమిస్ట్‌, బెంగుళూరు ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ మాజీ డైరెక్ట‌ర్ గోవింద‌రాజ‌న్ ప‌ద్మ‌నాభ‌న్‌ను విజ్ఞాన ర‌త్న‌ అవార్డుతో స‌త్క‌రించారు.

13 విజ్ఞాన్ శ్రీ పుర‌స్కార్‌, 18 విజ్ఞాన్ యువ -శాంతి స్వ‌రూప్ భ‌ట్నాగ‌ర్ ప్రైజ్‌లు, ఒక విజ్ఞాన్ టీమ్ అవార్డును కూడా రాష్ట్ర‌ప‌తి అంద‌జేశారు.

చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌లో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌లు, ఇంజినీర్ల బృందానికి విజ్ఞాన్ టీమ్ అవార్డు ద‌క్కింది.

జమ్ము కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమిపై కసరత్తు : ఇరు పార్టీల మధ్య చర్చలు షురూ

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి నేల‌పై తాను ఓ సారి నిద్ర‌పోయిన‌ట్లు సీజేఐ డీవై చంద్ర‌చూడ్ తెలిపారు. కోల్‌క‌తా కేసు విచార‌ణ స‌మ‌యంలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

భార‌తీయ విదేశీ విధానంలో మార్పు వ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. పోలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ద‌శాబ్ధాలుగా ఉన్న విదేశీ విధానం ఇప్పుడు మారింద‌న్నారు.

తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ జెండా, గుర్తును స్టార్‌ హీరో, ఆ పార్టీ చీఫ్‌ విజయ్ ఆవిష్కరించారు. ఆయన ఇటీవీల టీవీకే పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒడిశాలోని పలు జిల్లాల పరిధిలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర ఉక్కు, భూగర్భ గనుల శాఖ మంత్రి బిభుతి భూషణ్ జెనా తెలిపారు.

శాంతియుతంగా చేసే నిరసనలను అడ్డుకోవద్దని, అంతరాయం కలిగించొద్దని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి త్వరలో కొందరు సభ్యులతో ఒక కమిటీని వేయనున్నట్టు సుప్రీం కోర్టు గురువారం తెలిపింది.

కేరళ అత్యున్నత స్థాయి అధికార యంత్రాంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ బాధ్యతలను భర్త నుంచి భార్య అందుకోబోతున్నారు. ప్రస్తుత ఆ రాష్ట్ర సీఎస్‌ డాక్టర్‌ వీ వేణు ఆగస్టు 31న రిటైర్‌ కాబోతున్నారు. ఆయన పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా ఆయన భార్య శారద మురళీధరన్‌ను ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఎంపిక చేయటం వార్తల్లో నిలిచింది.

156 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. జ్వరం, జలుబు, అలెర్జీలు, నొప్పుల కోసం ఉపయోగించే యాంటీబ్యాక్టీరియల్‌ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

టెలికాం కంపెనీలకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వినియోగదారులకు ఏపీకే ఫైల్స్‌, యూఆర్‌ఎల్‌లు, ఓటీటీ లింక్‌లు, బ్లాక్‌ లిస్టులో ఉన్న కాల్‌బ్యాక్‌ నెంబర్లతో కూడిన మెసేజ్‌లను పంపరాదని ఆదేశించింది.

INTERNATIONAL NEWS

టెక్సాస్‌లో భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. హూస్ట‌న్ స‌మీపంలో 90 అడుగుల‌ మ‌హా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

హైపోథెర్మిక్‌ ఆక్సిజెనేటెడ్‌ మెషీన్‌ పెర్ఫ్యూషన్‌(హోప్‌) అనే ఈ పరికరాన్ని హార్ట్‌ ఇన్‌ ఏ బాక్స్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో గుండెను పెట్టి దాత వద్ద నుంచి అందుకునే వ్యక్తి వద్దకు సరఫరా చేస్తారు.

బోట్స్‌వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో భారీ వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు అని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.

అత్యధిక పచ్చ బొట్లు కలిగిన వ్యక్తిగా అమెరికా మహిళ ఎస్పరెన్స్‌ లుమినెస్కా ఫ్యూయెర్‌జినా(36) గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించారు. 99.98 శాతం శరీరాన్ని ఆమె పచ్చబొట్లతో నింపేశారు.

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 81,053 (148)
నిఫ్టీ : 24,811 (41)

కార్లకు తగ్గిన గిరాకీ.. దేశవ్యాప్తంగా అమ్ముడు పోని 7 లక్షల ప్యాసింజర్‌ వెహికిల్స్‌

SPORTS NEWS

లుసానే డైమండ్ లీగ్ లో భారత ఆటగాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ను 89.49 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు.

అండర్‌-17 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా.. భారత యువ రెజ్లర్లు అదితి కుమారి, నేహా సంగ్వాన్‌, పుల్కిత్‌ స్వర్ణ పతకాలతో మెరిశారు.

భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారిణి అర్చనా గిరీష్‌ కామత్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 24 ఏండ్ల వయసున్న అర్చన ఆటకు వీడ్కోలు పలుకుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఆడుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు పాక్‌.. 113 ఓవర్లలో 448/6 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (171), యువ ఆటగాడు సౌద్‌ షకీల్‌ (141) శతకాలతో భారీ స్కోరు సాధించింది.

ఫుట్‌బాల‌ర్ రోనాల్డో యూట్యూబ్ ఛాన‌ల్ పెట్టిన గంట‌ల్లోనే ఆ ఛాన‌ల్‌ను కోట్ల మంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారు. 24 గంట‌ల్లో ఆ ఛాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు కోటి దాటారు.

ఇంగ్లండ్ తో జరిగే 5 టెస్టు ల షెడ్యూల్ ను విడుదల చేశారు. 2025 జూన్ 20 ఆగస్టు 04 వరకు జరగనుంది.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణలోని గ్రూప్‌ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఇంజనీరింగ్ స్పాట్ కౌన్సెలింగ్ ను కూడా తామే చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధం

తెలంగాణ రాష్ట్రం లో త్వరలోనే 1629 రేషన్ డీలర్ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 11 వేల అంగన్వాడీ ఉద్యోగాలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు