Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 10 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 10 – 2024

BIKKI NEWS (OCT. 22) : TODAY NEWS IN TELUGU on 22nd OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 22nd OCTOBER 2024

TELANGANA NEWS

తెలంగాణలో తొలిరోజు గ్రూప్‌-1 పరీక్ష ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది

ఫలితాల్లోపే విచారణ ముగించాలి.. గ్రూప్‌-1పై హైకోర్టుకు సుప్రీం సూచన..

జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం.. గ్రూప్‌-1 కేసు తేలేదాకా న్యాయపోరాటం : కేటీఆర్‌

బ్యాక్‌లాగ్‌ పోస్టులను జనరల్‌ క్యాటగిరీలోకి మార్చి తమకు న్యాయం చేయాలని డీఎస్సీ ఉర్దూ మీడియం అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం గాంధీభవన్‌ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ANDHRA PRADESH NEWS

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. ఆ పిల్‌ను స్వీకరించిన హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆయనకు సమన్లు ఇచ్చింది.

తిరుమల కొండపై సోమవారం ఉదయం ఓ హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టింది.

ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో ఏపీ హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

దూసుకొస్తున్న దానా తుఫాన్‌.. ఏపీ, ఒడిశాలకు భారీ వర్షసూచన

NATIONAL NEWS

వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు

గుజరాత్‌లోని భరూచ్‌ జిల్లా అంక్‌లేశ్వర్‌ జీఐడీసీ ప్రాంతంలోని అవ్‌సర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

ఎల్‌ఏసీ వద్ద మళ్లీ గస్తీ.. సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా మధ్య అంగీకారం.

రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్‌, సోషలిస్ట్‌ అనే పదాలను తొలగించాలంటూ దాఖలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టులు మృతి

ప్ర‌ధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్య‌లు.. కేజ్రీవాల్ పిటీష‌న్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

జమ్ముకశ్మీర్‌ ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదు.. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫరూక్‌ అబ్దుల్లా

INTERNATIONAL NEWS

మీరు మా రాజు కాదు.. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజుకు అవమానం

64 ఏండ్ల తర్వాత పాక్‌లో హిందూ ఆలయం పునర్నిర్మాణం

BUSINESS NEWS

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్ – 81,151 (-73)
నిఫ్టీ – 24,781 (-73)

పుత్తడి సోమవారం ఏకంగా 80 వేల మైలురాయిని అధిగమించి రికార్డు సృష్టించింది.

SPORTS NEWS

ఏసీసీ మెన్స్‌ టీ20 ఎమర్జింగ్‌ ఆసియాకప్‌లో యువ భారత్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ టీమ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌ చోటు దక్కించుకుంది

గ్లాస్గో వేదిక‌గా 2026లో జ‌రుగ‌బోయే ప్ర‌తిష్ఠాత్మ‌క కామ‌న్‌వెల్త్ గేమ్స్‌ లో హాకీ ఆటపై వేటు ప‌డ‌నుంది.

EDUCATION & JOBS UPDATES

తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష

హైదరాబాద్ NMDC లో ఉద్యోగాలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు