BIKKI NEWS (AUG 01) : TODAY NEWS IN TELUGU on 1st AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 1st AUGUST 2024
TELANGANA NEWS
మూడు నెలల్లో భూముల క్రమబద్ధీకరణ – LRS మార్గదర్శకాలు విడుదల.
నాలుగో నగరంగా ముచ్చర్ల అభివృద్ధి – రేవంత్ రెడ్డి.
మూడేళ్ల కిందట రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దినేష్ కుమార్ అనే నిందితుడికి హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చింది.
బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలు.. రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్
సీఎం రేవంత్ నోటికొచ్చింది మాట్లాడుతున్నడు.. సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం.
తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన.. పలు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్.
ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం.
ANDHRA PRADESH NEWS
ఏపీలో 96 మంది డీఎస్పీల బదిలీ.
ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగవలసిన సమావేశం వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు.
చంద్రబాబుతో మాట్లాడి పేకాట క్లబ్‌లు తెరిపిస్తా.. టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు.
ఏపీలో 1,29,972 కోట్లతో ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ .
NATIONAL NEWS
వయనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేసిన గౌతం అదానీ.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5కోట్ల విరాళం
ఇది అత్యంత బాధాకరమైన విపత్తు.. వయనాడ్ విలయంపై సీఎం పినరయి విజయన్
పూజా ఖేద్కర్ సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ.. భవిష్యత్తు పరీక్షల నుంచి డిబార్.
కాంగ్రెస్ పట్ల ప్రజలు సానుకూలంగానే ఉన్నారు.. కానీ, అతివిశ్వాసం వద్దు.. పార్టీ నేతలకు సోనియా సూచన.
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా తొలిసారి ఒక మహిళా అధికారి నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా
నాయర్ నియమితులయ్యారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కవిత, కేజ్రీవాల్ కస్టడీ గడువు పొడిగింపు.
2040 వరకు 10% మునిగిపోనున్న ముంబై. 5% మునిగిపోనున్న వైజాగ్
INTERNATIONAL NEWS
ఉత్తర కొరియాలో వరదలు.. విపత్తు సహాయక చర్యల్లో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారు.
BUSINESS NEWS
రికార్డు స్థాయి గరిష్ఠాల వద్ద ముగిసిన మార్కెట్లు.
సెన్సెక్స్ : 81,741 (286)
నిఫ్టీ : 24,951 (94)
2023-24 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు.. 70శాతం కొత్త పన్ను విధానంలోనే..
జీవిత, వైద్య బీమా పథకాలపై జీఎస్టీ వద్దు.. నిర్మలా సీతారామన్‌కు నితిన్ గడ్కరీ లేఖ
జూన్ 2024 లో మౌళిక రంగ వృద్ధి 4%.
భారత జీడీపీ వృద్ధి రేటు 7.5% – ఇండియా రేటింగ్స్.
SPORTS NEWS
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ :
50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే చివరి రౌండ్‌కు అర్హత సాధించాడు.
లక్ష్యసేన్ సంచలన విజయం నమోదు చేసి పారిస్ ఒలింపిక్స్‌లో ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన పీవీ సింధు
లవ్లీనా మహిళల 75 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్ పోరులో భాగంగా లవ్లీనా 5-0 తో సున్నివా హెఫ్‌స్టడ్ (నార్వే)ను మట్టికరిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ప్రీ క్వార్టర్స్ కి చేరిక.
భారత ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో 16వ రౌండ్‌కు అర్హత సాధించింది.
ప్రీ క్వార్టర్స్ లో మనికా బత్రా ఒటమి..
ICC TEST RANKINGS
జో రూట్ బ్యాటింగ్ లో టాప్ ప్లేస్
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ లలో టాప్ ప్లేస్
రవిచంద్రన్ అశ్విన్ బౌలర్లలో టాప్ ప్లేస్
టీమిండియా మాజీ ప్లేయర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత
EDUCATION & JOBS UPDATES
81,490 మందికి రెండో దశలో బీటెక్ సీట్ల కేటాయింపు. సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ఆగస్టు 02.
ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్ల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ
ఇంటర్ అడ్మిషన్లు గడువు ఆగస్టు 20 వరకు పొడిగింపు
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ ఉద్దేశం లేదు. – కేంద్రం స్పష్ఠీకరణ.
ENTERTAINMENT UPDATES
లావణ్యకు భయపడను.. న్యాయం జరిగే వరకు పోరాడుతా : రాజ్‌తరుణ్.
అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ మూవీ ఆగస్టు 2 న విడుదల.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడర సామీ మూవీ ఆగస్టు 2 న విడుదల.