BIKKI NEWS (NOV. 20) : TODAY NEWS IN TELUGU on 20th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 20th NOVEMBER 2024
TELANGANA NEWS
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో 16 రద్దు.. ఇకపై ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్లతోనే భర్తీ
నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు.
వివాదాలమయంగా మారిన గ్రూప్-1పై హైకోర్టు బుధవారం విచారించనున్నది. మొత్తం నాలుగు కేసులు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి.
డిగ్రీ కళాశాలల బంద్ నేపథ్యంలో యాధాతధంగా సెమిస్టర్ పరీక్షలు – ఉన్నత విద్యా మండలి.
అర్హులైన వారందరికీ రైతు రుణమాఫీ చేస్తా – సీఎం రేవంత్
సచివాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్’ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హనుమకొండలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రారంభించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్ర శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో సోమవారం రాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు
రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణనలో మంగళవారం వరకు 83,64,331 ఇండ్లలో సర్వే పూర్తి అయినట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు
ANDHRA PRADESH NEWS
ఏపీకి జీవనాడి పోలవరం ఎత్తు తగ్గేదే లేదు : సీఎం చంద్రబాబు
నామినేషన్ల పరిశీలన పూర్తయ్యాక టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఆరుగురు అభ్యర్థులు
ఏపీ కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం : మాజీ మంత్రి విడదల రజిని
విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై నలుగురు సామూహిక లైంగిక దాడి.. నిందితుల అరెస్ట్
శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తే అభ్యంతరం లేదు : వైసీపీ ఎమ్మెల్సీ బొత్స
వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
NATIONAL NEWS
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రెండో రోజు కూడా క్షీణించి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. కాలుష్య తీవ్రతను నిరోధించడానికి నగర వ్యాప్తంగా కృత్రిమ వర్షం కురిపించడమొక్కటే మార్గమని, ఇందుకు అనుమతించాలని ఢిల్లీ సర్కారు కేంద్రాన్ని కోరింది.
సిలబస్‌ను 15 శాతం వరకు తగ్గిస్తున్నారని, 10, 12 తరగతుల పరీక్షలను 2025లో ఓపెన్ బుక్ విధానంలో నిర్వహిస్తారంటూ వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని, వాటిని నమ్మొద్దని సీబీఎస్‌ఈ తెలిపింది.
ఈ నెల చివరినాటికి 1,000 కొత్త జనరల్ బోగీలు: రైల్వే
వీలైన చోట వర్చువల్ విచారణ చేపట్టండి: చీఫ్ జస్టిస్ సంజివ్ ఖన్నా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ కు ఆహ్వానించింది.
INTERNATIONAL NEWS
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతున్నది. ప్రపంచ యుద్ధం దిశగా సాగుతోంది.
ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రధాని ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు
అమెరికాకు ‘బాంబ్ సైక్లోన్’ ముప్పు పొంచి ఉంది. ముంచుకొస్తున్న తీవ్ర తుఫానుతో అనేక రాష్ర్టాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.
బ్రెజిల్ అధ్యక్షుడి హత్యకు కుట్ర.. ఐదుగురు అధికారుల అరెస్ట్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది
ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేశాం.. పార్లమెంట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన
BUSINESS NEWS
భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ చివర్లో ఒత్తిడికి గురై స్వల్ప లాభాలతో ముగిసింది.
సెన్సెక్స్ : 77,578 (239)
నిఫ్టీ : 23,518 (65)
స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు
గోల్డ్ లోన్లకూ త్వరలో ఈఎంఐలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిచయం చేసే యోచనలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సెబీ మార్గదర్శకాలకు లోబడి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించబోతున్నది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం మరోసారి పొడిగించే యోచనలో కేంద్రం..
గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను అమ్మేయాలని దాని మాతృసంస్థ అల్ఫాబెట్ మీద డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఒత్తిడి తెస్తున్నదని బ్లూంబర్గ్ సోమవారం ఓ వార్త ప్రచురించింది.
SPORTS NEWS
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో 2-0తో జపాన్‌ను చిత్తుచేసి వరుసగా రెండోసారి కప్‌ను సొంతం చేసుకునే దిశగా ముందడుగు వేసింది.
అంధుల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ పర్యటనకు డిఫెండింగ్ చాంపియన్ భారత్ జట్టుకు అనుమతి లభించలేదు
భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ.. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్‌లో సంచలన విజయం సాధించింది.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్న భారత మహిళల జట్టులో యువ ఓపెనర్ షఫాలీ వర్మ చోటు కోల్పోయింది.
మూడు వన్డేల సిరీస్‌ను కకివీస్ పై లంక 2-0తో గెలుచుకుంది
EDUCATION & JOBS UPDATES
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో 16 రద్దు.. ఇకపై ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్లతోనే భర్తీ
నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు.
డిపార్ట్మెంటల్ టెస్ట్ హల్ టిక్కెట్లు విడుదల
డిగ్రీ కళాశాలల బంద్ నేపథ్యంలో యాధాతధంగా సెమిస్టర్ పరీక్షలు – ఉన్నత విద్యా మండలి.
ఓయూ పరిధిలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు