BIKKI NEWS (SEP. 17) : TODAY NEWS IN TELUGU on 17th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 17th SEPTEMBER 2024
TELANGANA NEWS
ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 ను ప్రజా పాలన దినోత్సవం గా జరుపుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి, భారత రత్న రాజీవ్ గాంధీ విగ్రహవిష్కరణ
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా: కేటీఆర్
ANDHRA PRADESH NEWS
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసు కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో జనసేన పార్టీ చర్యలు చేపట్టింది.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పల్నాడు లో రోడ్ ప్రమాదం ఇద్దరు మృతి.
అమరావతి రైతులకు కౌలు డబ్బులు విడుదల
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్ష విధానంలో మార్పులు – లోకేష్
ఏపీ లో ఒకేరోజు 13,326 గ్రామ సభలు – ప్రపంచ రికార్డు
NATIONAL NEWS
కేరళలో నిఫా వైరస్ కలకలం.. మాస్క్‌లు తప్పనిసరి చేసిన అధికారులు
ఆరోపణలు వచ్చినప్పుడే రాజీనామా చేయాల్సింది : కేజ్రీవాల్ నిర్ణయంపై బీజేపీ
వంద రోజుల ప్రణాళికలో ఒక్క హామీ నెరవేర్చలేదు : మోదీ సర్కార్‌పై ఆదిత్య ఠాక్రే ఫైర్
కోల్‌కతాలో యువ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఐదోసారి చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు ఇదే చివరి ఆహ్వానమని స్పష్టం చేశారు. సమావేశం కాళీఘాట్ నివాసంలో సమావేశం జరుగనుండగా.. చర్చలకు హాజరయ్యేందుకు వైద్యులు అంగీకరించారు.
నేడే సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్
నమో భారత్ ర్యాపిడ్ రైల్ సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు
మధ్యప్రదేశ్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాలు, వరదలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా తెలిపారు.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని అన్నారు
రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు తాను గతంలోనే సూచించినట్లు అన్నా హజరే తెలిపారు. అయితే ఆయన తన మాట వినలేదని విమర్శించారు.
INTERNATIONAL NEWS
ముందు మీ దేశంలో పరిస్థితులు చెక్ చేసుకోండి.. ఇరాన్ నేత ఖమేనీకి భారత్ హితవు.
ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఎంపీలకు యాంటీ టెర్రరిజం కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. తక్షణమే ఆ ఎంపీలను రిలీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
BUSINESS NEWS
జీవితకాల గరిష్ఠానికి సూచీలు.
సెన్సెక్స్ : 82,989 (98)
నిఫ్టీ : 25,384 (27)
రూ.347తో బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్.. 54 రోజుల వ్యాలిడిటీ.. 3జీబీ డేటా..
దేశంలోనే అత్యంత విలువైన హౌసింగ్ ఫైనాన్స్ సంస్థగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నిలిచింది.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో యూపీఐ లైట్ యూజర్ల కోసం ఆటో టాప్ అప్ సర్వీస్‌ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
భారత్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్’కు టైమ్ మ్యాగజైన్‌లో చోటు దక్కింది.ప్రొఫెషనల్ సర్వీసెస్ క్యాటగిరీలో గ్లోబల్ టాప్-10 సంస్థల్లో ఒకటిగా నిలిచింది
27 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024.. ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
SPORTS NEWS
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కొరియా పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 4-1 తేడాతో జయభేరి మోగించింది. ఫైనల్ లో చైనా తో తలపడనుంది.
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య చైనా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ పాకిస్థాన్ ను చైనా చిత్తుగా ఓడించింది
‘బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు చేయండి’.. హిందూ జనజాగృతి సమితి డిమాండ్
ఆగస్టు నెలకు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులను కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో దునిత్ వెల్లలాగే, మహిళల కోటాలో ఆసియా కప్ హీరో హర్షిత సమరవిక్రమ లు విజేతగా నిలిచారు.
EDUCATION & JOBS UPDATES
CBSE – సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సోసైటీ లో కాంట్రాక్టు ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి