BIKKI NEWS (AUG 21) : TODAY NEWS IN TELUGU on 21st AUGUST 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 21st AUGUST 2024
TELANGANA NEWS
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించింది.
రాబోయే ఐదురోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది
రైతు రుణమాఫీపై నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు.. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.
కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 27న సుప్రీంకోర్టులో విచారణ
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
వచ్చే ఐదు రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని పొంగులేటి సూచించారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. నల్లగొండకు చెందిన గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది.
తమకు రుణమాఫీ కావడం లేదని ఆవేదన చెందిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతులు ఏపీజీవీబీకి తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ANDHRA PRADESH NEWS
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును కోరిన జగన్.. విచారణ నేటికీ వాయిదా.
తిరుమలలో ఆగస్టు 27, 28 తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు.
వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు టీచర్ల కుటుంబాలకు ఉద్యోగాలు : ఏపీ మంత్రి సంధ్యారాణి
అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులో ట్విస్ట్.. జోగి రమేశ్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు.
తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి పై టీడీపీ వర్గీయుల దాడి
ఆంధ్రప్రదేశ్లో సిబిఐ కి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు.
NATIONAL NEWS
ప్రమాదాల నివారణకు రైల్వేశాఖ ప్రణాళిక.. ఆర్టిఫిషియల్ ఏఐ సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్లు చెప్పిన బోర్డు సీఈవో
వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా సమన్లు, వారెంట్ల జారీ.. కొత్త రూల్స్ తెస్తూ సర్కారు నోటిఫికేషన్.
మంకీపాక్స్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం.. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు.
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్ : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి.. కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం: ఇస్రో చైర్మెన్
సీజే చంద్రచూడ్ ఇవాళ ఓ కీలక సందేశాన్ని వినిపించారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసు విచారణ సమయంలో.. ముంబై నర్సు అరుణా షాన్‌బాగ్ ఘటనను గుర్తు చేశారు. మరో అత్యాచార ఘటన జరిగే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, తీవ్రమైన చర్యలు తీసుకోవాలన్నారు.
మోదీ ఏకపక్షంగా వ్యవహరించే రోజులకు కాలం చెల్లింది : లేటరల్ రిక్రూట్‌మెంట్‌పై జైరాం రమేష్
కొండచరియలు విరిగిపడి.. తీస్తా డ్యామ్ పవర్ స్టేషన్ ధ్వంసం.
‘పాపా.. మీరు చెప్పిన పాఠాలే నాకు స్ఫూర్తి’.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ పోస్ట్
కశ్మీర్ లోయను వణికించిన భూకంపం.. నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు కంపించిన భూమి
వైద్యులు సమ్మెను విరమించి తమ విధుల్లోకి చేరాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కోరింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. ఈ నెల 27 వరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
INTERNATIONAL NEWS
ఎలాన్ మస్క్‌కు నా కేబినెట్‌లో చోటు కల్పిస్తా : డొనాల్డ్ ట్రంప్
డోనాల్డ్ ట్రంప్ ఆఫర్‌కు ఓకే చెప్పిన ఎలన్ మస్క్
సంతానలేమితో బాధపడే వారికి సంతానం కలిగించే వీర్యదాన ప్రక్రియ బ్రిటన్‌లో అదుపు తప్పింది. బ్రిటన్ నుంచి విదేశాలకు వీర్యం ఎగుమతి అవుతున్నది.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్ (111) కన్నుమూత.
BUSINESS NEWS
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి
సెన్సెక్స్ : 80,803 (378)
నిఫ్టీ : 24699 (126)
ఒక్కరోజే 1400 పెరిగిన బంగారం ధర .. అదే బాటలో వెండి.
వచ్చే నెలలో లాంఛ్ కానున్న ఐఫోన్ 16 ప్రొతో యాపిల్ భారత్‌లో ప్రొ మోడల్స్ తయారీని ప్రారంభించనుందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
SPORTS NEWS
మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బంగ్లాదేశ్ లో అందోళనకర పరిస్థితుల దృష్ట్యా మెగా టోర్నీని యూఏఈ లో జరిపేందుకు ఐసీసీ సిద్ధమైంది.
ఐపీఎల్ 16వ సీజన్‌తో బీసీసీఐకి రికార్డు స్థాయిలో రూ. 5,120 కోట్ల లాభం వచ్చింది.
సమోవా క్రికెటర్ విస్సేర్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్‌లో అతను 39 రన్స్ చేశాడు. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో.. ఆ రికార్డును అతను సృష్టించాడు. వనాటు దేశంతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు అయ్యింది.
అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ రోనక్ దహియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలిలో ఎన్నికలకు వేళైంది. త్వరలోనే ఐసీసీ సభ్య దేశాలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నాయి. ఐసీసీ కొత్త చీఫ్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
EDUCATION & JOBS UPDATES
ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం