Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 12 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 12 – 2024

BIKKI NEWS (DEC 12) : TODAY NEWS IN TELUGU on 1st DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 1st DECEMBER 2024

TELANGANA NEWS

21 వేల కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి చేకూరేలా రైతు రుణమాఫీ చేశాం. – సీఎం

అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందేని, భూమితో మనకు ఎంతో అనుబంధం ఉన్నా, అభివృద్ధి కోసం భూ సేకరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరాఖండిగా చెప్పారు.

మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఎంపీహెచ్‌ఏ) నోటిఫికేషన్‌ 2002 వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ నోటిఫికేషన్‌లో అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు వెలువరించిన తరువాత కూడా ప్రభుత్వం జీవో 1207 ద్వారా 1200 మందిని అడ్డదారిలో నియామకాలు చేసిందని తప్పుపట్టింది.

ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో-317 బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. కొత్తగా మ్యూచువల్‌, స్పౌజ్‌, మెడికల్‌ క్యాటగిరీ బదిలీలకు అవకాశం ఇచ్చింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ చేస్తూ టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఈ నెల 5న చలో బస్‌ భవన్‌కు పిలుపునిచ్చింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా శనివారం సిర్పూర్‌-టీ మండలం దుబ్బగూడలో రైతు సురేశ్‌పై పులి పంజా విసిరింది.

జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఐడల్ అవార్డు అందుకున్నారు.

ANDHRA PRADESH NEWS

ఫెంగల్‌ తుపాన్‌ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకావముందని వాతావరణశాఖ హెచ్చరికల మేరకు ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

రేషన్‌ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్‌ అర్థం కాదా.. షర్మిలపై మాజీ మంత్రి రోజా సెటైర్లు

చెప్పిన హామీల‌ను అమ‌లు చేయ‌డం చేత‌కాక‌ డైవ‌ర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు జ‌గ‌న్ గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికైనా ఉందా అని కూటమి నాయకులను వైసీపీ ప్రశ్నించింది.

NATIONAL NEWS

సమాఖ్య వ్యవస్థలో ప్రతి విభాగానికి గుర్తింపు, పరిధి ఉండేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

అదానీ గ్రూప్‌నకు సవాళ్లు ఎదురవడం ఇదే మొదటిసారి కాదని ఆ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ చెప్పారు. అదానీ గ్రూప్‌పై జరిగే ప్రతీ దాడి దానిని మరింత బలోపేతం చేస్తుందని, ప్రతి అడ్డంకి దాని ఎదుగుదలకు ఓ మెట్టుగా మారుతుందని చెప్పారు.

షేక్‌ సరాయ్‌ ప్రాంతంలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా ఓ యువకుడు గుర్తు తెలియని ద్రవాన్ని ఆయన పైకి చల్లాడు.

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వ్యక్తిగత జీమెయిల్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు శనివారం తెలిపారు.

ఫెంగల్‌’ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో శనివారం భారీ వర్షాలు కురిశాయి.

ఓ అంచనా ప్రకారం భారతదేశంలో ఏటా 45,900 నుంచి 58వేల మంది వరకు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

గగ‌న‌యాత్రికులు శుభాన్షు శుక్లా, బాల‌కృష్ణ నాయ‌ర్‌లు.. నాసాలో ప్రాథ‌మిక శిక్ష‌ణ పూర్తి చేసుకున్న‌ట్లు ఇస్రో తెలిపింది.

వారణాసి లోని కాంట్‌ రైల్వే స్టేషన్‌ లోని పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 వాహనాలు దగ్ధమయ్యాయి.

INTERNATIONAL NEWS

చైనాలో భారీ బంగారు గని బయల్పడింది. ఈ గనిలో దాదాపు 1000 టన్నుల అత్యంత నాణ్యమైన పుత్తడి నిల్వలు ఉన్నాయని, ఈ బంగారం విలువ సుమారు 83 బిలియన్‌ డాలర్ల (రూ.7,01,885 కోట్లు) మేరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హిందూ మత వ్యతిరేక అల్లర్లు.. మరో 3 ఆలయాలు ధ్వంసం

ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, నేటికీ దానిని ఉల్లంఘిస్తూ డ్రోన్ల దాడులు కొనసాగుతున్నాయి.

BUSINESS NEWS

గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల గడువు డిసెంబర్ 15 వరకు పెంచిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.

సబ్బుల ధరలకు రెక్కలొచ్చాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ సంస్థలు అన్ని రకాల సబ్బుల ధరలను 7 – 8% పెంచుతున్నట్లు ప్రకటించాయి.

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) వద్ద కేంద్ర ప్రభుత్వం 98 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నది.

ఏడు నెలల్లో 50 శాతం పెరిగాయ్‌.. పసిడి రుణాలకు ఫుల్‌ డిమాండ్‌: ఆర్బీఐ

SPORTS NEWS

సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ సూపర్‌-300 టోర్నీలో భారత షట్లర్లు సింధు, లక్ష్యసేన్ లు ఫైనల్ కు చేరారు.

యూత్‌ ఆసియాకప్‌లో శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది

ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో డింగ్‌ లిరెన్‌, గుకేశ్‌ మధ్య 5వ గేమ్ డ్రా గా ముగిసింది. దీంతో చేరో 2.5 పాయింట్లు దక్కాయి.

యాషెస్‌ కంటే.. ఆస్ట్రేలియా- భారత్‌ మధ్య పోరే పెద్దది.. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ వ్యాఖ్యలు..

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ లో ఈ విద్యా సంవత్సరానికి పాత విధానంలోనే పదో తరగతి పరీక్షలు.

ఆర్మీ ఆర్డ్‌నెన్స్ లో 723 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్

MPHA నియామకం చెల్లదు. జీవో 1207 కొట్టివేత – హైకోర్టు

తెలంగాణ ఎంఈడీ, ఎంపీఈడీ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియామకం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు