BIKKI NEWS (NOV. 21) : TODAY NEWS IN TELUGU on 21st NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 21st NOVEMBER 2024
TELANGANA NEWS
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి, 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడలోని పట్టా భూముల్లో చట్టప్రకారం నిర్మించిన ఇండ్లను హైడ్రా అక్రమంగా కూల్చివేస్తే బాధితులు సంబంధిత అధికారుల నుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 2300 గ్రూప్-4 అభ్యర్థులకు నేడు రేపు నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
ఫార్మా విలేజ్ కోసం తామేమీ లక్ష ఎకరాలు సేకరించడం లేదని, తొండలు కూడా గుడ్లు పెట్టని 1100 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కేటీఆర్, హరీశ్‌రావు అడ్డుకుంటున్నారని, అందుకు మూల్యం చెల్లించకతప్పదని సీఎం పేర్కొన్నారు.
రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 2.48లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గురుకుల క్రాప్ట్ మరియు మ్యూజిక్ టీచర్ మెరిట్ లిస్ట్ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల.
మల్లారెడ్డి విశ్వవిద్యాలయ పీఠ్ (సూరారం)కు డీమ్డ్ వర్సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది.
ANDHRA PRADESH NEWS
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని జగన్ ప్రశ్నించారు. తనపై, తన తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టారని మండిపడ్డారు.
25 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన పర్యాటక విధానం.
త్వరలోనే మీతో మీ చంద్రబాబు కార్యక్రమం
పదో తరగతి పరీక్షలను తెలుగు మరియు ఆంగ్లంలలో రాసుకోవచ్చని తెలిపారు.
NATIONAL NEWS
మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఎన్డీయే కూటమిదే అధికారం – ఎగ్జిట్ పోల్స్
ఫిబ్రవరి 15 నుంచి CBSE 10 మరియు 12 వ తరగతి పరీక్షలు
భూగర్భ జలాల అనుమతుల కోసం ‘భూ-నీర్’ పోర్టల్
భారత్‌లో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది
ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి బుధవారం తన ఓటీటీ యాప్ ‘వేవ్స్’ను ఆవిష్కరించింది. దీని ద్వారా యూజర్లు దూరదర్శన్, ఆకాశవాణి ఆర్కైవ్స్‌ను వీక్షించవచ్చు, వినవచ్చు. అదేవిధంగా 40 లైవ్ టీవీ చానల్స్‌ను కూడా పొందవచ్చు.
ఢిల్లీ గ్యాంగ్‌స్టర్లకు అడ్డాగా మారింది.. కేంద్ర హోంమంత్రిపై ఢిల్లీ సీఎం ఫైర్
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ఏపీ ఎక్స్‌ప్రెస్ సహా 40 రైళ్లు ఎనిమిది గంటలు ఆలస్యం
INTERNATIONAL NEWS
మ్యానిఫెస్ట్(manifest)’ పదం ఈ ఏడాది కేంబ్రిడ్జ్ నిఘంటువు ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఎన్నికైంది. ఈ ఏడాది 130,000 సార్లు ఈ పదం కోసం కేంబ్రిడ్జ్ డిక్షనరీ వెబ్‌సైట్‌లో వెతుకులాట జరిగింది. సోషల్ మీడియాలో ఈ పదం చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది.
వరల్డ్ బెస్ట్ సిటీస్-2025లో ‘లండన్ నగరం’ టాప్‌లో నిలిచింది. లండన్ తర్వాత న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్.. టాప్-10లో ఉన్నాయి.
పాక్‌కు భారీ షాక్ ఇచ్చిన యూఏఈ.. ఆ దేశ పౌరులకు వీసాలు బంద్
ఉక్రెయిన్‌కు తొలిసారిగా యాంటీ పర్సనల్ మైన్లను పంపడానికి బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
BUSINESS NEWS
ప్రపంచ సంఘటనలే మార్కెట్లకు దిక్సూచి.
ఎయిర్‌టెల్‌తో జట్టుకట్టిన నోకియా. 4జీ, 5జీ ఉపకరణాలు అమర్చేందుకుగాను కోట్లాది రూపాయల ఒప్పందం.
జీడీపీ తగ్గొచ్చు.. మందగమనంలోకి దేశ ఆర్థిక వ్యవస్థ!: డీఈఏ కార్యదర్శి అజయ్ సేథ్
SPORTS NEWS
మహిళల హాకీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది.
రేపటి నుండి బోర్డర్ గవాస్కర్ సిరీస్ ప్రారంభం
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ లో తిలక్ వర్మ 3వ స్థానం, ఆల్ రౌండర్స్ లో హర్దిక్ పాండ్యా మొదటి స్థానం.
వచ్చే ఏడాది మెస్సీ కేరళకు రానున్నాడు.
తన అద్భుత ఆటతీరుతో ఇన్నేండ్లు ప్రపంచ అభిమానులను అలరించిన స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ కెరీర్‌కు ఓటమితో వీడ్కోలు పలికాడు.
EDUCATION & JOBS UPDATES
ఫిబ్రవరి 15 నుంచి CBSE 10 మరియు 12 వ తరగతి పరీక్షలు
నేడు, రేపు గ్రూప్ 4 సర్టిఫికెట్ వెరిఫికేషన్
గురుకుల ఆర్ట్ మరియు మ్యూజిక్ టీచర్ మెరిట్ లిస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
ఏపీలో పదో తరగతి పరీక్షలు తెలుగు లేదా ఆంగ్ల మాద్యమంలో రాయాడానికి అనుమతి.