TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 10 – 2024

BIKKI NEWS (OCT. 21) : TODAY NEWS IN TELUGU on 21st OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 21st OCTOBER 2024

TELANGANA NEWS

నేటి నుండి గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29తో గ్రూప్‌-1 అభ్యర్థులకు ఎలాంటి నష్టం లేదని, లాభమే జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్కో కేంద్రంలో 20 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉంటారు.

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపునకు జారీచేసిన జీవో-317 సమీక్ష కోసం ప్రభుత్వం నియమించి క్యాబినెట్‌ సబ్‌కమిటీ తన నివేదికను ఆదివారం ప్రభుత్వానికి సమర్పించింది

పెండింగ్‌ డీఏలను విడుదల చేయకపోవడం, పీఆర్సీని ప్రకటించకపోవడం, పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్‌ 23న చలో ఇందిరాపార్క్‌కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) పిలుపునిచ్చింది

చెల్లుబాటు అయ్యేవిధంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉంటామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.

హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గచ్చిబౌలిలో స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ఇంజినీరింగ్‌ సీట్ల పెంపు ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ANDHRA PRADESH NEWS

ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మూడో కౌన్సెలింగ్ లో కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక ఓపెన్ క్యాటగిరీ సీటు ఖాళీగా ఉంచాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు.

ఏపీలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను, ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్‌ను ఖరారు చేసింది.

కడప జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు అని ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యమని మండిపడ్డారు

విశాఖలో శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31న ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

NATIONAL NEWS

ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌ స్ఫూర్తితో దాన్ని పోలిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వెదురు టవర్‌ను ఛత్తీస్‌గఢ్‌లో నిర్మించారు. 140 అడుగుల ఎత్తు కలిగిన ఈ నిర్మాణం రాయ్‌పూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఉంది.

అయోధ్య వివాదం పరిష్కారం కోసం భగవంతుడిని ప్రార్థించా: సీజేఐ డీవై చంద్రచూడ్‌

వయనాడ్‌ ఉపఎన్నిక.. ప్రియాంక గాంధీపై బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికులే లక్ష్యంగా మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. ఒక డాక్టర్‌, ఐదుగురి మృతి. పలువురికి తీవ్రగాయాలు.

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణిలోని ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌ వెలుపల ఆదివారం ఉదయం 7.50 గంటలకు భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు భారత మాజీ నిఘా అధికారిగా చెప్తున్న వికాశ్‌ యాదవ్‌ కుట్ర పన్నారని వచ్చిన ఆరోపణలను అతడి కుటుంబం ఖండించింది.

రాబోయే రోజుల్లో సీఎన్‌జీ ధర రూ.4 నుంచి రూ.6 వరకు పెరగనున్నది. అయితే, ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో పెరుగుతున్న సీఎన్‌జీ ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సంబంధితర వర్గాలు పేర్కొన్నాయి.

అసోంలో రూ. 6 కోట్ల విలువ చేసే హెరాయిన్ ప‌ట్టివేత‌

INTERNATIONAL NEWS

తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి దాడిలో 17 మంది గాయపడగా, ప్రతిగా రష్యాపై ఉక్రెయిన్‌ 100కు పైగా డ్రోన్‌లతో విరుచుకుపడడింది.

ఈవీ రంగంలో అద్భుతం.. ప్రయాణించే కొద్దీ పెరిగే బ్యాటరీ ఎనర్జీ

ఈవీఎంలను హ్యాక్‌ చేయొచ్చు.. బ్యాలెట్‌ పేపరే బెటర్‌: ఎలాన్‌ మస్క్‌

యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ సైనికులకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తాజాగా పిలుపునిచ్చారు

BUSINESS NEWS

స్టాక్ మార్కెట్ లో ఈ వారం కూడా అమ్మకాల ఒత్తిడికే ఎక్కువగా వీలున్నట్టు అంచనా.

దిగిరానున్న నోట్‌బుక్స్‌, సైకిల్స్‌, బాటిల్‌ వాటర్‌ ధరలు..! జీఎస్టీ కౌన్సిల్‌కు మంత్రుల బృందం కీలక సూచనలు..

SPORTS NEWS

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది.

బెంగళూరు టెస్టులో కివీస్ పై టీమిండియా ఓటమి. 36 ఏండ్ల తర్వాత న్యూజిలాండ్‌కు భారత్ లో తొలి గెలుపు.

ఇథియోపియా రాజధాని అడిస్‌ అబాబ వేదికగా జరిగిన ఐటీఎఫ్‌ జూనియర్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత యువ ప్లేయర్‌ ఓరుగంటి హర్షకార్తీక విజేతగా నిలిచింది.

EDUCATION & JOBS UPDATES

TGPSC – పాలిటెక్నిక్ లెక్చరర్ ల తుది ఎంపిక జాబితా ప్రకటన.

MPHW, ANM కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం.

POSTAL GDS 3వ విడుత ఫలితాలు విడుదల.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు