TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 10 – 2024

BIKKI NEWS (OCT. 18) : TODAY NEWS IN TELUGU on 18th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 18th OCTOBER 2024

TELANGANA NEWS

రాష్ట్రంలో జాతీయ నూతన విద్యావిధానాన్ని(ఎన్‌ఈపీ) అమలు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో సోషల్‌ ఎకనామిక్‌ సర్వే నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తున్నది. 60 రోజుల్లో సర్వే పూర్తిచేయాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో ఫార్మాట్‌ రూపకల్పనపై మంతనాలు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈనెల 23న జరిగే క్యాబినెట్‌ సమావేశంలో 17.29 శాతం డీఏలపై చర్చించి, దీపావళి కానుకగా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.

మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు వాంగ్మూలాన్ని శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేయనుంది.

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కళాశాలల బంద్‌ను విరమించుకుంటున్నట్టు తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నేతలు తెలిపారు.

మూసీనదిపై తాము చేపట్టబోయేది సుందరీకరణ ప్రాజెక్టు కాదని, పునరుజ్జీవ ప్రాజెక్టు అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో ఫార్మసీ కాలేజీలను శుక్రవారం నుంచి నిరవధికంగా బంద్‌ చేయనున్నట్టు ఫార్మసీ కాలేజీల యాజమాన్య సంఘం ప్రకటించింది.

గ్రేటర్‌ పరిధిలో మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ నెల 23వ తేదీన రాష్ట్ర మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సాయంత్రం 4 గంట‌ల‌కు కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది.

ANDHRA PRADESH NEWS

తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన ఆమ్రపాలి కాట, రోనాల్డ్‌ రోస్, వాణీ ప్రసాద్‌, వాకాటి కరుణ ఏపీ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ను కలిసి రిపోర్టు చేశారు.

ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఐఏఎస్‌ అధికారులు సృజన, హరికిరణ్‌, శివశంకర్‌లు బుధవారమే హదరాబాద్‌కు వచ్చి సీఎస్‌ శాంతికుమారికి రిపోర్టు చేశారు.

తిరుమల శ్రీవారిమెట్టు నడక మార్గాన్ని మూసివేసిన టీటీడీ

చెందిన కీలక నాయకుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మదునూరి మురళీకృష్ణంరాజు గురువారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు

ఏపీలోని టీడీపీ ప్రధానకార్యాలయంపై దాడిచేసిన కేసులో వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు విచారకు హాజరయ్యారు.

NATIONAL NEWS

పౌరసత్వ చట్టం సెక్షన్‌ 6ఏ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.

కేంద్రంలో మోదీ సర్కార్‌ తీరును నిరసిస్తూ నవంబర్‌ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) తెలిపింది.

అస్సాంలో ‘లోకమాన్య తిలక్‌’ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని సమాచారం.

హర్యానా ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ఓబీసీ నేత నాయబ్‌ సింగ్‌ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు

రాజస్థాన్‌లోని కోటాలో మరో నీట్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మీర్జాపూర్‌కు చెందిన అశుతోశ్‌ చౌరాసియా (20) అనే విద్యార్థి కోటాలో ఉంటూ నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.

నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన పదేండ్లలో పన్ను వసూళ్లు 182 శాతం పెరిగి రూ.19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

బీహార్‌లో కల్తీమద్యం తాగి 24 మంది మృతి

ఈపీఎఫ్‌వో లోని సభ్యులందరికీ గతంలో పెంచిన బీమా ప్రయోజనాలను పొడిగిస్తున్నట్టు గురువారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ప్రకటించారు

INTERNATIONAL NEWS

తమ దేశంలోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన అఫ్గానిస్థాన్‌కు చెందిన 250 మంది పౌరులను ఇరాన్‌ సరిహద్దు భద్రతా దళాలు గత వారం హతమార్చాయి.

యెమెన్‌లో హౌతీ తిరుగుబాటు దళాలపై ఇప్పటివరకు సాధారణ ఫైటర్‌ జెట్‌లను వాడిన అమెరికా, అత్యంత భీకరమైన అడ్వాన్స్‌డ్‌ ‘బీ-2’ స్టెల్త్‌ బాంబర్స్‌ను రంగంలోకి దింపింది.

కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌(ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై గురువారం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

BUSINESS NEWS

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి

సెన్సెక్స్ : 81,007 (-495)
నిఫ్టీ : 24,750 (-221)

ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ విలువ ఇప్పుడేమీ లేదని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ అన్నారు.

విప్రో రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు మరో షేరును బోనస్‌గా అందిస్తున్నట్లు ప్రకటించింది.

పది గ్రాముల బంగారం ధర రూ.76,899 వద్ద ట్రేడవుతున్నది.

SPORTS NEWS

న్యూజిలాండ్ తో టెస్ట్ లో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సరికి కివీస్ జట్టు 180/3 పరుగులతో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ 2025 సీజన్‌కు హేమాంగ్‌ బదానీని చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆశలు మోస్తున్న ఏకైక షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ను ఓడించి దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరింది.

EDUCATION & JOBS UPDATES

UGC NET 2024 పరీక్ష ఫలితాలు విడుదల

ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్

46 కేంద్రాలలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు

ఎయిర్‌పోర్ట్ లో 1066 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

త్వరలోనే 3500 లైన్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

విద్యుత్ సంస్థలో 117 ఇంజనీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు చేస్తున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) గురువారం ప్రకటించింది. ఇక నుంచి సెక్షన్‌ బీలో ఆప్షనల్‌ ప్రశ్నలు ఉండవని పేర్కొన్నది.

ENTERTAINMENT UPDATES

ఫెమీనా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2024 పోటీల్లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నిఖితా పోర్వాల్‌ విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు