Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22- 12 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22- 12 – 2024

BIKKI NEWS (DEC 22) : TODAY NEWS IN TELUGU on 22nd DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 22nd DECEMBER 2024

TELANGANA NEWS

సంద్య దియోటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం మరోసారి మండిపాటు. హీరో ప్రభుత్వం మాట వినలేదని ప్రకటన. హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడంపై కామెంట్

ఇకపై తెలంగాణ రాష్ట్రం లో సినిమాలకు బెనిఫిట్ షో లు, టికెట్ల ధరలు పెంపుదల ఉండబోదని మంత్రి కొమటిరెడ్డి స్పష్టం.

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. ఇందుకు గత ప్రభుత్వ విధానాలే కారణమని ప్రకటన.

జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ అల్లు అర్జున్‌ ఆవేదన

ప్రతీక్‌ ఫౌండేషన్‌ నుంచి రూ.25 లక్షలు ఆర్థికసాయాన్ని శ్రీతేజ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు

ఒక్క ఊరిలో 100 శాతం రుణమాఫీ అయినా రాజీనామా చేస్తా: కేటీఆర్‌

తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీజీవో) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏలూరి శ్రీనివాసరావు, ఏనుగుల సత్యనారాయణలను ఇప్పటికే ఎన్నుకున్న విషయం తెలిసిందే.

శాసనసభ సమావేశాలు శ నివారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. శీతాకాల సమావేశాల్లో 8 బిల్లులకు ఆమోదం

భూభారతి చట్టం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెఫరెండం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పశ్చిమ అద్దంకి ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైనట్టుగా ఎన్‌జీఆర్‌ఐ ప్రకటన.

సినీ దర్శకుడు రాం గోపాల్‌ వర్మకు ఫైబర్‌నెట్‌ నోటీసులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం

విశాఖలో 11 మంది బాలికల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు

ఇన్నాళ్లూ జగన్‌ను చూసి భయపడ్డారు.. ఇప్పుడు ఆయన కటౌట్‌ చూస్తేనే వణికిపోతున్నారు.. మాజీ మంత్రి రోజా సెటైర్లు

ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా మధుమూర్తి నియామకం

తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ వినతి.

NATIONAL NEWS

నమ్మకంపై నిర్మించుకునే బంధమే పెండ్లి: సుప్రీంకోర్టు

అంగీకార శృంగారం రేప్‌ కాదు.. వేధింపుల కోసం చట్టాన్ని వాడుకోవద్దు: ఢిల్లీ హైకోర్టు

ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్‌పర్సన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నియమితులయ్యారు.

ఫడ్నవీస్ వద్దే హోం.. ఏక్ నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి.., పవార్ కు ఆర్థిక శాఖ.

డిసెంబర్ 21న పగలు కేవలం 8 గంటలు మాత్రమే ఉండనుంది. దాదాపు 16 గంటలపాటూ రాత్రి ఉండనుంది.

దేశంలో అట‌వీ విస్తీర్ణం గ‌డిచిన మూడేళ్ల‌లో సుమారు 1445 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు పెరిగింది. దీంతో దేశంలో గ్రీన్ ఏరియా 25.17 శాతానికి చేరుకున్న‌ట్లు ప్ర‌భుత్వ డేటా తెలిపింది.

INTERNATIONAL NEWS

అమెరికాలో జరిగిన 9/11 దాడుల తరహాలో రష్యాకు చెందిన కజాన్‌ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు నిర్వహించింది

హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై ప్రొజక్టైల్‌ క్షిపణిని ప్రయోగించారు.

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో శుక్రవారం 77 మంది మరణించినట్లు సమాచారం.

అమెరికా-యూరోపియన్‌ యూనియన్‌ మధ్య వాణిజ్య లోటును తగ్గించకపోతే, పన్నుల కొరడా ఝళిపిస్తానని ట్రంప్ హెచ్చరించారు.

అమెరికాకు తప్పిన షట్‌డౌన్‌ గండం.. కీలక బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం

మిత్రపక్షమైన న్యూ డెమోక్రటిక్‌ పార్టీ.. ట్రుడో నేతృత్వంలోని లిబరల్‌ ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నది

BUSINESS NEWS

భీమా ప్రీమియం పై జీఎస్టీ ఎత్తివేత నిర్ణయం వాయిదా.

యూస్డ్‌ కార్లపై పన్నును 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు

బలవర్థకమైన బియ్యం గింజలపై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గింపు. జన్యు చికిత్సలకు జీఎస్టీ మినహాయింపు. పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీ.

SPORTS NEWS

భారత్‌ వేదికగా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌ 2025 టోర్నీ జరుగనుంది.

ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు కోయల్‌ బార్‌, నీలమ్‌దేవి రజత పతకాలతో సత్తాచాటారు.

భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్పపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది.

కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ పబ్‌కు నోటీసులు.. 7 రోజుల్లో స్పందన లేకపోతే చట్టపరమైన చర్యలు

EDUCATION & JOBS UPDATES

TGPSC – AE పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికెషన్ డిసెంబర్ 27 నుంచి

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లో అడ్మిషన్లు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 షెడ్యూల్‌ విడుదలైంది. జేఈఈ మెయిన్‌ తుది ఫలితాలు 2025 ఏప్రిల్‌ 23న లేదా అంతకుముందే విడుదలవుతాయని ఐఐటీ కాన్పూర్‌ పేర్కొన్నది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు