BIKKI NEWS (AUG 20) : TODAY NEWS IN TELUGU on 20th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 20th AUGUST 2024
TELANGANA NEWS
వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ప్రభుత్వం తాండూరు పీఏసీఎస్‌లో ఆయన తీసుకున్న రూ.1.50 లక్షల రుణాన్ని మాఫీ చేసింది.
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
లోక్‌సభ నియోజకవర్గానికి ఒక స్పోర్ట్స్ స్కూలు – సీఎం రేవంత్
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న అదనపు ఎస్పీ భుజంగరావుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది.
రైతులు ఎదుర్కొంటున్న అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించేలా నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా..? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.
ప్రభుత్వ ఉద్యోగి చేసే ప్రతి పని సామాన్యుడికి ఉపయోగపడేలా ఉండాలి : భట్టి విక్రమార్క
రుణమాఫీపై చిత్తశుద్ధి ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలి : బండి సంజయ్.
తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ.
పెండింగ్ డిమాండ్లపై తాడోపేడో.. సర్కారుపై ఆర్టీసీ కార్మికుల జంగ్‌సైరన్.
రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, డాటా క్లియర్‌గా ఉన్న రైతులకే రుణమాఫీ అయిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు లభించని 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం బుధవారం తేలనున్నది. ఈ ఏడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా.. ఇటీవల ఎన్‌ఎంసీ 4 కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
భూములకు సంబంధించిన రికార్డులను తమంతట తాముగా సవరించే అధికారం ఆర్డీవోలకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ANDHRA PRADESH NEWS
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడునిపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
అక్టోబర్ 4 నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. 8న గరువ వాహనంపై విహరించనున్న శ్రీవారు.
వెలిగొండ ప్రాజెక్టు పై ఎందుకంత నిర్లక్ష్యం. – జగన్
వీవీపాట్ లతో ఈవీఎంలు సరిపోల్చకుండా కేవలం మాక్ పోల్ నిర్వహిస్తామనడంతో నిరసనగా అక్కడి నుండి వెళ్లిన బాలినేని. ఆగిపోయిన వెరిఫికేషన్ ప్రక్రియ.
ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి.
ఏపీ రాజధాని అమరావతిలో నేషనల్ గేమ్స్ నిర్వహణకు కృషి : ఎంపీ కేశినేని చిన్ని.
NATIONAL NEWS
23న ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. స్పష్టత నిచ్చిన విదేశాంగ శాఖ. పోలాండ్ పర్యటనకు ప్రధాని మోదీ.. 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ..
మంకీపాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. విమానాశ్రయాలకు కేంద్రం అడ్వైజరీ.
ఆర్టికల్ 370 పునరుద్ధరణ : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో
ఉదంపూర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. కాల్పుల్లో సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వీరమరణం
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్.. సీబీఐకి అనుమతిచ్చిన హైకోర్టు.
ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.
త్రిపుల్ తలాక్ ఆచారం ప్రమాదకరం.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్.
ఇందిరా గాంధీలా బెంగాల్ సీఎంపై కాల్పులు జరపాలంటూ పోస్ట్.. బీకాం విద్యార్థి అరెస్ట్.
తమిళనాడు కొత్త సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న మురుగనందమ్.
భారత ఆర్మీ మాజీ చీఫ్ పద్మనాభన్ కన్నుమూత.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన్ని సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గత 52 రోజులుగా సాగిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం శ్రావణ పూర్ణిమతో ముగిసింది.
INTERNATIONAL NEWS
అధ్యక్ష ఎన్నికల ముంగిట బైడెన్ కీలక నిర్ణయం, యూఎస్ పౌరుల ఇమ్మిగ్రేంట్ భాగస్వాములకు సిటిజన్ షిప్.
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ చాన్సలర్ పదవికి నామినేషన్ వేసిన ఇమ్రాన్ ఖాన్.
7.90 సెం.మీ నాలుక.. అమెరికా మహిళ గిన్నిస్ రికార్డ్.
కొవిడ్ కొత్త వేరియెంట్ ‘కేపీ.2’ అమెరికాను వణికిస్తున్నది. దవాఖానల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. ప్రతి 10 లక్షల మందికి ఒకటి నుంచి నాలుగుకు పెరిగింది.
నాలుక రంగును చూసి వ్యాధులలను గుర్తించే కృత్రిమ మేధ
BUSINESS NEWS
అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ బ్లాక్‌స్టోన్‌తో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బచ్ సంబంధాలు కలిగివున్నట్లు ది మార్నింగ్ కంటెక్స్ తన కథనంలో వెల్లడించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిట్ల సేకరణపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
ఓనం.. దీపావళి పండుగల వేళ.. విమాన యానానికి ఫుల్ గిరాకీ.. 30 శాతం పెరిగిన టికెట్ ధరలు.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్స్ ప్లాంట్‌ను కొనుగోలు చేసే యోచనలో ఆదాని ఉన్నారు
కొంగర్‌కలాన్ వద్ద రూ.2,800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌ను ఈ నెల 23న ప్రారంభించనున్నట్లు కేన్స్ టెక్నాలజీ చైర్మన్ ప్రకటించారు.
SPORTS NEWS
టాప్ ర్యాంకు టెన్నిస్ ప్లేయర్లు ఇగా స్వియాటెక్ (పోలండ్), అరీనా సబలెంక (బెలారస్), జన్నిక్ సిన్నర్ (ఇటలీ), అలగ్జాండెర్ జ్వెరెవ్ (జర్మనీ) సిన్సినాటి ఓపెన్‌లో సెమీస్‌కు చేరారు.
లసాన్నే డైమండ్ లీగ్ లో ఇది వరకే రెండుసార్లు విజేతగా నిలిచిన నీరజ్ హ్యాట్రిక్‌పై కన్నేశాడు. అయితే.. ఈసారి విజయం అతడికి అంత తేలిక కాకపోవచ్చు.
అథ్లెట్లకు సమస్య ఏంటంటే బరువు విషయంలో రూల్ అంటే రూల్. అది పోటీల్లో పాల్గొనే అందరికీ ఒకేలా ఉంటుంది. నిర్ణీత బరువు కంటే ఏ కొంచెం ఎక్కువున్నా ఉపేక్షించేది లేదు. విభాగానికి తగ్గ బరువు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా రెజ్లర్‌దే” అని కాస్ వినేశ్ ఫొగాట్ తీర్పు లో వెల్లడించింది.