BIKKI NEWS (SEP. 21) : TODAY NEWS IN TELUGU on 21st SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 21st SEPTEMBER 2024
TELANGANA NEWS
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని శాఖలకున్న అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది.
రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలకు పేర్లను మార్చుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. మహిళా యూనివర్సిటీని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు యూనివర్శిటీగా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు.
ఈ ఏడాది ఖరీఫ్ నుంచే సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎనిమిది మెడికల్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మూడు వేలకు పైగా పోస్టులు మంజూరు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం.
అక్టోబర్ నుంచి నూతన రేషన్ కార్డులు జారీ, జనవరి 2025 నుండి రేషన్ లో సన్న బియ్యం పంపిణీకి కేబినేట్ ఆమోదం.
చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిని ఎలా నిర్ణయిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దసరాకు ముందే సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎట్టకేలకు సంస్థ లాభాలను తేల్చి, 33 శాతం బోనస్‌ను ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షల మేర బెన్‌ఫిట్, కాంట్రాక్ట్ కార్మికులకు 5 వేల చొప్పున లబ్ధి.
ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గతంలో కొనసాగిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కొనసాగించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులకు సక్రమంగా వేతనాలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
మహిళా డ్యాన్సర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
స్థానికత’ వివాదంలో విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. పిటిషనర్లు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో శుక్రవారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఐఐటీ హైదరాబాద్‌లోని 23 మంది అధ్యాపకులు స్టాన్‌ఫోర్డ్ ప్రపంచంలోని టాప్ 2 శాతం సైంటిస్టుల జాబితాలో చోటుదక్కించుకున్నారు.
ANDHRA PRADESH NEWS
తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కారును కేంద్ర మంత్రి నడ్డా కోరారు.
సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డూ వ్యవహారం.. జోక్యం చేసుకోవాలని సీజేఐకి వినతి..
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కట్టు కథ : వైఎస్ జగన్ వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.
ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి కాంతిరాణా తాతా కోర్టు మెట్లు ఎక్కారు.
లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరిపించండి.. అమిత్ షాకు వైఎస్ షర్మిల లేఖ
జమిలి తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం అవుతుందా?.. విజయసాయి రెడ్డి సందేహం
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలు.. చంద్రబాబుపై ఏపీ హైకోర్టులో ఫిర్యాదు
NATIONAL NEWS
న్యాయమూర్తుల నియామకం కోసం సిఫారసు చేసే కొలీజియం అంటే సెర్చ్ కమిటీ కాదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది.
కోర్టులపై నిందారోపణలు చేసినందుకు సీబీఐకి శుక్రవారం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.
జమ్ముకశ్మీర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందగా, 28 మందికి పైగా గాయపడ్డారు.
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)ని రాసేందుకు ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్ విద్యార్థులను ఈ ఏడాది అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని చెప్పారు.
భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన ‘స్టార్ హెల్త్’ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దేశం నుంచి నక్సల్ హింస, ఐడియాలజీని రూపుమాలని ప్రధాని మోదీ నిర్ణయించారని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. అందుకే మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించి, జనజీవన స్రవంతిలో కలువాలని అప్పీల్ చేస్తున్నట్లు మంత్రి షా వెల్లడించారు.
బెంగాల్ – జార్ఖండ్ సరిహద్దులు మూసివేతకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం.
INTERNATIONAL NEWS
ఇజ్రాయెల్ – లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
చందమామ పై ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం ప్రయాణం చేయడానికి వీలుగా ఒక ప్రెషరైజ్డ్ రోవన్‌ను జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కంపెనీ తయారు చేస్తున్నది.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో శనివారం దేశాధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. మొత్తం 38 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నారు.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లెబనాన్ మద్దతుగల హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై మూడు వరుస దాడులకు పాల్పడింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదాలు దాదాపు 140 మిస్సైల్‌ని ప్రయోగించారు.
ఈ ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అణ్వస్త్రాలని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అందరూ భూతాపం, పర్యావరణం గురించి మాట్లాడుతుంటారని.. తాను మాత్రం ప్రపంచ దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాలే పెను విపత్తుగా భావిస్తానని చెప్పారు.
మానవాళి అంతర్థానం కాకుండా..! 5డీ క్రిస్టల్‌లో మనిషి జన్యువు చేర్పు
BUSINESS NEWS
సెన్సెక్స్ @ 84,000
సెన్సెక్స్ : 84,544 (1359
నిఫ్టీ : 25,791 (375)
టెలికం చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి షాక్ తగిలింది. జూలై నెలలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లను కోల్పోయారు.
ఢిల్లీలో తులం బంగారం ధర రూ.700 అధికమై రూ.76,350 పలికింది. కానీ వెండి రూ.91 వేల వద్ద స్థిరంగా ఉన్నది.
బ్రెజిల్ నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకునే విషయమై ఆ దేశ చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం తెలిపారు.
త్వరలో మారుతి ఈవీ ఎస్‌యూవీ ఈవీఎక్స్ .. దేశవ్యాప్తంగా 25వేల ఈవీ చార్జింగ్ స్టేషన్ల స్థాపన ..
SPORTS NEWS
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. 308 పరుగుల ఆధిక్యత.
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 308/10
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ : 149/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 81/3
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ఎంపికయ్యాడు.
భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ దేశం కోసం (డేవిస్ కప్‌లో) ఆడేందుకు భారీగా నగదు డిమాండ్ చేశాడని ఆలిండియా టెన్నిస్ సమాఖ్య (ఐటా) సంచలన ఆరోపణలు చేసింది.
నా బౌలింగ్‌ను కాపీ కొట్టకండి.. పిల్లలకు బుమ్రా విజ్జప్తి.
భారత్ తరపున తొలి 10 టెస్టు మ్యాచుల్లో అత్యధిక పరుగుల ఆటగాడిగా యశస్వీ జైశ్వాల్
అవతరించాడు.
భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో మైలురాయికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌పై నాలుగు వికెట్లతో చెలరేగిన ఈ స్పీడ్‌స్టర్ అంతర్జాతీయంగా 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఆరో భారత పేసర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.
EDUCATION & JOBS UPDATES
స్థానికత’ వివాదంలో విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. పిటిషనర్లు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.
కోర్సుల్లో సీట్ల భర్తీకి సీపీగెట్ రెండో విడత వెబ్‌కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)ని రాసేందుకు ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్ విద్యార్థులను ఈ ఏడాది అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
సీ టెట్ 2024 పరీక్ష తేదీ ని డిసెంబర్ 15కి మార్పు
వెస్ట్రన్ రైల్వే లో 5000 అప్రెంటీస్ ఖాళీలు
RBI ఆఫీసర్ గ్రేడ్ బీ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
ENTERTAINMENT UPDATES
ఏఎన్‌ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవిగారికి ఇవ్వాలని నిర్ణయించారు.
హరిహరవీరమల్లు’ లొకేషన్‌లోకి పవన్‌కల్యాణ్ అడుగుపెట్టనున్నారు. ఈ నెల 23 నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ విజయవాడలో మొదలుకానుంది.
తక్కువ బడ్జెట్‌లో ఒక చిన్న సినిమా చేయాలని ఉంది : ఎన్టీఆర్
రజనీకాంత్‘వెట్టయాన్’ (వేటగాడు) టీజర్ రిలీజ్. ఈ చిత్రం 2024 దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.
మత విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు.. డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్