BIKKI NEWS (AUG 18) : TODAY NEWS IN TELUGU on 18th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 18th AUGUST 2024
TELANGANA NEWS
రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు.. ఆపైన ఉన్న మొత్తాన్ని బ్యా ంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టంచేశారు.
వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కరెంట్ బిల్లులు ఇక ఫోన్‌పే, గూగుల్‌పేలో చెల్లించొచ్చు
హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ(ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేస్తారు.
జగిత్యాల జిల్లాల్లో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్ నడుస్తున్న సమయంలో వెనుకాల చక్రాలు రెండు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది.
స్కిల్ యూనివర్సిటీలో పలు రంగాల కోర్సులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించామని.. ఇందులో విజయదశమి నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించినట్లు చెప్పారు.
తెలంగాణ మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరవుతానని తెలిపారు.
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.
2 లక్షల లోపు రుణమాఫీ కాని వారు మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ ను కలవాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జి గా అభయ్ పాటిల్
ANDHRA PRADESH NEWS
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు, పలువురు కేంద్ర మంత్రులను శనివారం సాయంత్రం కలిశారు.
ఏపీలో 19 నుంచి 31వ తేదీవరకు ఉద్యోగుల బదిలీలు.. మార్గదర్శకాలు జారీ.
వైద్యులతో చర్చలు సఫలం.. ఏపీలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే కారణం.. మండిపడ్డ వైసీపీ
మార్గదర్శి కేసులో క్వాష్ పిటిషన్ కోట్టివేయాలంటూ హైకోర్టు లో ఆర్బీఐ కౌంటర్
వైకాపా కు మాజీమంత్రి ఆళ్ళ నాని రాజీనామా.
NATIONAL NEWS
ఆందోళన విరమించండి.. సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తాం : వైద్యులకు కేంద్రం విజ్ఞప్తి
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వైరస్ అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 15,600 మందికి సోకగా.. అందులో 537 మంది ప్రాణాలు కోల్పోయారు.
మంకీపాక్స్ కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో దేశంలో మంకీపాక్స్ ప్రవేశించే అవకాశాలపై చర్చించారు. అదేవిధంగా ఒకవేళ మంకీపాక్స్ వస్తే దాన్ని అడ్డుకోవడం ఎలా, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి..? అనే అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.
చాందీపురా వైరస్ లాంటి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స పొందుతూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మృతిచెందాడు. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రిపోర్టు ప్రకారం 21 ఏళ్ల ఆ వ్యక్తికి చాందీపురా వైరస్ లాంటి లక్షణాలు ఉన్నట్లు తేలింది.
ముదా స్కాంలో కర్ణాటక గవర్నర్ నిర్ణయంతో సీఎం సిద్ధరామయ్య అరెస్ట్ కాబోతున్నారా..?
ప్రముఖ కొండ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ను మరోసారి మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. శుక్రవారం అర్ధరాత్రి సిమ్లా జిల్లాలోని రాంపూర్ సబ్‌డివిజన్‌లో గల తక్లోచ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది.
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులు సేఫ్
బీహార్‌లో మరోసారి కూలిన గంగానదిపై నిర్మిస్తున్న తీగల వంతెన.. ఇప్పటికి ఇది మూడోసారి
INTERNATIONAL NEWS
బంగ్లాదేశ్ హింసాకాండలో 650 మంది మృతి.. ఐక్యరాజ్య సమితి నివేదిక.
సూడాన్‌లో మరోసారి రక్తపాతం.. పారామిలటరీ దళాల కాల్పుల్లో 80 మంది మృతి
బ్రిటీష్ పర్వతారోహకుడు జాషువా బ్రెగ్‌మెన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 18,753 అడుగుల ఎత్తైన కొండ నుంచి పారాచూట్ ద్వారా కిందకు దూకాడు.
BUSINESS NEWS
భారత్ వృద్ధిరేటు కొనసాగాలంటే ఆదాయం పన్ను వసూళ్లు పెరగాలని, జీ-20 దేశాలతో సమానంగా 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపినాథ్ చెప్పారు.
భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరుగుతున్న హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ సేల్స్, దవాఖానలు, ఐవీఎఫ్ క్లినిక్స్‌ల్లో లావాదేవీలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ విభాగానికి సీబీడీటీ నొక్కి చెప్పింది.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే యూపీఐ ఆటో పే రిక్వెస్టుల పట్ల అలర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్వీడన్ లో నివసిస్తున్న విదేశీయులను వారి సొంత దేశాలకు పంపడానికి వారికి 80,000 ఇవ్వడంతో పాటు రవాణా ఖర్చులు భరించడానికి నిర్ణయం తీసుకుంది.జనాభని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది
శుక్రవారం ముగింపుతో పోలిస్తే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.1,150 అధికమై రూ.72,770 పలికింది. అటు 22 క్యారెట్ ధర కూడా రూ.1,050 అధికమై రూ.66,700కి చేరుకున్నది.
SPORTS NEWS
భారత్ చేరుకున్న వినేశ్ ఫోగాట్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రెజ్లర్. మీ ప్రేమ ముందు వెయ్యి బంగారు పతకాలైనా తక్కువే’ అని వినేశ్ ఫోగాట్ తెలిపింది.
యూత్ ఒలింపిక్స్ 2030కు భారత్‌లోని ముంబై నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీ లలో క్రికెట్ ను ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఆగస్టు 22 నుంచి ఆరంభం కానున్న లసాన్నే డైమండ్ లీగ్ బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు నీరజ్ చోప్రా తెలిపాడు.
ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్‌లో ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మొన్ఫిల్స్ చేతిలో ఓడిపోయాడు.
మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణ విషయంలో తమకు అవకాశం కల్పించాలని జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని
EDUCATION & JOBS UPDATES
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సిలబస్ కుదించి, ప్రథమ సంవత్సరం లో ఇంటర్నల్ పరీక్షలు పెట్టె యోచనలో బోర్డు
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్, డ్రగ్స్‌ను నివారించేందుకు పది రోజుల్లోపు టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో తెస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు
కేంద్ర ఆర్థిక శాఖ, హోం, వ్యవసాయం, విద్య..ఇలా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్‌స్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ప్రైవేట్ రంగ ఉద్యోగుల నుంచి కూడా వీటికి దరఖాస్తులు స్వీకరించబోతున్నది.