BIKKI NEWS (AUG 19) : TODAY NEWS IN TELUGU on 19th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 19th AUGUST 2024
TELANGANA NEWS
విభజన చట్టంపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సింఘ్వీకి రాజ్యసభ : సీఎం రేవంత్
రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీకి రూ.19వేల కోట్ల నిధులు మంజూరు చేశామని, మరో రూ.12వేల కోట్లు త్వరలోనే మంజూరు చేసి త్వరలోనే రైతులందరికీ రుణమాఫీని పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్
తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆర్‌టీవీపై బీఆర్‌ఎస్ చర్యలకు ఉపక్రమించింది. బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనం అని ఫేక్ వార్తలు ప్రచారం చేసిన ఆర్‌టీవీ, రవి ప్రకాశ్‌కు లీగల్ నోటీసులు పంపించింది.
రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్‌పై పోరాడతాం.. రాహుల్, ఖర్గేకు కేటీఆర్ లేఖ.
కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు – మంత్రి పొన్నం
గండిపేటలో అనుమతుల లేని అక్రమ నిర్మాణాలు కూల్చి వేసిన హైడ్రా
పర్యాటకకానికి పీపీపీ విధానం – మంత్రి జూపల్లి
ANDHRA PRADESH NEWS
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోరు మండలం పందలపాకలో గుళికలు మందు చల్లుతూ 8 మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఆదివారం, సోమవారం లలో భారీ వర్ష సూచన.. హెచ్చరించిన వాతావరణ కేంద్రం.
చంద్రబాబు బాహుబలి కాదు.. బలహీన బలి అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఎద్దేవా చేశారు. కేంద్రం సాయం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు పదే పదే పరుగులు పెడుతున్నారని ప్రశ్నించారు.
తిరుమల శ్రీవారి భక్తులు నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 19వ తేదీన విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
శ్రీసిటిలో నేడు 15 సంస్థలను ప్రారంభించనున్న చంద్రబాబు
10 మంది డీఎస్పీ ల బదిలీ
NATIONAL NEWS
కేంద్రంలోని అధికార బీజేపీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను డబ్బు సంచులతో కొని విపక్షాలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఒక వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు.
సోమవారం సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేర్కొంది.
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దిక్కుతోచని స్థితిలో కనిపించిన ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కాపాడింది.
కోల్‌కతా ఆర్జీ కార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించనున్నది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ ఆదివారం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.
లేటరల్ ఎంట్రీ నియామకాలు రిజర్వేషన్ల కు గొడ్డలి పెట్టు – రాహుల్ గాంధీ
INTERNATIONAL NEWS
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కంటే తానే బాగుంటానని ట్రంప్ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.
ఆఫ్రికాలో 18 వేలకు చేరిన మంకీ ఫాక్బ్ కేసులు.
రష్యాలో రెండు వంతెన ల పై ఉక్రెయిన్ దాడి
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.25 గంటలకు కంచట్కా ద్వీపకల్పంలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో షివేలుచ్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. సుమారు 8 కిలోమీటర్ల ఎత్తువరకు లావాను వెదజళ్లుతున్నది.
వ్యవస్థ లను హసీనా నాశనం చేశారు. – బంగ్లాదేశ్ సారథి యూనస్
జర్మనీ లో ఫెర్రిస్ జెయింట్ వీల్ కు మంటలు అంటుకోవడంతో 30 మంది కి గాయాలు.
BUSINESS NEWS
ఈ వారం స్టాక్ మార్కెట్లు లాభాలు పండించే అవకాశం.
2030 వరకు లక్ష మంది కంపెనీ సెక్రటరీ లు అవసరం
భారత్ లో ఫాక్స్ కాన్ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్
SPORTS NEWS
మహిళల అండర్ – 19 టీట్వంటీ వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ విడుదల. జనవరి 18 నుండి ఫిబ్రవరి 02 వరకు ఈ టోర్నీ జరగనుంది.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించి 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
టెస్టుల్లో ఒక జట్టు పై వరుసగా అత్యధిక సార్లు (10) సిరీస్ నెగ్గిన జట్టు గా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టిండీస్ పై వరుసగా 10 టెస్టు సిరీస్ లలో విజయం సాదించింది.
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మరో వారంలో మొదలవ్వనుంది. చైనా ఆతిథ్యమిస్తున్న ప్రతిష్ఠాత్మక ఈ టోర్నమెంట్ కోసం భారత్ 39 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ జట్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘ది హండ్రెడ్ లీగ్’ లో షేర్లు కొంటే చాలు జట్ల పేర్లను మార్చుకోవచ్చని ఈసీబీ తెలిపింది.
రెజ్లింగ్‌ను వదిలేస్తానా? వీడ్కోలును వాపస్ తీసుకుంటానా? అనేది ఇప్పుడే చెప్పలేను అని వినేశ్ తెలిపింది.
ఒలింపిక్స్‌కు షూటర్ల ఎంపిక విధానం సరిగ్గా లేదని జస్పాల్ రానా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
150 ఏళ్ల టెస్టు క్రికెట్ కు చిహ్నంగా 2027 మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మద్య మ్యాచ్.
మహిళల హండ్రెడ్ టోర్నీ 2024 విజేతగా లండన్ స్పిరిట్ జట్టు. సిక్స్ కొట్టి గెలిపించిన దీప్తి శర్మ.
ఏపీ రాజధాని అమరావతిలో నేషనల్ గేమ్స్ నిర్వహణకు కృషి : ఎంపీ కేశినేని చిన్ని
EDUCATION & JOBS UPDATES
SBI ఫౌండేషన్ ఆశా స్కాలర్ షిప్ – 6 వ తరగతి నుంచి ఐఐఎం వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి తో సుప్రీంకోర్టు లో జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలు
అగ్ని వీర్ వాయు స్పోర్ట్స్ 2025 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
కేవీఎస్ గచ్చిబౌలి లో కాంట్రాక్టు ఉద్యోగ నియామక ప్రకటన
తెలంగాణ లో ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ సీట్ల కై కౌన్సెలింగ్
రాష్ట్ర మిలిటరీ స్కూల్ లో అడ్మిషన్స్
బీసీ గురుకులాల్లో ఫైన్ ఆర్ట్స్ స్కూల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువు ఆగస్టు 24 వరకు పెంపు.